అమ్మకాల్లో షావోమీ సెన్సేషన్
ఇండియన్ స్మార్ట్ ఫోన్స్ అమ్మకాల్లో చైనా కంట్రీకి చెందిన షావోమీ కంపెనీ రికార్డ్ బ్రేక్ చేసింది. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్ అందుబాటులోకి తీసుకు వచ్చిన ఈ కంపెనీ అమ్మకాల్లో మాత్రం దుమ్ము రేపుతోంది. ఇదే కంపెనీకి చెందిన 53 లక్షలకు పైగా డివైజ్ లను విక్రయించింది. ఈ ఫెస్టివ్ సీజన్ లో ఏ కంపెనీకి లేనంతటి ఆదరణ షావోమి కి లభించింది. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండేలా మొబైల్స్ ను రూపొందించింది. కొత్త ప్రోడక్ట్స్ ను ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి ఇంట్రడ్యూజ్ చేస్తూ మెస్మరైజ్ చేసింది. ఇప్పటికే అమెరికాకు చెందిన యాపిల్ మొబైల్ తో పాటు శాంసంగ్ మొబైల్ పోటీ పడుతున్నాయి. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో అమ్ముడు పోవడంతో షావోమీ కంపెనీ నిర్వాహకులు ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. ఆయా మొబైల్స్ తీసుకున్న కొనుగోలుదారులకు బిగ్ ఆఫర్స్ కంపెనీ ప్రకటించింది. గతంలో ఆఫ్ లైన్ లో మొబైల్స్ విక్రయిస్తే ప్రస్తుతం తన స్ట్రాటజీని పూర్తిగా మార్చేసింది షావోమీ. కొత్త ప్రాడక్ట్స్ , డివైజెస్ , స్మార్ట్ ఫోన్స్ అన్నింటిని ఆన్ లైన్ లో అమ్మకానికి పెట్టింది.
దీంతో అటు ఆఫ్ లైన్ లో ఇటు ఆన్ లైన్ లో దుమ్ము రేపుతున్న సదరు కంపెనీ బడా కంపెనీలకు షాక్ ఇచ్చింది. అమ్మకాల్లో టాప్ రేంజ్ లో దూసుకెళుతూ కోలుకోలేకుండా చేస్తోంది. షావోమి మొబైల్ కంపెనీ 2013 లో స్టార్ట్ అయ్యింది. డిఫరెంట్ డిజైన్స్ తో రెడ్ మీ కంపెనీ మొబైల్స్ ను తయారు చేస్తోంది. అన్నిటికంటే యూత్ ను దృష్టిలో పెట్టుకుని వీటిని రూపొందిస్తున్నారు. బిగ్గెస్ట్ సేల్ పేరుతో అందరిని ఆకట్టుకునే రీతిలో గిఫ్ట్ లను అందజేస్తోంది షావోమి. కంపెనీ స్టార్ట్ చేసి 9 ఏళ్ళు కావస్తున్నా ఈసారి మొబైల్స్ అమ్ముడు పోయినంతగా గతంలో అమ్ముడు పోలేదు. శ్యాంసంగ్ , యాపిల్ కంపెనీలు షావోమి దెబ్బకు ధరలను తగ్గించక తప్పడం లేదు. ఆయా కంపెనీలు కూడా ఆఫర్ల మంత్రం జపిస్తున్నా కొనుగోలుదారులు మాత్రం అటు వైపు చూడటం లేదు. తమ స్నేహితుల ద్వారానో లేదా బంధువుల ద్వారానో బ్రాండ్ మొబైల్స్ ను తెప్పించుకుంటున్నారు. దీంతో మొబైల్స్ అమ్మకాలు పూర్తిగా తగ్గి పోయాయి. షావోమి కొట్టిన దెబ్బకు అబ్బా అంటున్నాయి దిగ్గజ మొబైల్స్ కంపెనీలు.
ఆయా కంపెనీలకు తీసిపోని రీతిలో తమ కంపెనీ మొబైల్స్ ఇస్తోందని, ఎక్కడా కొనుగోలుదారుల నుండి ఫిర్యాదులు రాలేదని చెబుతున్నారు షావోమి ఇండియా కేటగిరీస్ అండ్ ఆన్‌లైన్ సేల్స్ హెడ్ రఘు రెడ్డి. ఈ పండుగ కాలంలో ఇండియాలో 38 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్లను అమ్మినట్టు వెల్లడించారు. అమెజాన్‌లో కూడా బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా షావోమీ నిలిచినట్టు చెప్పారు. మొత్తం మీద సెకనుకు 535 డివైజ్‌లను విక్రయించినట్లు తెలిపారు. కాగా స్మార్ట్‌ఫోన్లు, ఎంఐ టీవీలు, ఎంఐ బ్యాండ్స్, పవర్ బ్యాంక్ లు, ఇయర్ ఫోన్స్, ఏకో సిస్టం డివైజ్ లు, ఇతర యాక్ససరీస్ ప్రొడక్ట్‌లను ఎంఐ.కామ్, ఇతర పార్టనర్ ప్లాట్‌ఫామ్స్‌పై విక్రయిస్తోంది. గతేడాది పండుగ సీజన్‌లో 25 లక్షలకు పైగా స్మార్ట్‌ఫోన్లను అమ్మగా ఈసారి మాత్రం అన్ని కలిపి 50 లక్షలను దాటేసింది. ఇది కూడా ఓ రికార్డుగానే భావించాలి. రాబోయే రోజుల్లో షావోమి ఇంకెన్ని ఆఫర్స్ ప్రకటించి మార్కెట్ ను షేక్ చేయనుందో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి