టీఅర్పీలో బిగ్ బాస్ సెన్సేషన్

తెలుగు బుల్లి తెరమీద సంచలనం రేపింది బిగ్ బాస్ రియాల్టీ షో. స్టార్ టీవీ మా టీవీని కొనుగోలు చేసింది. మొదట దీనిని ప్రముఖ నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ స్టార్ట్ చేయగా, రెండో బిగ్ బాస్ ఎపిసోడ్ ను మరో నటుడు నాని హోస్ట్ చేశాడు. మూడో బిగ్ బాస్ ప్రోగ్రాం ను ప్రముఖ హీరో అక్కినేని నాగార్జున ప్రయోక్తగా సక్సెస్ ఫుల్ చేశాడు. ఇందులో నాగార్జున తన అందంతోనే కాదు మాటలతో ఆకట్టుకున్నారు. ఈ ప్రాయోజిత కార్యక్రమం ఏకంగా 105 రోజుల పాటు కొనసాగింది. ఈ సందర్బంగా గ్రాండ్ ఫినాలేను నభూతో న భవిష్యత్ అన్న రీతిలో నిర్వహించారు. దీనిని లక్షలాది మంది వీక్షించారు. ఈ ఫైనల్ ప్రోగ్రాం నాగార్జున-చిరంజీవి ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

బిగ్‌బాస్‌ 3 తెలుగు సీజన్‌ గ్రాండ్‌ ఫినాలే టీవీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. జూనియర్‌ ఎన్టీఆర్‌, నానిలు ప్రెజెంట్‌ చేసిన తొలి రెండు సీజన్‌ల ఫైనల్స్‌తో పోలిస్తే సీజన్‌ 3 టీఆర్పీ వాటిని అధిగమించింది. ఈ గ్రాండ్‌ ఫినాలేను స్టార్‌ మా ప్రసారం చేసింది. శ్రీముఖి, వరుణ్‌ సందేశ్‌, బాబా భాస్కర్‌, అలీ రెజాల నుంచి గట్టి పోటీని ఎదుర్కొని సింగర్ రాహుల్‌ సిప్లీగంజ్‌ బిగ్‌బాస్‌ టైటిల్‌ను ఎగరేసుకు పోయాడు. ఈ కార్యక్రమం దాదాపు నాలుగున్నర గంటలకు పైగా సాగింది. ఈ మొత్తం ఫైనల్‌ ఎపిసోడ్‌ 18.29 టీఆర్పీ రాబట్టిందని ఈ షో నిర్మాతలు ఎండెమోల్‌ షైన్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. దేశ వ్యాప్తంగా అత్యధిక టీఆర్పీ నమోదు చేసిన బిగ్‌బాస్‌ షో ఇదేనని పేర్కొంది.

 ఇక జూనియర్‌ ఎన్టీఆర్‌ హోస్ట్‌గా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 1 గ్రాండ్‌ ఫినాలేకు 14.13 టీఆర్పీ రాగ, నాని ప్రెజెంట్‌ చేసిన సీజన్‌ 2 ఫినాలే 15.05 టీఆర్పీ రాబట్టాయి. మరోవైపు బిగ్‌బాస్‌ సీజన్‌ 3 గ్రాండ్‌ఫినాలేలో విజేత రాహుల్‌కు చిరంజీవి టైటిల్‌ను ప్రదానం చేసే ఎపిసోడ్‌ చివరి గంటలో ఏకంగా 22.4 టీఆర్పీ నమోదైనట్టు స్టార్‌ మా నెట్‌వర్క్‌ ఉద్యోగి రాజీవ్‌ ఆలూరి ట్వీట్‌ చేశారు. మెగాస్టార్‌ చిరంజీవితో పాటు హీరో శ్రీకాంత్‌, హీరోయిన్‌ క్యాథరిన్‌ త్రెసా సహా పలువురు సెలెబ్రిటీలు బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3లో తళుక్కున మెరిశారు. దీంతో ఈ షోకు అదనపు ఆకర్షణగా మారడంతో భారీ రేటింగ్‌లు దక్కాయి.​

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!