ఆప‌రేష‌న్ షురూ..ఎంట‌ర్ ది డ్రాగ‌న్

అతిర‌థ మ‌హార‌థులు, త‌ల‌పండిన మేధావులు, రాజ‌కీయంలో పేరు మోసిన ..త‌ల‌పండిన నేత‌లకు అర్థం కాని ఒకే ఒక్క పేరు పీకే. ఈ రెండే రెండు అక్ష‌రాలు ఇపుడు దేశ వ్యాప్తంగా వైర‌ల్ అవుతోంది. మోస్ట్ వాంటెడ్ పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్‌గా పేరు తెచ్చుకున్న‌..ట్ర‌బుల్ షూట‌ర్‌గా త‌న‌ను తాను మార్చుకున్న ఒన్ అండ్ ఓన్లీ మ్యాన్ ..మిస్ట‌ర్ ఫ‌ర్ ఫెక్ట్ ఫెలో..ప్ర‌శాంత్ కిషోర్. బీహార్ కు చెందిన ఆయ‌న‌ను ముద్దుగా పీకేగా పిలుచుకుంటారు. ఒక్క‌సారి క‌మిట్ అయితే చాలు ఇక విజ‌యం మీ ముంగిట్లోకి వ‌చ్చిన‌ట్టే. అంత‌లా త‌న టీంను తానే త‌యారు చేసుకున్నాడు. గెలుపు సాధించేందుకు కావాల్సిన బలాల‌ను మ‌రింత బలోపేతం చేస్తాడు. మిస్సైల్‌లా ప్ర‌త్య‌ర్థుల‌కు చెమ‌ట‌లు ప‌ట్టిస్తాడు. ఆయ‌న‌తో డీల్ కుద‌రాలంటే ద‌మ్ముండాలి. అంత‌కు మించి భారీ ఎత్తున ఖ‌ర్చు చేసేందుకు రెడీగా ఉండాలి. అలాగైతేనే వ‌ర్క‌వుట్ అవుతుంది. అధికారంలో రావాల‌న్నా..ప‌వ‌ర్‌ను చేజిక్కించు కోవాల‌న్నా..ప్ర‌త్య‌ర్థులను మెస్మ‌రైజ్ చేయాల‌న్నా అత‌డికే సాధ్య‌మ‌వుతుంది. అందుకే ఇండియాలోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ..ఆయా అధిప‌తులంతా ఇపుడు పీకే జ‌పం చేస్తున్నారు. 

ఇండియ‌న్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ పేరుతో స్టార్ట్ చేసిన సంస్థకు ఎన‌లేని డిమాండ్ ఉంటోంది. మేనేజ్‌మెంట్ చ‌దివిన పీకే ..ఏది చేసినా ప్లాన్ ప‌క్కాగా ఉంటుంది. ఒక్క‌సారి ఒప్పందం చేసుకున్నాడంటే త‌క్ష‌ణ‌మే రంగంలోకి దిగిపోతాడు. స్టేట్‌ను జ‌ల్లెడ ప‌డ‌తాడు. సోష‌ల్ మీడియాతో పాటు డిజిట‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తాడు. పార్టీని, కార్య‌క‌ర్త‌లు, నేత‌ల‌ను ప‌రుగులు తీయిస్తాడు. అంతేకాకుండా జ‌నం ఏం కోరుకుంటున్నారు..ఏం చేస్తే బాగుంటుందో తానే మేనిఫెస్టోను , కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను త‌యారు చేస్తాడు. అందుకే స‌క్సెస్ అత‌డి వెంట ప‌డుతోంది. ఎవ‌రి గురించి కామెంట్స్ చేయ‌డు..ప్లాన్ స్లోగా ఉన్నా..ఆచ‌ర‌ణ‌లోకి వ‌చ్చే స‌రికల్లా చాలా ప‌వ‌ర్ ఫుల్‌గా ఉంటుంది. ఇదే ప్ర‌శాంత్ కిషోర్‌కు ఉన్న ప్ర‌త్యేక‌త‌. తాజాగా మ‌ళ్లీ వార్త‌ల్లోకి వ‌చ్చాడు. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సుదీర్ఘ‌మైన రాజ‌కీయ చ‌రిత్ర క‌లిగిన ..తెలుగుదేశం పార్టీకి చుక్క‌లు చూపించాడు. వైఎస్సార్‌సీపీని అధికారంలోకి వ‌చ్చేలా చేశాడు. దీంతో పీకే రేంజ్ మ‌రింత పెరిగింది. ఎక్క‌డ‌లేని డిమాండ్ వ‌చ్చింది. 

దీంతో ప‌శ్చిమ బెంగాల్‌లో సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ క‌న్ను పీకేపై ప‌డింది. ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ ఎన్నిక‌ల్లో బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. ప్ర‌జా వ్య‌తిరేక‌త చాప కింద నీరులా ఉంటోంద‌ని గ్ర‌హించిన ఆమె ..ఇప్ప‌టి నుంచే రేప‌టి భ‌విష్య‌త్ కోసం తిరిగి ప‌వ‌ర్‌లోకి వ‌చ్చేందుకు ప‌క‌డ్బందీగా విజ‌యాన్ని అందుకునేందుకు కావాల్సిన ఆయుధాల‌ను స‌మ‌కూర్చుకుంటోంది. ప్ర‌శాంత్ కిషోర్‌కు క‌బురు పంపింది. పిలిచిందే త‌డువుగా పీకే కోల్‌కోతాలో వాలి పోయాడు. ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందం కుదిరింది. వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌లలో టీఎంసీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు బిగ్ డీల్ కుదుర్చుకున్నాడు ప్ర‌శాంత్ కిషోర్. కోల్‌క‌తాలో జ‌రిగే ర్యాలీకి పీకేతో పాటు ఆయ‌న టీం హాజ‌రుకానుంది. ప్ర‌జ‌ల నాడి ఎలా ఉందో తెలుసుకుంటారు. ఐపీఏసీకి చెందిన టీం ఈ మేర‌కు స‌ర్వేలు, ఇంట‌ర్వ్యూలు తీసుకోనుంది. మొత్తం మీద ప‌వ‌ర్‌ను ఎంజాయ్ చేస్తున్న మోదీని ఢీకొనాలంటే పీకే లాంటి వ్య‌క్తి అవ‌స‌రమ‌ని గుర్తించారు లేట్‌గా మ‌మ‌త. ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంద‌నేది వేచి చూడాల్సిందే. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!