మిషన్ భగీరథ విజయం.. ఫలితాలు అద్భుతం - సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం అద్భుత ఫలితాలను ఇస్తోందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెప్పారు . ఎల్లంపల్లి , కాళేశ్వరం ప్రాజెక్ట్ కు భారీగా చేరుకున్న నీటిని సీఎం ఏరియల్ సర్వ్యే ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ధర్మపురిలో ని లక్ష్మి నరసింహ్మ స్వామి ని సీఎం దర్శించుకున్నారు . పూజలు చేశారు . ఏ చిన్న రైతు చని పోయినా  అయిదు లక్షలు సాయంగా అందజేస్తున్నామని  వెల్లడించారు. అతి త్వరలోనే రాష్ట్రం కన్న కలలు నిజం కాబోతున్నాయని కేసీఆర్ చెప్పారు. నిన్నటి దాకా నీళ్లు ఉండేవి కావు .. ఇప్పుడు భారీగా వరద నీరు వచ్చి చేరిందన్నారు . 

కొందరు సన్నాసులు అవగాహన లేక అవాకులు చెవాకులు పేలుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు నదుల పరంగా చూస్తే గోదావరి ఒక్కటే ప్రాణాధారమని సీఎం వెల్లడించారు. 400 టీఎంసీల నీళ్లు వాడుకునే వీలు కలుగుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కూలీలు అహోరాత్రులు కస్టపడి పని చేశారని , అంతే కాకుండా ఇంజనీర్లు కూడా తక్కువ సమయంలో , మూడేళ్ళ కాలంలో , కేంద్రం నిధులు ఇవ్వక పోయినా ..రాష్ట్రం స్వంత ఖర్చుతో నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు . దీనిని అడ్డుకోవాలని 300 పిటిషన్లు దాఖలు చేశారని , దానిని కూడా తమ సర్కార్ అధిగమించిందన్నారు. 

నేను ప్రత్యక్షంగా గోదావరిని చూడడం జరిగిందన్నారు . మహబూబ్ నగర్ జిల్లాలో ఎత్తిపోతల పథకాలన్నీ విజయవంతంగా నడుస్తున్నాయని తెలిపారు . ఏకంగా 10 లక్షల ఎకరాలు సాగవుతున్నాయని వెల్లడించారు . ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయినా సరే మేం భరించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ చెప్పారు . ధర్మపురి ఆలయ అభివృద్ధి కోసం నిధులు ఇస్తామన్నారు . ఆయన విపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు . అవగాహన లేకుండా మాట్లాడటం వల్ల ప్రజలకు రంగ్ మెస్సేజ్ వెళుతుందన్నారు. ఇందు కోసమే పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతోందని చెప్పారు .

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!