ఆర్టీసీకి సీఎం కాయకల్ప చికిత్స
మేం ఎవ్వరినీ తొలగించలేదు. కానీ ఆర్టీసీ కార్మికులు వాళ్లంతకు వాళ్ళే తొలగి పోయారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కార్మికులను, సిబ్బందిని తీసుకునే ప్రసక్తి లేదు. ఆర్టీసీని పూర్తిగా ప్రైవేటీకరించమని స్పష్టం చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే తాము నియమ నిబంధనలకు లోబడి ఆర్టీసీలో ఉద్యోగులుగా నియమిపబడ్డామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. ఈ సీఎం కొన్ని రోజులే ఉంటారని, కానీ తాము కొన్నేళ్లుగా పని చేస్తామని అది సీఎం గుర్తిస్తే మంచిదన్నారు. ఇలా ఉండగా ఆర్టీసీపై పూర్తి స్థాయిలో ప్రగతి భవన్ లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రవాణా శాఖా మంత్రి అజయ్ కుమార్, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సంఘాలు సమ్మె చేస్తామనడం హాస్యాస్పదంగా ఉంది, ప్రస్తుతం సంస్థలో కేవలం 1200 మంది మాత్రమే ఉన్నారని మా లెక్కల్లో తేలింది.
మిగతా వాళ్లంతా నిన్నటితో డి
స్మిస్ అయినట్టే. కొత్త వారిని తీసుకుకోవాలని ఆదేశించాం. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఇక్కడ పనిచేయవు. ఎవ్వరిని ఉపేక్షించబోమని కేసీఆర్ అన్నారు. తాము కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కొంత వెసలుబాటు ఇచ్చామని, అయినా వారిలో మార్పు రాలేదు. ఫిట్ మెంట్ కూడా ఇచ్చాం, అయినా పట్టించుకోలేదు. లక్షలాది మంది ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసారు. అన్నిటికంటే ప్రధాన పండుగ ఉన్నా సమ్మెలోకి దిగారు. దీనిని సమస్త తెలంగాణ ప్రజానీకం మొత్తం ఆర్టీసీ ఉద్యోగులను చీదరించుకుంటున్నారు. ఇంతమంది ఇబ్బందులకు లోనవుతుంటే ఆందోళనకు దిగడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. 50 శాతం ఆర్టీసీ ప్రాంతానివి, మిగతా 30 శాతం అద్దె ప్రాతిపదికన, 20 శాతం ప్రైవేట్ వారికి అప్పగించనున్నామని వెల్లడించారు సీఎం.
ఆర్టీసీలో ప్రస్తుతం బస్సుల కొరత ఉందని అధికారులు నివేదించారు. దీంతో 2100 బస్సులు కొనుగోలు చేయాలనీ ఆదేశించాం. స్టేజ్ క్యారియర్లుగా వాహనాలు తిరుగుతాయి. ఆర్టీసీతో సమానంగా చార్జీలు ఉంటాయి. అయితే ప్రభుత్వ పరంగా ఆర్టీసీకి యథావిధిగా సబ్సిడీలు కొనసాగుతాయని కేసీఆర్ తెలిపారు. కార్మిక సంఘాల దురహంకారం వల్లనే సమ్మె కొనసాగుతోంది, ప్రభుత్వం ఒప్పుకోదు. ఇప్పటికే సంస్థ నష్టాల్లో కూరుకు పోయింది, దీనికి కాయకల్ప చికిత్స అవసరం. అందుకే కొన్ని కఠినమైన చర్యలు తీసుకోక తప్పడం లేదన్నారు కేసీఆర్. ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకురావాలన్నదే ఈ సర్కార్ లక్ష్యం. ఇక ఎలాంటి యూనియన్లు అంటూ ఉండబోవు. కొత్తగా సంస్థ లక్ష్యాలకు అనుగుణంగా ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుందన్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి