హైద‌రాబాద్‌పై క‌న్నేసిన అమెజాన్

ఈకామ‌ర్స్ రంగంలో ప్ర‌థ‌మ స్థానంలో ప్ర‌పంచ వ్యాప్తంగా కొన‌సాగుతున్న అమెరికా కంపెనీ అమెజాన్ హైద‌రాబాద్‌పై క‌న్నేసింది. ఇండియాలో సౌత్ ప‌రంగా చూస్తే ఈ ప్రాంతం అన్ని ర‌కాలుగా అనువుగా ఉంటుంద‌ని ఇప్ప‌టికే అన్ని కంపెనీలు , సంస్థ‌లు గుర్తించాయి. ఆ మేర‌కు త‌న వ్యాపారాన్ని మ‌రింత విస్త‌రించేందుకు ఈ కంపెనీ దీనికే ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తోంది. అమెజాన్‌కు చెందిన లాజిస్టిక్ గోడౌన్ షాద్‌న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలోని కొత్తూరు ప్రాంతంలో ఇప్ప‌టికే ఏర్పాటు చేశారు. ఇక్క‌డ అన్ని వ‌స్తువుల‌ను డెలివ‌రీ చేసేందుకు ఉంచుతున్నారు. లాజిస్టిక్స్ రంగంలో అమెజాన్ రారాజుగా వెలుగొందుతోంది. అమెజాన్ కంపెనీ గ‌చ్చిబౌలిలో ఏర్పాటు చేసిన అతి పెద్ద డెలివ‌రీ స్టేష‌న్‌ను తెలంగాణ ఐటీ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ జ‌యేష్ రంజ‌న్ ప్రారంభించారు.

ఈ స్టేష‌న్ ను 20 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఆసియా ఖండంలోనే ఇదే అతి పెద్ద ఫుల్ ఫిల్ మెంట్ సెంట‌ర్ . దీనిని మ‌న హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయ‌డం విస్త‌రిస్తున్న వ్యాపార రంగానికి ఇదే ఉదాహ‌ర‌ణ‌గా పేర్కొన‌వ‌చ్చు. ఇది ఎయిర్‌పోర్ట్ స‌మీపంలోనే ఉండ‌డం మ‌రికొంత అడ్వాంటేజ్‌. ర‌వాణా ప‌రంగా త‌క్కువ స‌మ‌యంలోనే దేనినైనా డెలివ‌రీ చేసేందుకు వీలు క‌లుగుతుంది. అమెజాన్‌కు అత్య‌ధికంగా ఆర్డ‌ర్లు చిన్న చిన్న ప‌ట్ట‌ణాల నుంచే వ‌స్తున్నాయి. దీని కోసం అమెజాన్ స‌రికొత్త‌గా చిన్న చిన్న కిరాణా షాపుల‌తో భాగ‌స్వామ్య కోసం ఐ హ్యావ్ స్పేస్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించింది. దీని ద్వారా కిరాణాదారుల‌కు ఆర్థికంగా మ‌రింత అభివృద్ధి సాధించేందుకు దోహ‌ద ప‌డుతుంది. ఈ దుకాణాల్లో అమెజాన్ బాక్స్‌ల‌ను స్టోరేజ్ చేసి..వాటిని వారికి స‌మీపంలో ఉన్న ఆర్డ‌ర్స్ చేసిన వారికి డెలివ‌రీ చేయొచ్చు.

దీంతో రోజుకు రెండు మూడు గంట‌లు ప‌ని చేసి 10 వేల నుంచి 15 వేల దాకా ఆదాయం ఆర్జించేలా ప్లాన్ చేసింది కంపెనీ. గ‌త కొన్నేళ్లుగా ఈ కామర్స్ ప్రాధాన్య‌త పెరుగుతూ వ‌స్తోంది. ఇండియాలో అమెజాన్ అత్య‌ధిక మార్కెట్ షేర్‌ను పొందుతోంది. ఫాస్ట్‌గా డెలివ‌రీ చేయాలంటే వారి వ‌ద్ద ఎక్కువ‌గా లాజిస్టిక్స్ ఉండాలి. టెక్నాల‌జీ ప‌రంగా కూడా స‌పోర్ట్ చేస్తే మ‌రింత ఈజీ అవుతుంది. తెలంగాణ‌లో ఇప్ప‌టికే ఎక్కువ భాగం అమెజాన్ విస్త‌రించింది. స్వంతంగా 90 డెలివ‌రీ స్టేష‌న్లు ఉన్నాయి. వాటిలో 20 డెలివ‌రీ స్టేష‌న్లు ఒక్క హైద‌రాబాద్‌లో ఉండ‌డం గ‌మ‌నార్హం. వేలాది మందికి సుల‌భంగా, వేగంగా డెలివ‌రీ చేసేందుకు వీలు క‌లుగుతుంది. 2 వేల 500 కిరాణా షాపులో ఐ హ్యావ్ స్పేస్ లో నిక్షిప్త‌మై ఉన్నాయి. 17 వేల మంది సెల్ల‌ర్స్ ఉన్నారు. స్మార్ట్ ఫోన్స్, లార్జ్ అప్లియెన్సెస్, ఫ్యాష‌న్, క‌న్సూమ‌ర్ ఎల‌క్ట్రానిక్స్, క‌న్స్యూమ‌బుల్స్ ఉన్నాయి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!