స్వామి అనుగ్రహం..జీవితం ధన్యం

ఆ దేవదేవుడు, ఏడుకొండలపై వెలసిన శ్రీనివాసుడు, పద్మావతమ్మల అనుగ్రహం వల్లనే తనకు కొండపై ఉండే భాగ్యం కలిగిందని శ్రీవెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మెన్, ప్రముఖ నటుడు పృథ్వి స్పష్టం చేశారు. ఎన్నో జన్మల పుణ్య ఫలమే ఈ పదవి తనను వరించిందన్నారు. ఇప్పటికే పేరున్న వాళ్ళు తమకు అవసరం లేదంటున్నారు. ఇక్కడే, ఈ పరిసర ప్రాంతాల్లోనే ఎంతోమంది టాలెంట్ కలిగిన వాళ్ళున్నారని, ఇక నుంచి వారికే అన్నిటా అవకాశాలు కల్పించాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం కలిగిన నటుడిగా ఆయనకు పేరుంది. నటుడిగా ఇప్పటికే వంద శాతం మార్కులు పడ్డాయి. గత ఎన్నికల్లో హార్డ్ కోర్ గా వైసీపీ పార్టీ గెలుపు కోసం పృధ్వి కష్టపడ్డారు. ఆయన పనితీరు గమనించిన ఏపీ సీఎం జగన్ భక్తి ఛానల్ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం ఛానల్ కు పూర్వ వైభవం తీసుకు వచ్చే పనిలో నిమగ్నం అయ్యారు. రేయింబవళ్లు కష్టపడుతున్నారు.

జీవితంలో ఇంతకు మించిన పదవి ఇంకేముంటుందని ప్రశ్నించారు. ఎస్వీబీసీ చైర్మన్‌ కావటం స్వామి ఇచ్చిన వరం. ప్రపంచ వ్యాప్తంగా స్వామి, అమ్మ వార్లకు కోట్లాది మంది భక్తులు ఉన్నారు. నాకంటే గొప్పవాళ్లు ఉన్నారు. అయినప్పటికీ సేవ చేసుకునే భాగ్యాన్ని దేవుడు నాకు కల్పించాడు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానని పృథ్వీ చెబుతున్నారు. కొన్నేళ్లుగా ఇదే ఛానల్ లో ఎందరో సిబ్బంది ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా పనిచేస్తున్నారు. ఈ విషయం చేరిన వెంటనే గుర్తించారు ఆయన.  ప్రతి ఒక్కరికి ఉద్యోగ భద్రత కల్పించాలని సీఎం జగన్ వద్దకు వెళ్లారు. వీళ్ళందరూ ఎన్నో ఏళ్లుగా ఛానల్ సక్సెస్ లో భాగం పంచుకున్నారు. వారిని తప్పనిసరిగా పర్మినెంట్ చేయాలని కోరారు. వీలైతే మీ కాళ్ళు పెట్టుకుంటానని చెప్పారు. ఈ వార్త అప్పట్లో వైరల్ అయ్యింది. మొత్తం వ్యవస్థను ఆయన ప్రక్షాళన చేయాలని కంకణం కట్టుకున్నారు.

ఎవరెవరు ఎలా పని చేస్తున్నారో ఓ అంచనాకు వచ్చారు. పూర్తిగా తిరుమల కొండపైనే ఉంటున్నారు. అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. అర్ధరాత్రి మూడు గంటలకు లేవడం. స్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొనడం. ఆయన ఆశీస్సులు తీసుకోవడం ..తిరుమల అంతటా కలియ తిరగడం చేస్తున్నారు. జీవితంలో ఇంత గొప్ప పదవి వస్తుందని అనుకోలేదు. అందుకే సమూల మార్పులు చేసే పనిలో పడ్డారు పృథ్వి. ప్రైవేట్ ఛానల్స్ కు ధీటుగా ఇప్పుడు ఎస్వీ బీసీ ఛానల్ ను తీర్చిదిద్దే పనిలో పడ్డారు. నాణ్యమైన ప్రసారాల కోసం మరింత ఆధునిక టెక్నాలజీతో కూడిన పరికరాల కొనుగోలు  చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రతిరోజు  కొన్ని నిమిషాల పాటు జీయరు స్వాముల ప్రవచనాలు ప్రసారం చేయనున్నారు.

సినిమా షూటింగ్ లో లక్షలు సంపాదించే అవకాశం పృథ్వీరాజ్ కు ఉన్నప్పటికీ , ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా టీటీడీ ఛానల్ చైర్మన్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సామాన్యుడిలాగానే తిరుమల కొండపై ఉంటున్నారు. ఎలాంటి ప్రోటోకాల్ వద్దని చెప్పారు. ఓ భక్తుడిగా స్వామి నాకు అవకాశం ఇచ్చినప్పుడు, ఈ సౌకర్యాలను వాడు కోవడం భావ్యం కాదని భావించారు. గతంలో ఇదే ఛానల్ లో జరిగిన అక్రమాలపై ఇప్పటికే నివేదిక తయారైంది. అది విజిలెన్స్ వాళ్ళు చూసుకుంటారని, తన పని మాత్రం భక్తి ఛానల్ కు మంచి పేరు తీసుకు రావడమేనని చెబుతున్నారు. ఆయన కోరికను ఆ ఏడుకొండల వాడు తీర్చేలా బలాన్ని ఇవ్వాలని కోరుకుందాం. భవిష్యత్తులో మరికొందరికి టీటీడీ భక్తి ఛానల్ లో అవకాశాలు కల్పించేలా పృథ్వీ కృషి చేస్తారని ఆశిద్దాం. 

కామెంట్‌లు