సింగర్..యాంకర్ ల మధ్యే పోటీ


తెలుగు బుల్లి తెరమీద బిగ్ బాస్ ఓ సంచలనం. స్టార్ గ్రూప్ యాజమాన్యం ఎప్పుడైతే మా టీవీ ని కొనుగోలు చేసిందో అప్పటి నుంచే దాని సక్సెస్ రేటింగ్ పెరిగింది. దేశ వ్యాప్తంగా పాపులర్ అయిన బిగ్ బాస్ రియాల్టీ షో ను తెలుగు వాకిట స్టార్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్ ను ప్రముఖ నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ గా చేశాడు. రెండో ఎపిసోడ్ బిగ్ బాస్ ను మరో నటుడు నాని స్టార్ట్ చేశాడు. దీనికి రేటింగ్ పెరిగింది. ఇదిలా ఉండగా ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తో మూడో బిగ్ బాస్ ను హోస్ట్ చేస్తున్నాడు. బుల్లి తెరపై ఈ  షో కు రేటింగ్ అమాంతం పెరిగింది. దీంతో పార్టిసిపెంట్స్ కు మరింత పాపులారిటీ లభించింది. దీంతో రియాల్టీ షో ను మరింత జనరంజకంగా మార్చేందుకు ట్విస్ట్ ల మీద ట్విస్టులు ఇస్తూ సక్సెస్ గా నడుస్తోంది.

ఇదే సమయం లో నాగార్జున బర్త్ డే జరుపుకున్నారు. ఈ సందర్బంగా ఆయన కొన్ని రోజుల పాటు షో కు దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో ఎవరు వస్తారోనని అంతా టెన్షన్ కు లోనయ్యారు. దీనిని పటాపంచలు చేస్తూ
ప్రముఖ హీరోయిన్, శివగామి రమ్యకృష్ణ హోస్టుగా వచ్చారు. అందరిని విస్తు పోయేలా చేశారు. ఎంతగానో ఆకట్టుకున్నారు. తన హావభావాలతో మెప్పించారు. పార్టిసిపెంట్స్ కు పలు పరీక్షలు పెట్టారు. అంతేనా కుశల ప్రశ్నలు వేస్తూనే చురకలు అంటించారు. బిగ్ బాస్ ముచ్చటగా 100 రోజులు పూర్తి చేసుకుంది.

ఆఖరుకు బిగ్ బాస్ ఇంట్లో అయిదుగురు మాత్రమే మిగిలారు. వారిలో వరుణ్, బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, శ్రీ ముఖి, అలీ రెజా మాత్రమే ఉన్నారు. కాగా వీరిలో ఇప్పటికే సింగర్ రాహుల్ సిప్లిగంజ్ డైరెక్ట్ గా ఫైనల్ కు చేరుకున్నాడు. మిగేహా వారు బరిలో ఉన్నారు. బాబా భాస్కర్, వరుణ్, అలీ రేజాలు వోటింగ్ లో కాస్తంతా వెనుకబడ్డారు. మరో వైపు రాహుల్, శ్రీ ముఖిల మధ్య పోటీ ఉండొచ్చంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యూత్ మాత్రం రాహుల్ గెలవాలని కోరుకోవడం విశేషం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!