కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో కానిస్టేబుల్‌ ఆత్మహత్య

గజ్వెల్‌లోని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ క్షేత్రంలో వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. కేసీఆర్‌ ఫాంహౌజ్‌లో విధులు నిర్వర్తిస్తున్న 12వ బెటాలియన్‌కు చెందిన వెంకటేశ్వర్లు ఏకే 47 తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఫాంహౌజ్‌లో వెంకటేశ్వర్లు హెడ్‌గార్డ్‌గా విధుల్లో ఉన్నట్టు సమాచారం. ఈ వార్త తెలంగాణ అంతటా వైరల్ గా మారింది. ఓ వైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రంగా మారింది. వీరి సమ్మెకు అన్ని ఉద్యోగ సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు పలికాయి. హైకోర్టు కూడా సర్కార్ తీరుపై సీరియస్ అయ్యింది.

టీఆర్టీ అభ్యర్థులు రోడ్డెక్కారు. ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నం చేశారు. సీఎం పై నిప్పులు చెరిగారు. ఇంకో వైపు విద్యుత్ ఉద్యోగులు ధర్నా బాట పట్టారు. ఇదిలా ఉండగా వెంకటరర్లు సూసైడ్ చేసు కోవడం తెలంగాణాలో సంచలం కలిగించింది. మద్యం మత్తులోనే వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ అనుమానం వ్యక్తం చేశారు. అతను గత కొంతకాలంగా విధులకు సరిగా హాజరు కావడం లేదని తెలిపారు. వెంకటేశ్వర్లు భార్య విఙ్ఞప్తితో తిరిగి అతన్ని విధుల్లోకి తీసుకున్నట్టు చెప్పారు.

మృతుని స్వస్థలం నల్గొండ జిల్లా వలిగొండ మండలంలోని చాడ గ్రామం అని తెలిపారు. కేవలం వ్యక్తిగత సమస్యల కారణంగా వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్నాడని సిద్దిపేట సీపీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గతంలో ఓ మహిళను వేధింపులకు గురిచేసిన కారణంగా ఏడాదిన్నర పాటు సస్పెన్షన్‌కు గురయ్యాడు. విధులకు సరిగా హాజరు కాక పోవడంతో అతనిపై పలు ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మృతుని భార్య శోభ కూరగాయల వ్యాపారం చేస్తుంది. మొత్తం మీద ఈ సంఘటన కలకలం రేపింది. 

కామెంట్‌లు