అమిత్ షాకు చిక్కని శివ సేన

భారత రాజకీయాల్లో విస్మరించలేని నాయకుడిగా పేరొందిన అమిత్ చంద్ర షా అంటే కమల దళంతో పాటు విపక్ష నేతలకు దడ. ఎందుకంటే ఎప్పుడు ఎలా దాడి చేస్తారో ఆయనకు తప్పా, ఇంకొకరికి తెలియదు. ఆ అంతుపట్టని సీక్రెట్ ఒక్క తాను నమ్మిన, గురువుగా భావించే ప్రధాని మోదీకి మాత్రమే తెలుసు. ఇంతలా లో ప్రొఫైల్ మెంటైన్ చేసే ఈ ట్రబుల్ షూటర్ కు తాజగా మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల రాజకీయాలు తలనొప్పిగా మారాయి. చావు తప్పి కన్ను లొట్ట పడిందన్న చందంగా తయారైంది బీజేపీ పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో ఆశించిన మెజారిటీ రాలేదు. దీంతో ఇతర పార్టీలపై ఆధార పడక తప్పలేదు.

హర్యానాలో డిప్యూటీ సీఎం పదవి ఇస్తాననడంతో అక్కడ దేవీలాల్ ముని మనుమడు దుశ్యంత్ కొలువు తీరారు. ఇక అసలైన రాజకీయం మాత్రం మరాఠాలో ఇంకా పీటముడి వీడడం లేదు. ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉన్నది. ఇక్కడ బీజేపీ, శివ సేన కలిసి పోటీ చేశాయి. ఈ రెండు పార్టీలకు అధికారాన్ని ఏర్పాటు చేసే స్థాయిలో సీట్లు రాలేదు. దీంతో ఇరు పార్టీలకు సీఎం కుర్చీ దగ్గర పేచీ వీడడం లేదు. ఇరు పార్టీల మధ్య ఇంకా ఒప్పందం కుదరలేదు. సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉన్నది. తమకే ముఖ్యమంత్రి పదవి కావాలంటూ శివ సేన చీఫ్ ఉద్దవ్ థాక్రే పట్టుపడుతున్నారు. తన కొడుకు ఆదిత్య ఠాక్రే కు ఆ పదవి ఇవ్వాలని, అంతే కాకుండా మిగతా ప్రాధాన్యత కలిగిన మంత్రి పదవులు కూడా ఇవ్వాలని షరతు పెట్టారు.

ఎన్నకల కంటే ముందే తమకు సీఎం పదవి ఇస్తామని బీజేపీ చెప్పిందని, ఆ పార్టీ చీఫ్ అమిత్ షా రాత పూర్వకంగా లెటర్ కూడా ఇచ్చారని ఉద్దవ్ తెలిపారు. అయితే బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ , సీఎం ఫడ్నవిస్ లు మాత్రం తమకే ముఖ్యమంత్రి పదవి కావాలని కోరుతున్నారు. వీరు సైతం మంకు పట్టు వీడడం లేదు. దీంతో కమల దళపతి అమిత్ షా ముంబైకి రానున్నారు. ఇరు పార్టీలను సముదాయించే పనిలో పడ్డారు. ఎలా ఈ ట్రబుల్ ను పరిష్కరిస్తారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద బీజేపీకి మాత్రం శివ సేన చుక్కలు చూపిస్తోంది. ఒక వేళ ఒకే అన్నా రాబోయే కాలంలో మరిన్ని షరతులు పెడుతుందో నని బీజేపీ పార్టీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!