ఆర్టీసీకి భారీ నష్టం..సమ్మె యథాతథం
ఆర్టీసీకి భారీగా నష్టం వాటిల్లుతోంది. కార్మికుల సమ్మె ఇవ్వాళ్టితో 41 రోజులకు చేరుకుంది. అయినా ప్రభుతం నుంచి సరైన స్పందన రావడం లేదు. కోర్టు చీవాట్లు పెట్టినా, కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇక కార్మికులు తగ్గడం లేదు. సమ్మెను కొనసాగిస్తుండడంతో సంస్థ పీకల లోతుకు చేరుకుంది.
సుదీర్ఘమైన సమ్మెతో గ్రేటర్ ఆర్టీసీ కుదేలైంది. నిరవధిక సమ్మె దెబ్బకు ఆర్టీసీ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. ప్రైవేట్ సిబ్బందిని నియమించుకున్నారు. కానీ 50 శాతం బస్సులను కూడా నడపలేని పరిస్థితి నెలకొంది.
గడిచిన 40 రోజులుగా ఆర్టీసీకి భారీ ఎత్తున ఆదాయానికి గండి పడింది. సాధారణంగా ప్రతి రోజు కోటి చొప్పున నష్టం రాగా, ఇప్పుడు అది మరింత పెరిగింది. దాదాపు సమ్మె రోజుల్లో అది రెట్టింపైంది. సిబ్బంది జీతభత్యాలు, విడిభాగాల కొనుగోళ్లు, తదితర నిర్వహణ వ్యయం తగ్గినప్పటికీ సిటీలో తిరిగే బస్సుల సంఖ్య, ట్రిప్పులు, కిలోమీటర్లు సగానికి పైగా పడి పోవడంతో ఆదాయం గణనీయంగా తగ్గింది. తొలి 10 రోజుల్లో రోజుకు 20 లక్షలు కూడా రాబట్ట లేక పోయారు. సాధారణ రోజుల్లో 42 వేల ట్రిప్పులు తిరిగిన సిటీ బస్సులు ఇప్పుడు రోజుకు 20 వేల ట్రిప్పుల కంటే దాటడం లేదు.
ఆదాయం పైన కాకుండా కేవలం ప్రయాణికులకు రవాణా సదుపాయం కల్పించేందుకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తోంది ఆర్టీసీ. అప్పట్లో 2.5 కోట్లు లభిస్తే ఇప్పుడు కోటి రూపాయలు కూడా రావడం లేదు. గతంలో రోజుకు కోటి చొప్పున నష్టాలు వస్తే ఇప్పుడు కోటిన్నరకు పైగా నష్టమే. గత 40 రోజులలో నష్టాలు 60 కోట్లకు పైగా నమోదైనట్లు అంచనా.
మరోవైపు బస్సుల్లో ఆక్యుపెన్సీ కూడా దారుణంగా పడిపోయింది. ఉదయం, సాయంత్రం మాత్రమే సిటీ బస్సుల్లో రద్దీ కనిపిస్తుంది. అరకొరగా తిరగడం వల్ల ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లలో పయనిస్తున్నారు.
ఇక రాత్రి వేళల్లో బస్సులు లేకపోవడం వల్ల, సిబ్బంది కొరత కారణంగా ట్రిప్పులు తగ్గడంతో ఆక్యుపెన్సీ తగ్గింది. సాధారణ రోజుల్లో 68 శాతం ఆక్యుపెన్సీ ఉంటే ఇప్పుడు 45 శాతం వరకు మాత్రమే నమోదవుతున్నట్లు అంచనా వేశారు. ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గింది. సిటీ బస్సులు నడపడంలో పెద్దగా అనుభవం లేని ప్రైవేట్ డ్రైవర్ల వల్ల డీజిల్ వినియోగం పెరిగింది. గతంలో ఒక లీటర్‌పైన 4.5 కిలోమీటర్‌ల చొప్పున నడిచిన ఆర్డినరీ బస్సులు ఇప్పుడు 3 కిలోమీటర్‌లకు తగ్గినట్లు అంచనా. మెకానిక్‌లు లేక పోవడంతో బ్రేక్‌డౌన్స్ పెరిగాయి. సమ్మె ఇలాగే కొనసాగితే ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి