మధురాతి మధురం గోవింద వసంతం..!
అతడు గాయకుడు. అంతకంటే ఎక్కువగా సంగీత దర్శకుడు. ఇటీవల దేశాన్ని ఊపేస్తున్న పాటల్లో అతడి చేతిలో రూపొందిన పాటే టాప్ రేంజ్ లో నిలిచింది . ఆ గొంతులో ఏ మాధుర్యం దాగి ఉందో అర్థం చేసుకోవాలంటే అతడు సంగీతం అందించిన త్రిష నటించిన 96 మూవీ సాంగ్ వినాల్సిందే. ఒక్కసారి విన్నామా ఇక అతడితోనే ఉంది పోతాం. అలా మనల్ని సప్త సముద్రాలను దాటించేస్తాడు. అతడిలో ఏదో మ్యాజిక్ దాగి ఉంది. దానిని కాదనలేం . అతడి వాయిస్ లో అమృతం దాగి ఉంది ..కనుకనే కోట్లాది మంది అతడు ఇచ్చిన సాంగ్ ను వింటూ గడిపేస్తున్నారు. ఇప్పుడు యూట్యూబ్ లో గోవింద్ వసంత అని పేరు వెతికితే చాలు ..ఎందరో అతడికి ఫ్యాన్స్ అయిపోయారు .
అతడు అందించిన ఈ సినిమా కేవలం సంగీతం వల్లనే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది . ఎన్నో అవార్డులు తెచ్చి పెట్టింది . ఇప్పటిదాకా ఊరిస్తూ వచ్చిన ఆ పాటే .. కాదలే కాదలే అన్న ఈ సాంగ్ ఇప్పుడు ప్రపంచమంతటా వైరల్ గా మారింది . ఈ సినిమాలో నటి త్రిష అద్భుతంగా నటించింది . మనసును చుట్టేసింది . ఇంతలా ..డీప్ గా కనెక్ట్ అయినా మూవీ సాంగ్ ఇంకేదీ లేదనే చెప్పాలి . లక్షలాది అభిమానులు ఈ పాటను వినకుండా ఉండలేక పోతున్నారు . అందుకేనేమో ఈ సాంగ్ ను ఎప్పుడూ తమతో ఉండేందుకు రింగ్ టోన్ గా తమ మొబైల్స్ కు పెట్టేసుకున్నారు . గతంలో ఎన్ని చేసినా రాణి పేరు ఒకే ఒక్క పాటకు వచ్చేసింది . ఒక్క రోజులోనే గోవింద్ వసంత పేరు మార్మోగింది దేశమంతటా.
కాదలే కాదలే పాటను ఫిమేల్ వర్షన్ లో ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద పాడారు . అదే ఇప్పుడు టాప్లోకి తీసుకు వచ్చింది . ఆమెకు మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకునే లా చేసింది . సింగర్ గా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ..ఎంతో పేరున్న ఈ వర్ధమాన గాయని గొంతులోంచి వచ్చిన ఈ పాటకు జనం నీరాజనాలు పలికారు . నెటిజన్లు జేజేలు పలుకుతూ ఇప్పటికీ ట్వీట్ చేస్తున్నారు . సంగీత ప్రపంచంలో ఈ పాట ఓ రికార్డ్ ను బ్రేక్ చేసింది . తనకు ఇంత మంచి పాట ఇచ్చినందుకు చిన్మయి వసంత కు థాంక్స్ చెబుతోంది.
ఇక , గోవింద్ వయసు 30 ఏళ్ళు . కేరళ ఇతడి స్వస్థలం . 2012 నుంచి సినిమా రంగంలో ఉన్నారు . కంపోసర్ గా , సింగర్ గా , వయోలిస్ట్ గా పేరొందారు. మలయాళం , తమిళ్ సినిమాలకు సంగీతం అందించాడు . తాజాగా ప్రిత్వి సినిమాకు సంగీతం అందించనున్నారు. ఇళయరాజా ఇటీవల తన సంగీతాన్ని కాపీ చేశాడంటూ కామెంట్ చేశాడు. అయినా ఎవరూ పెద్దగా పట్టించు కోలేదు. మొత్తం మీద గోవింద్ వసంత ఇప్పుడు సంగీత ప్రపంచంలో ఓ సంచలనం. వీలైతే కాదలే కాదలే అని సర్చ్ చేసి వినండి . గుండె తేలికవుతుంది..ప్రేమ మళ్ళీ చిగురిస్తుంది. ఎంతైనా పాటే ప్రాణప్రదం కదూ .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి