వెండిని ధరించలేం..బంగారం కొనలేం..!

నీ ఇల్లు బంగారం కానూ అంటూ అప్పుడెప్పుడో చేయి తిరిగిన పాటల రచయిత ఆవేశపడి రాసిన సినీ గీతం ఇప్ప్పుడు పాడు కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఉమ్మడి రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా విడి పోయాక ..ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో అప్పులు ఎక్కువై పోతున్నవని ఆందోళన చెందితే , దానికి భిన్నంగా ఏకంగా రాజధాని నగరమైన భాగ్యనగరంలో కిలోల కొద్దీ ..టన్నుల కొద్దీ కొంటున్నారు. ఇది మార్కెట్ వర్గాలనే కాదు ..ఐటి అధికారులను నివ్వెర పోయేలా చేస్తోంది. ఓ వైపు పసిడి ధరలు పైపైకి వెళుతున్నా మహిళలు మాత్రం కొనడం మాత్రం మాను కోవడం లేదు. ఇది మరింత విస్మయానికి గురి చేస్తోంది.

బంగారం ధర ఇట్లుంటే వెండి తగదునమ్మా అంటూ దాని ధర కూడా రాకెట్ కంటే వేగంగా దూసుకు వెళుతోంది . భారతీయ మార్కెట్ లో బంగారం మెరుస్తోంది . చైనా ..అమెరికా దేశాల మధ్య వ్యాపార పరంగా యుద్ధం మొదలు కావడంతో పసిడి ధర ఆగనంటోంది . బులియన్ మార్కెట్ లో ఊహించని రీతిలో ధర అమాంత పెరుగుతూ ఉన్నా కొనుగోలు దారులు మాత్రం ఈ మాత్రం వెనక్కు తగ్గడం లేదు . లెక్కకు మించి కొనుగోలు చేస్తున్నారు . ఒకప్పుడు 20 వేల లోపు ఉన్న ధర ఇప్పుడు 36 వేలకు పైగా పెరుగుతూ పోతోంది . రెండు దేశాల మధ్య వార్ దీని ధరల పెరుగుదలకు కారణమవుతోందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి .

 10 గ్రాముల ధర 800 పెరిగి ఆల్ టీం గరిష్టంగా 36 వేల 970 కి చేరుకుంది . వెండి కిలోకు వెయ్యి రూపాయలు పెరిగి 43 వేల 100 రూపాయలకు చేరుకుంది . దీంతో పాటు భారతీయ రూపాయి మారకపు విలువ తగ్గడం కూడా ధరలు పెరిగాయి. కొనుగోలుదారులు భద్రతకు కారణమయ్యే బంగారాన్ని కొనుగోలు చేసేందుకే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు. చైనా దిగుమతుల మీద టారిఫ్‌‌ విధించనున్నట్లు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌‌ ట్రంప్‌‌ ప్రకటించడంతో మళ్లీ ట్రేడ్‌‌వార్‌‌ మొదలైంది.

ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు భద్రతకు ఎక్కువ అవకాశం వుండే యెన్‌‌, బాండ్స్‌‌, గోల్డ్‌‌లలో పెట్టుబడులు పెట్టేందుకు  ఇష్ట పడుతున్నారు. తక్కువ  వడ్డీ రేట్లు, సెంట్రల్‌‌ బ్యాంకుల  కొనుగోళ్లకు  ఇన్వెస్టర్లూ తోడవడంతో గోల్డ్‌‌ ధరలు మరింత పెరిగే సూచనలున్నాయి. జూన్‌‌, జూలై నెలల్లోనూ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. గ్లోబల్‌‌గా ఈక్విటీ మార్కెట్లు అనిశ్చితిలో ఉన్నాయి. పెరుగుతూ పోతున్న పసిడిని అందుకోలేక ..ఉన్న వెండిని ధరించ లేక సామాన్యులు , మధ్యతరగతి మహిళలు కొట్టుమిట్టాడుతున్నారు. ఎన్నడూ లేనంతగా రూపాయి విలువ పడి పోవడం కూడా ఇందుకు మరో కారణంగా పేర్కొనవచ్చు. 

కామెంట్‌లు