పిల్లల విద్య కోసం జగన్ అంకితం
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ ముహూర్తాన ముఖ్యమంత్రిగా సందింటి జగన్ మోహన్ రెడ్డి కొలువు తీరాడో ఆరోజు నుంచి ఆ రాష్ట్ర ప్రజలకు ఊహించని రీతిలో సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దేశంలో ఏపీ ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలతో ముందడుగులో ఉంటోంది. తాజాగా జగన్ విద్యాభివృద్ధి కోసం సమూల చర్యలు చేపట్టారు సీఎం. ప్రస్తుతం దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాల పిల్లలు చదువుకునేలా దృష్టి సారించారు. ప్రస్తుతం బడికి వెళ్లాలన్నా, చదువు కోవాలంటే భారీ ఖర్చు అవుతోంది. తడిసి మోపెడవుతోంది.
ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల కంటే ముందు ఏపీలో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టారు. ఇదే యాత్రలో వివిధ వర్గాల ప్రజల నుంచి సమస్యలను ఆయన విన్నారు. కళ్లారా చూశారు. ఖర్చు తట్టుకోలేక, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన చదువులు లేవని బాధపడుతున్న వారి ఇబ్బందులను గమనించారు. తాజాగా జగన్ మోహన్ రెడ్డి కేవలం పేదపిల్లల చదువు కోసం ఏకంగా మనబడి నాడు–నేడు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా జగన్ మోహన్ రెడ్డి తన అనుభవాలను జనంతో పంచుకున్నారు.
రాష్ట్రంలో 45 వేల పై చిలుకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిని మూడేళ్లలో మూడు దశల్లో బాగు చేసే కార్యక్రమం చేస్తున్నాం. మొదటి దశ ఈ రోజు ప్రారంభిస్తున్నాం. వచ్చే ఏడాది జూన్, జూలై నాటికి 15,715 స్కూళ్లలో 3,500 కోట్లతో మరుగుదొడ్లు, తాగునీరు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు, నాణ్యమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డు, మంచి రంగులు ఉంటాయి. ఆ మేరకు మరమ్మతులు చేస్తాం. అవసరమైన మేరకు తరగతి గదులు, కాంపౌండ్ వాల్స్, ఇంగ్లిష్ ల్యాబ్‌లు వస్తాయి. ఇలా తొమ్మిది రకాల మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు జగన్ రెడ్డి.
పాద యాత్రలో నన్ను ఓ చిన్నారి నన్ను, మన ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఇంత డబ్బులు ఖర్చు అవుతాయి. చేయగలవా.. అని అడిగింది. మంచి మనసుతో అడుగులు వేస్తే పైన దేవుడున్నాడు, ప్రజల దీవెనలు ఉన్నాయి. ముందడుగు వేస్తానని చెబుతున్నా. అన్ని చాలెంజ్‌లను అధిగమిస్తాను. ఇవాళ 15,715 బడుల ఫొటోలు తీస్తాం. వాటిని బడి ముందే అతికిస్తాం. జూన్, జూలై మాసం కల్లా మార్పు చేసిన తర్వాత ఎలా ఉంటాయో పక్కనే ఫొటో పెట్టి చూపిస్తాం.
మన పిల్లలను చదివించాలంటే ఏం చేయాలనే ఆలోచనతోనే ముందడుగు వేశా అని చెప్పారు. ‘అమ్మ ఒడి’కి జనవరి 9న శ్రీకారం చుట్ట బోతున్నాం. ప్రతి తల్లికి చెబుతున్నా.. మీ అన్నగా, మీ తమ్ముడిగా మాట ఇస్తున్నా. మీ పిల్లలను బడికి పంపించండి చాలు. సంవత్సరానికి15 వేలు మీ చేతిలో పెడతాను. బడులకు మరమ్మతులు చేస్తున్నాం. ఇంగ్లిష్ మీడియం తీసుకొస్తున్నాం. మన బతుకులు మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని సీఎం వైఎస్ జగన్ అన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి