ఇండియా కంటే పాక్ బెటర్

ఓ వైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది అంటూ బీరాలు పలుకుతున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ మాటలు నీటి మూటలేనని తేలి పోయింది. ఓ వైపు ఉగ్రవాదులు, తీవ్రవాదులతో సతమవుతూనే, ఆర్ధిక రంగంలో తీవ్ర సంక్షోభంతో కొట్టు మిట్టాడుతున్న పాకిస్థాన్ పేదరిక నిర్మూలనలో మాత్రం ఇండియా కంటే మెరుగైన స్థాయిలో ఉన్నది. రోజుకు చిలుప పలుకులు పలుకుతూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్న బీజేపీ సర్కార్ చేస్తున్నది ఏమీ లేదని స్పష్టమైంది. నోట్ల రద్దు, జీఎస్టీ, స్వచ్ఛ భరత్ అంటూ మెస్మరైజ్ చేస్తున్న మోదీ పనితీరు బాగోలేదన్నది స్పష్టమైంది. పేదరిక నిర్మూలనలో పూర్తిగా వెనుకబడింది. ఎంతగా అంటే పాకిస్థాన్, దక్షిణాఫ్రికా వంటి దేశాల కన్నా అథమ స్థితిలో ఉంది.

117 దేశాల సమాచారంతో రూపొందించిన గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో భారత దేశం 102వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో 2015లో 93వ స్థానంలో ఉన్న ఇండియా తాజాగా 102వ స్థానానికి దిగ జారడం మేధావులను, ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. దక్షిణాసియా దేశాల్లో భారత దేశం మినహా మిగిలిన దేశాలు 66 నుంచి 94 వరకు ర్యాంకులు సాధిస్తే, మనం మాత్రం మరింత వెనక్కి వెళ్లడం విస్తు పోయేలా చేసింది. బ్రిక్స్ దేశాల కన్నా దయనీయ పరిస్థితులు భారత దేశంలో కనిపించాయి. ఇక బ్రిక్స్ దేశాల పరంగా చూస్తే అతి తక్కువ ర్యాంకు దక్షిణాఫ్రికాకు వచ్చింది. ఇదిలా ఉండగా ప్రతిసారి వెనుకబడి ఉండే పాకిస్థాన్ సైతం తాజా ర్యాంకింగ్స్‌లో 94వ స్థానాన్ని దక్కించుకుంది.

మరో వైపు మనకంటే బంగ్లాదేశ్ 88వ ర్యాంక్ సాధించి ముందంజలో ఉంది. కాగా 2014 నుంచి 2018 వరకు 117 దేశాల సమాచారాన్ని గ్లోబల్ హంగర్ సంస్థ సేకరించింది. ఈ మేరకు ఇండెక్స్‌ను రూపొందించింది. ఒక దేశంలో పోషకాహార లోపంతో బాధపడే బాలల సంఖ్య, ఎత్తుకు తగిన బరువు లేనటువంటి ఐదేళ్ళ లోపు బాలల సంఖ్య, లేదా, వయసుకు తగిన ఎత్తు లేనటువంటి బాలల సంఖ్య, ఐదేళ్ళ లోపు బాలల మరణాల రేటు ఆధారంగా ఈ సూచీని ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ వాస్తవ రేటింగ్ తో నైనా ప్రధాని కళ్ళు తెరిస్తే బావుండునని మేధావులు సూచిస్తున్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!