అబ్బా..రిలయన్స్..దెబ్బ ..ఇక టెక్నలాజి వార్

భారతీయ సాంకేతిక రంగంలో సరికొత్త విప్లవానికి నంది పలకబోతోంది ..రిలయన్స్ సంస్థ. మార్కెట్ వర్గాలను విస్మయ పరిచేలా సదరు కంపెనీ అధినేత సంచలన నిర్ణయాలు ప్రకటించారు. ఇక వచ్చే నెల నుంచి జియో ఫైబర్ ను అందుబాటులోకి ఈసుకు రానుంది. దీంతో ఒకే ఒక్క కనెక్షన్ ఉంటే చాలు ..ఇక ఇంటర్నెట్‌, టీవీ, టెలిఫోన్‌ అన్నీ తక్కువ ధరకే వాడుకునే వీలు కల్పిస్తున్నట్లు ప్రకటించారు . ఈ ఒక్క ప్రకటన తో ప్రతార్తి కంపెనీలు షాక్ కు లోనయ్యాయి. ఇప్పటికే టెలికం రంగంలో 34 కోట్లకు పైగా కస్టమర్లతో చరిత్ర సృష్టించింది రిలయన్స్. ప్రతి ఇంటా సాంకేతిక విప్లవం తీసుకు రావాలన్నదే తమ అంతిమ లక్ష్యమంటూ ఇటీవల జియో ను ప్రారంభించినప్పుడు ముఖేష్ అంబానీ ప్రకటించారు .

ఆ దిశగా ఆయన తన ప్రణాలికను పక్కాగా అమలు చేసుకుంటూ వెళుతున్నారు . ఇది ఓ రకంగా భారతీయ ఆర్ధిక రంగానికి ఊతం ఇచ్చినట్లవుతుందని మార్కెట్ రంగాల నిపుణులు అభిప్రాయ పడుతున్నారు . ఉచితంగా టీవీ కనెక్షన్‌, దేశంలో ఎక్కడికైనా పైసా ఖర్చులేకుండా మాట్లాడుకునేలా ల్యాండ్‌లైన్‌ టెలిఫోన్‌,  ఒకేసారి దేశ విదేశాల్లోని నలుగురితో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకునే అవకాశం కలుగుతుంది . అంతే కాకుండా సినిమా అభిమానుల కోరిక తీరనుంది. అదెలాగంటే థియేటర్లలో విడుదలైన రోజే తమ ఇంట్లోనూ కొత్త సినిమా చూసే సదుపాయం కలుగుతుంది . డేటా సేవలను కల్పించేందుకు మైక్రోసాఫ్ట్ తో జత కట్టింది జియో . ఇప్పటికే సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టిన ముకేశ్ అంబానీ రాబోయే రోజుల్లో ఇండియాను ఈ రేంజ్ కు తీసుకు వెళతారో చెప్పలేం.

అయితే మిగతా టెలికం కంపెనీలు రిలయన్స్ తాజా ప్రకటనతో పునరాలోచనలో పడ్డాయి. ఇప్పటికే విదేశీ కంపెనీలు అంటే అమెరికా తో పాటు అరబ్ కంట్రీస్ ఇప్పుడు రిలయన్స్ వైపు చూస్తున్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నాయి . దీంతో మరింత ఆదాయం పెంచుకునే దిశగా రిలయన్స్ పావులు కదుపుతోంది. తన వాటాలను కొద్ది మేర విక్రయించడం ద్వారా ఉన్న అప్పులు తీర్చాలని టార్గెట్ గా పెట్టుకుంది . ఇందులో భాగంగానే కొన్ని కంపెనీలతో డీల్ కూడా కుదుర్చుకుంది . రిలయన్స్ ఒక్క ప్రకటనతో ఇతర కంపెనీలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టు మిట్టాడుతున్నాయి. అపరిమిత ప్లాన్స్..ఆకట్టుకునే ఆఫర్స్ ..వేగానికంటే ఎక్కువగా డేటా అన్నది మరో విప్లవానికి నాంది పలికినట్టే. 

కామెంట్‌లు