టిక్ టాక్ ను సీన్స్ దాటేనా
ప్రపంచ సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు టిక్ టాక్ ఓ సంచలనం. దాని దెబ్బకు మిగతా కంపెనీలు పునరాలోచనలో పడ్డాయి. కోట్లాది మంది టిక్ టాక్ జపం చేస్తున్నారు. దీనికున్న క్రేజ్ ను చూసి తట్టుకోలేక కొత్త టెక్నాలజీని అప్ డేట్ చేస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసినా టిక్‌టాక్ జపం అగుపిస్తోంది, వినిపిస్తోంది. ఎవరినైనా అడిగితే చాలు ఈ యాప్ గురించి టకీమని చెప్పేస్తారు. అంతలా పాపులర్ అయిపోయింది టిక్ టాక్. ప్రస్తుతం నెటిజన్లకు అందు బాటులో ఉన్న సోషల్ మీడియా యాప్‌లలో టిక్ టాక్‌కు ఎంత ఆదరణ లభిస్తుందో అందరికీ తెలిసిందే. చిన్న పిల్లలు, వృద్దులు సైతం ఈ యాప్ ద్వారా వీడియోలు చేసి తమను తాము బాహ్య ప్రపంచానికి పరిచయం చేసు కుంటున్నారు.
ఒకప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌లను ఎక్కువగా వాడే వారు. అయితే ఇప్పుడు అందరి నోటా టిక్ టాక్ మాటే వినిపిస్తోంది. ఎవర్ని చూసినా టిక్‌టాక్ యాప్‌లో వీడియోలు చేస్తూ కనిపిస్తున్నారు. ఇక కొందరైతే ఈ యాప్ ద్వారా సెలబ్రిటీలుగా మారారు. సెన్సేషన్ సృష్టించారు. కాగా టిక్‌టాక్ నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రముఖ ఇన్‌స్ట్రాగ్రామ్ కూడా త్వర లోనే టిక్ టాక్‌ను పోలిన ఓ కొత్త టూల్‌ను అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. టిక్‌టాక్ యాప్‌కు లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఇన్‌స్ట్రాగ్రామ్ కూడా సరిగ్గా అలాంటి ఫీచర్స్ ఉన్న ఓ టూల్‌ను ప్రస్తుతం డెవలప్ చేసింది. దాని పేరు సీన్స్.
సీన్స్ టూల్‌ను ప్రయోగాత్మకంగా బ్రెజిల్‌లో వినియోగించారు. అక్కడ సక్సెస్ పుల్‌గా కొనసాగుతుంది. టిక్‌టాక్ మాదిరి సీన్స్‌లో కూడా 15 సెంకడ్ల నిడివి గల వీడియోను అప్‌లోడ్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మ్యూజిక్‌ని సెట్ చేసుకోవచ్చు. వీడియోను షేర్ చేసుకునే ఆప్షన్‌తో పాటు డ్యూయెట్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. అయితే ఈ టూల్ కేవలం ఒక బ్రెజిల్‌లోనే అమలవుతుందా లేదా ఇతర దేశాల్లో కూడా అందు బాటులోకి వస్తుందా తెలియదు. కానీ ఆచరణ మాత్రం సాధ్యమే. మరి ఇన్‌స్ట్రాగ్రామ్ తెచ్చే ఆ నూతన టూల్ ఎప్పుడు యూజర్లకు లభిస్తుందో, అది ఎలా ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి