స్మార్ట్ ఫోన్స్ యూజర్స్ కు 5జీ షాక్
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దెబ్బకు అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే ఇంటర్నెట్ ఆధారిత ప్రపంచం వరల్డ్ మార్కెట్ నే కాకుండా అన్ని దేశాలను ప్రభావితం చేస్తోంది. ప్రధానంగా టెలికాం రంగం అంతకంతకూ విస్తరిస్తోంది. దీనిలో వచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రపంచ గతిని మార్చుతోంది. అతిపెద్ద బిగ్ నెట్ వర్క్ కలిగిన ఇండియాలో టెలికాం రంగానిదే ఆధిపత్యం. దాదాపు 100 కోట్లకు పైగా కమ్యూనికేషన్ పరంగా కనెక్ట్ అయి ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు మొబైల్ వాడటం చేస్తున్నారు. ఆయా టెలికాం ఆపరేటర్స్ మధ్యన పెరిగిన పోటీ వినియోగదారుల పాలిట వరంగా మారింది. ప్రస్తుతం దేశీయ పరంగా చూస్తే ప్రభుత్వరంగ సంస్థ అయిన బిఎస్ఎన్ ఎల్ తో పాటు రిలయన్స్, ఎయిర్ టెల్ కంపెనీలు ఇప్పటికే తమ సర్వీసెస్ అందిస్తున్నాయి.
ఆకర్షణీయమైన ఆఫర్స్ తో తమ కస్టమర్స్ ను పెంచుకునే పనిలో పడ్డాయి. ఎక్కడికక్కడ టెలికాం టవర్స్ ను ఏర్పాటు చేశాయి. ప్రైవేట్ టెలికాం ఆపరేటర్స్ విభాగంలో రిలయన్స్ జియో టాప్ వన్ పొజిషన్ లో కొనసాగుతోంది. ఇదే క్రమంలో 4 జీతో సేవలు అందజేస్తున్నాయి వినియోగదారులకు. ఇదే క్రమంలో 5జీ సర్వీసెస్ ఇవ్వాలనే టార్గెట్ తో ఆయా కంపెనీలు రెడీ అంటున్నాయి. భారత ప్రభుత్వం 5జీ కోసం ఇప్పటికే వేలానికి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందు కోసం బడా కంపీనీలు క్యూ కట్టాయి. అయితే ఇప్పటి దాకా వాడుతున్న కోట్లాది స్మార్ట్ మొబైల్స్ లలో 5జీ సర్వీస్ అందుబాటులో ఉండదు. దీంతో అన్ని మొబైల్స్ పనికి రాకుండా పోతాయి.
దీనిని దృష్టిలో పెట్టుకున్న యాపిల్, శాంసంగ్ , వివో, వన్ ప్లస్, ఒప్పో, షావో మీ, తదితర కంపెనీలన్నీ 5జీ మొబైల్స్ తయారు చేసే పనిలో పడ్డాయి. మొబైల్స్ లో ఇప్పటికే చైనా రారాజుగా వెలుగొందుతోంది. ఇప్పటికే శాంసంగ్ కంపెనీ ఓ మోడల్ ను లాంచ్ చేసింది. తాజాగా ప్రముఖ చైనా మొబైల్ సంస్థ ఒప్పో కూడా 5జీ రేసులోకి వచ్చేస్తోంది. త్వరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చే యోచనలో ఉన్నట్టు తెలిపింది. ఈ ఏడాది చివరి నాటికి క్వాల్‌కామ్ పవర్డ్ డ్యూయల్ మోడ్ 5 జి ఫోన్‌ను విడుదల చేయాలనే ప్రణాళికను వెల్లడించింది. బార్సిలోనాలో జరగనున్న క్వాల్కమ్ 5 జి సమ్మిట్ 2019 లో ఒప్పో 5జీ సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ ఈ వివరాలను వెల్లడించారు.
సైంటిస్ట్ హెన్రీ టాంగ్ షేర్ చేసినవివరాల ప్రకారం ఒప్పో కొత్త 5 జీ మొబైల్ డ్యూయల్ మోడీ లో వస్తోంది. స్టాండ్‌లోన్, నాన్ స్టాండ్ లోన్ నెట్‌వర్క్‌లకు మద్దతు ఇస్తుంది. 5 జీపై ప్రస్తుత స్థితి, భవిష్యత్ ఉత్పత్తులు, యాప్స్, భవిష్యత్తరానికి అందనున్న కట్టింగ్ ఎడ్జ్ అనుభవాలపై తన ఆలోచనలను పంచుకున్నారు. తమ తరువాతి తరం డ్యూయల్-మోడ్ 5జీ డివైస్ ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మార్కెట్లలో ఎక్కువ మంది వినియోగదారులకు ఉన్నతమైన అనుభవాన్ని అందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి