అత్యంత సంపన్నవంతుడు బిల్ గేట్స్



ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా బిల్ గేట్స్ చరిత్ర సృష్టించారు. కాగా నిన్నటి దాకా మొదటి ప్లేస్ లో కొనసాగిన అమెరికా ఈ కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి జెఫ్ బెజోస్‌‌‌‌ ప్రపంచ కుబేరుడి కిరీటం పోగొట్టుకున్నారు. అమెజాన్ ఇంక్ క్యూ3 ఫలితాలు ఆశించిన మేర రాక పోవడంతో, కంపెనీ షేర్లు అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో ఒడిదుడుకులకు లోనయ్యాయి. ప్రారంభ ట్రేడింగ్‌‌‌‌లోనే అమెజాన్‌‌‌‌ షేర్లు 9 శాతం మేర పడి పోయాయి. దీంతో బెజోస్ సంపద 103.9 బిలియన్ డాలర్లకు అంటే 7,36,936 కోట్ల దగ్గర ఆగి పోయింది.   

దీంతో బెజోస్ ఆదాయం తగ్గడంతో మైక్రోసాఫ్ట్‌‌‌‌ కో ఫౌండర్ బిల్‌‌‌‌ గేట్స్ ప్రథమ స్థానంలో నిలిచారు. దాదాపు 105.7 బిలియన్ డాలర్లు అంటే 7,49,703 కోట్ల సంపదతో బిల్‌‌‌‌ గేట్స్ మళ్లీ ప్రపంచ కుబేరుడిగా అవతరించారు. గేట్స్ నెంబర్ వన్‌‌‌‌ స్థానాన్ని దక్కించు కున్నట్టు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ప్రపంచ ధనవంతుడి పీఠాన్ని 24 ఏళ్ల పాటు ఏలుతూ వస్తోన్న బిల్‌‌‌‌ గేట్స్‌‌‌‌కు తొలిసారి జెఫ్ బెజోస్ 2018లో చెక్ పెట్టారు. 160  బిలియన్ డాలర్లు 11,34,312 కోట్ల సంపదతో నెంబర్ వన్ స్థానానికి వచ్చారు.

ఈ జూలైలో బ్లూమ్‌‌‌‌ బర్గ్ బిలీనియర్ ఇండెక్స్ విడుదల చేసిన రిపోర్ట్ ప్రకారం బెర్నార్డ్ ఆర్నాల్ట్ ముందుకు రావడంతో, గేట్స్ నెంబర్ 3 స్థానానికి పడి పోయారు. కానీ మళ్లీ గేట్స్‌‌‌‌ తాజాగా నెంబర్ వన్ లోకి వచ్చేశారు. గేట్స్ తొలిసారి 1987లో 1.25 బిలియన్ డాలర్ల సంపదతో ఫోర్బ్స్ రిచ్ లిస్ట్‌‌‌‌లో స్థానం సంపాదించు కున్నారు. బెజోస్‌‌‌‌ 1998లో అంటే అమెజాన్‌‌‌‌ ఐపీఓకు వచ్చిన ఏడాదికి ఫోర్బ్స్ 400 రిచెస్ట్ అమెరికన్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అప్పుడు ఆయన సంపద 1.6 బిలియన్ డాలర్లుగా ఫోర్బ్స్ పేర్కొంది. కాగా అమెజాన్ నికర ఆదాయం ఈ మూడో క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో 26 శాతం తగ్గి పోయింది. 2017 తర్వాత లాభాలు పడిపోవడం ఇదే తొలిసారి అని ఫోర్బ్స్ ప్రకటించింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!