భక్తుల కోసం బంపర్ ఆఫర్

ప్రపంచంలోనే అత్యంత సంపన్నవంతమైన దేవాలయంగా పేరొందిన తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అసాధారణమైన రీతిలో ఏర్పాట్లు చేస్తోంది. నిజాయితీ, నిబద్ధతకు మారు పేరుగా పేరొందిన సీనియర్ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ ఈవోగా పని చేస్తున్నారు. ఆయనతో పాటు గతంలో ఈవోగా పనిచేసిన, అపార అనుభవం కలిగిన ధర్మా రెడ్డిని ఏరి కోరి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నియమించారు. మరో వైపు పూర్తి కాలపు టీటీడీ పాలక మండలిని సైతం నియమించారు. ఆలయ చైర్మన్ గా ఎస్.వి. సుబ్బారెడ్డి పూర్తి బాధ్యతలు చేపట్టాక వివిఐపీలకు కల్పిస్తున్న స్పెషల్ దర్శనాలకు చెక్ పెట్టారు.

ఎంతో దూరం నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. నిత్యం ఏ ఒక్క భక్తుడు, భక్తురాలు ఆకలితో ఉండకుండా ఉండేందుకు గాను టైమింగ్స్ వేళలు మార్చారు. ఉదయం టిఫిన్స్, 11 గంటల నుండి రాత్రి 12 గంటల దాకా అన్నదానం ఉండేలా డిసిషన్ తీసుకున్నారు. దేవాలయం ప్రాంగణంలో, చుట్టూ పక్కల పరిసరాలలో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడరాదని ఆదేశాలు జారీ చేశారు. సామాన్యులకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ఇదే సమయంలో వృద్దులు, చంటి పిల్లలు, తల్లులు స్వామి, అమ్మ వార్లను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున వస్తుంటారు.

వారి కోసం టీటీడీ ప్రత్యేక సదుపాయాలూ కల్పిస్తోంది. వయో వృద్ధులు, దివ్యాంగుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టింది. వీరికి టీటీడి ప్రత్యేక దర్శనం కల్పిస్తోంది. 4 వేల టోకెన్లను ప్రత్యేకంగా వీరి కోసం కేటాయించినట్లు టీటీడి తెలిపింది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. వృద్ధులు, దివ్యాంగులు రద్దీ రోజుల్లో తిరుమలకు వచ్చి ఇబ్బందులు పడకుండా, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడి శ్రీవారి భక్తులను కోరింది.

ఎస్వీ మ్యూజియం ఎదురుగా గల కౌంటర్ల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు ప్రతి రోజూ 1400 టోకెన్లు జారీ చేస్తున్నట్లు టీటీడి తెలిపింది. ఉదయం 7 గంటల నుండి ప్రారంభించి రెండు స్లాట్లకు సంబంధించిన టికెట్లు ఇస్తున్నారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 5 సంవత్సరాల లోపు చంటిపిల్లలను, వారి తల్లిదండ్రులను సుపథం మార్గం ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతించనున్నారు. సాధారణ రోజుల్లో ఒక సంవత్సరం లోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు సుపథం మార్గం ద్వారా దర్శన భాగ్యం కల్పిస్తారు. ఒక రకంగా ఇది భక్తులకు బంపర్ ఆఫర్ అనే చెప్పాలి. వెంకటేశా ..శ్రీనివాసా..గోవిందా..

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!