స్మార్ట్ మొబైల్స్ లో షాన్ దార్ షావోమి

భారతీయ మార్కెట్ ను చైనాకు చెందిన మొబైల్స్ కంపెనీల ఫోన్స్ దుమ్ము రేపుతున్నాయి. ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన యాపిల్, శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ హవాను లెనోవా, వివో, ఒప్పో , షావోమి మొబైల్స్ డామినేట్ చేసే స్థాయికి చేరుకున్నాయి. రోజుకో కొత్త ఫీచర్స్ , డిజైన్స్ తో ఆకట్టుకునేలా ఉంటున్నాయి. కొనుగోలుదారులను, మొబైల్స్ ప్రియులతో పాటు యువతీ యువకులను ఎక్కువగా మెస్మరైజ్ చేస్తున్నాయి. ఇండియాలో ఎక్కడికి వెళ్లినా షావోమి స్టోర్స్ అగుపిస్తున్నాయి. ఇండియాలో ఎక్కువగా బిజినెస్ అంతా మిడిల్ క్లాస్ కు చెందిన వారిపైనే నడుస్తుంది. 130 కోట్ల భారతీయ జనాభాలో దాదాపు 70 శాతానికి మించి గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. మిగతా 30 శాతం జనం నగరాల్లో ఉంటున్నారు. ఇప్పటికే అత్యంత చౌకగా ఇంటర్నెట్ ఆధారిత సేవలు అందుతున్నాయి.

భారతీయ టెలికాం సెక్టార్ లో కంపెనీల మధ్య వ్యాపార యుద్ధం మొదలైంది. ఇంతకు ముందు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ప్రభుత్వ కంపెనీ అయితే , ప్రయివేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ గ్రూప్ నకు చెందిన జియో ఉండగా ఎయిర్ టెల్ , ఐడియా , వోడా ఫోన్ , టాటా టెలికాంలు ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు బీఎస్ ఎన్ ఎల్ నష్టాల్లో కొనసాగుతుండగా జియో మాత్రం దుమ్ము రేపుతోంది. దీని కస్టమర్స్ 34 కోట్లకు చేరుకున్నారు. ఇప్పుడు మొత్తం ఇండియాలో కస్టమర్స్ 100 కోట్లు దాటేసింది. వీరంతా స్మార్ట్ ఫోన్స్ కే ప్రయారిటీ ఇస్తున్నారు. దీంతో సామాన్యుడి నుంచి మధ్యతరగతి జనానికి సమీప ధరల్లో ఎక్కువ ఫీచర్స్ ఉండేలా మొబైల్స్ తయారీ కంపెనీలు ప్లాన్ చేస్తున్నాయి. అంతే కాకుండా ఆఫర్స్ కూడా ప్రకటిస్తున్నాయి. అన్ని కంపెనీలకంటే ధరల్లో, ఫీచర్స్, డిజైన్స్ లలో షావోమి కంపెనీ మొబైల్స్ అందుబాటులో ఉన్నాయి.

ఆఫ్ లైన్ లో నే కాకుండా ఆన్ లైన్ లో కూడా ఎప్పటికప్పుడు ఉండేలా ప్లాన్ చేస్తోంది ఈ కంపెనీ. తాజాగా చేసిన సర్వేలో షావోమి అన్ని మొబైల్స్ కంపెనీలను దాటుకుని ఏకంగా 10 మిలియన్స్ మొబైల్స్ ను అమ్మేసి రికార్డ్ సృష్టించింది. కొనుగోలుదారుల్లో ఎక్కువగా యాపిల్ కంపనీ ఫోన్స్ కు ప్రయారిటీ ఇస్తే తర్వాత శాంసంగ్ , వన్ ప్లస్, మోటోరోలా ఉండగా చైనా కంపెనీల్లో షావోమి రాకెట్ లా దూసుకెళుతోంది. టాప్ రేంజ్ లో నిలిచింది. మొబైల్స్ తో పాటు ఆక్సెస్సరీస్, లెడ్ టీవీలను కూడా విక్రయిస్తోంది. తాజాగా షావోమి కంపెనీ దమ్‌దార్‌ స్మార్ట్‌ఫోన్‌ ను విడుదల చేసింది. దీని ధర 6499 రూపాయలు. రెడ్‌మి 8ఏ పేరుతో రెండు వేరియంట్లలో లాంచ్ చేసింది. దీనిలో భారీ బ్యాటరీ, ఏఐ సెల్ఫీ కెమెరా కూడా వుంది.

ఆకర్షణీమైన ఫీచర్లతో బడ్జెట్‌ ధరలో  3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌  ఇస్తోంది. దమ్‌దార్‌ రెడ్‌మి 8ఏలో వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం, టైప్‌ సీ చార్జర్‌ స్పెషల్‌ ఫీచర్‌ లాంటి ఎనిమిది ఫీచర్లున్నాయని అని కంపెనీ చెబుతోంది. రెడ్‌మి ఏ సిరీస్ లో వచ్చిన రెడ్‌మీ 7ఏ  తరువాత  కేవలం మూడు నెలల వ్యవధిలోనే కొత్త డివైస్‌ను లాంచ్‌ చేయడం విశేషం. 6.22 ఎల్‌సీడీ డిస్‌ప్లే,1520×720  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, ఆండ్రాయిడ్‌ 9పై , 19:9  రేషియే వాటర్‌డ్రాప్‌, నాచ్‌ కార్నింగ్‌గ్లాస్‌ ౫, క్వాల్కం స్నాప్‌ డ్రాగన్‌ 439 , 2/3జీబీ ర్యామ్‌, 32 జీబీ స్టోరేజ్‌ , 12 ఎంపీ రియర్‌ కెమెరా, 8 ఎంపీ ఏఐబ్యూటీ సెల్పీ కెమెరా, 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్త్యం వుంది. మొత్తం మీద ఇండియన్ మార్కెట్ ని రెడ్ మీ ఫోన్స్ హల్ చల్ చేస్తున్నాయి. 

కామెంట్‌లు