హైదరాబాద్‌లో హాటెస్ట్ స్టార్టప్స్ ఇవే
భాగ్యనగరంలో అంకురాలు లెక్కలేనన్ని పుట్టుకొస్తున్నాయి. ఐడియాలు వుండటం వేరు..వాటిని ఆచరణలోకి తీసుకు వచ్చి విజయవంతంగా నిర్వహించడం వేరు. జస్ట్ పట్టుమని 20 ఏళ్లు కూడా నిండని యువతీ యువకులు అద్భుతంగా కలలు కంటున్నారు. తమ కాళ్ల మీద నిలబడాలని బలంగా విశ్వసిస్తున్నారు. కాన్ఫిడెన్స్ లేవల్ పెరిగి పోతోంది వీరికి. డిఫరెంట్ గా ఆలోచించడం..సమాజానికి ..దేశానికి పనికి వచ్చేలా ప్రాజెక్టును తయారు చేసుకోవడం ..ప్రయోగాత్మకంగా అమలు చేయడం..పది మందికి ఉపాధి కల్పించడం..పది కాలాల పాటు కంపెనీ ఉండేలా స్టార్టప్స్‌ను డెవలప్ చేయడం. టీ హబ్ స్టార్ట్ అయ్యాక..స్టార్టప్‌ల సందడి మరింత పెరిగింది.
చూస్తే పిల్లలు అపుడే లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేయాలని అనుకోవడం లేదు..తమను తాము నిరూపించు కోవాలని కోరుకుంటున్నారు.ఒకప్పుడు..జల్సాలు..పబ్‌లు..రెస్టారెంట్‌లు..మందులు..విందులు..ఇలా టైంను వేస్ట్ చేసే వాళ్లు..ఐటీలో పెను మార్పులు వచ్చాక ..కాలానికి ఎదురీదుతున్నారు. ఇతరులతో పోటీ పడుతున్నారు. ఇదంతా ఆరోగ్యకరమైన వాతావరణంలోనే క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఒకరిపై మరొకరు పెత్తనం చెలాయించలని అనుకోవడం లేదు. ఐడియాలు ఉన్నాయి. వాటిని రూపొందించడమే.
ఐటీ మొబిలిటి ..కనెక్టివిటి పెరిగాక ..ప్రపంచం చిన్నదై పోయింది. ఏ మూల ..ఎక్కడున్నా అంతా డేటా వచ్చి చేరుతోంది. ఇది శుభ పరిణామం. నిజాం ఏలిన నగరం ఈ భాగ్యనగరం. ఎందరికో నీడనిచ్చింది. ఇంకెందరికో బతకడం నేర్పింది. ఈ సందర్భంలోనే పిల్లలు ..పెద్దవాళ్లై ఈ నగరానికి పేరు తెచ్చేందుకు తంటాలు పడుతున్నారు. జీవితంలోని సమస్యలే కొత్తగా ఆలోచించేలా చేస్తున్నాయంటున్నారు ఆంట్రప్రెన్యూర్లు. ఇది కూడా గుర్తుంచు కోవాల్సిన పాయింటే. క్రియేటివిటితో స్టార్ట్ చేసిన స్టార్టప్స్ ఇపుడు హాట్ టాపిక్ గా మారాయి.ఇందులో 15 నిలిచాయి. ఫస్ట్ ప్లేస్‌లో గ్రాబ్ ఆన్ స్టార్టప్ నిలిచింది.
కూపన్స్ ఇష్యూ చేస్తుంది ఈ స్టార్టప్. ఎక్కడ షాపింగ్ చేసినా సరే దీని ద్వారా తీసుకుంటే పెద్ద మొత్తంలో కూపన్స్ లభిస్తాయి. తీసుకున్న వాటికి డబ్బులు చేరుతాయయి. రెండో ప్లేస్‌లో హగ్ ఇన్నోవేషన్ నిలిచింది. 2014లో దీనిని ఏర్పాటు చేశారు. గెక్షర్ కంట్రోల్ టెక్నాలజీని డెవలప్ చేస్తుంది. మూడో స్థానంలో పే నియర్ చేరుకుంది. ఇది పూర్తిగా పేమెంట్ అప్లికేషన్ జాగ్గల్ స్టార్టప్ కూడా డిజిటల్ పేమెంట్స్ ఆధారంగా పనిచేస్తోంది. పాపికార్న్, నక్కడ్ షాప్స్, దవన్ బాక్స్, హై రేడియస్, ఈ కిన్ కేర్, జిఫి, మ్యాప్ మై జినోమ్, లెర్న్ స్కూల్,హెలో కర్రీ, ఇలా స్టార్టప్ లు సందడి చేస్తున్నాయి. ఆదాయం బాట పట్టాయి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి