ఐసీసీ వరల్డ్ కప్ - మరిచి పోని మధుర క్షణాలు
ఇండియా అంటేనే ఒకప్పుడు హాకీ ఆటకు పేరుండేది. ఇదే మన జాతీయ క్రీడ కూడా. కానీ ఇపుడు ఆ సీన్ మారింది. ఎప్పుడైతే కపిల్‌దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ గెలిచిందో ఆ రోజు నుంచి నేటి దాకా భారత్ ను క్రికెట్ అల్లుకు పోయింది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎక్కడ చూసినా క్రికెట్టే. కోట్లాది మంది భారతీయులు..ప్రపంచ మంతటా ప్రవాసీయులంతా క్రికెట్ అంటే చచ్చి పోతున్నారు. అంతగా అభిమానం పెంచుకున్నారు. క్రికెట్ ఆట అత్యంత జనాదరణను పొందుతోంది. క్రికెట్ ప్రేమికులకు అంతులేని ఆనందాన్ని, సంతోషాన్ని కలుగ చేస్తోంది. బంతికి, బ్యాట్‌కు మధ్య జరుగుతున్న పోరాటంలో ఎవరు గెలుస్తారో తెలియదు కానీ ..నరాలు తెగిపోతాయోమోనన్న ఉత్కంఠ జనాన్ని ఊపేస్తోంది క్రికెట్. మొదటగా ఇంగ్లండ్‌లో ప్రారంభమైన క్రికెట్ ఆట..ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది.
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఏది చెబితే అది వేదం. అదే శాసనం. ముఖ్యంగా దాయాదులైన ఇండియా, పాకిస్తాన్ జట్లు తలపడితే ఓ యుద్ధం జరిగినట్లే భావిస్తారు ప్రపంచమంతా. అంతగా పాపులర్ అయ్యిందీ ఈ క్రికెట్. పొలిటికల్ లీడర్లు, సెలబ్రెటీలు, బిజినెస్ మెన్స్, టెక్కీలు, ఆయా సంస్థల ఛైర్మన్లు, ఎండీలు, సిఇఓలు ..ఇలా ప్రతి ఒక్కరు క్రికెట్ అంటే పడి చచ్చే వారే. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారు ఈ ఆట కోసం. ఆటగాళ్ల కోసం. ఇండియన్ క్రికెటర్స్ ఉన్నంత క్రేజ్ ఇండియాలో ఇంకెవ్వరికీ లేదంటే అతిశయోక్తి కాదేమో. ప్రపంచాన్ని శాసించే ఫుట్‌బాల్ క్రీడతో పాటు టెన్నిస్, క్రికెట్ సమాంతరంగా ఎదుగుతోంది.
అంతకంతకూ క్రేజ్ పెరగడంతో ..క్రికెట్‌లో సమూల మార్పులు చోటు చేసుకున్నాయి. 50 ఓవర్ల పరిమిత క్రికెట్ మ్యాచ్‌ల నుండి 20 ఓవర్ల 20 20 మ్యాచ్‌లకు చేరింది. ఆ తర్వాత ఐపీఎల్ టోర్నీలు ఇండియాను షేక్ చేశాయి. కోట్లాది రూపాయల ఆదాయం బీసీసీఐకి సమకూరింది. ఏకంగా ప్రసార హక్కుల్ని సోనీ స్వంతం చేసుకోగా..ఈసారి స్టార్ గ్రూపు ఏకంగా 16 వేల 746 కోట్లకు బిడ్ పాడి దక్కించుకుంది. ఇది ఓ రికార్డు. ఇంతలా పెన వేసుకుని, కోట్లాది ప్రజల గుండెల్లో అద్భుత క్షణాలను ఆవిష్కరింప చేస్తున్న ఆట ఏదన్న ఉందంటే అది క్రికెట్ తప్ప మరోటి కాదు. ఇక వరల్డ్ కప్ క్రికెట్ .. పరంగా చూస్తే ..2019లో ఆల్ రెడీ పోటీలు ప్రారంభమయ్యాయి. ఆయా జట్లు గ్రూపుల వారీగా తలపడుతున్నాయి. హాట్ ఫెవరేట్ అనుకున్న జట్లు తడబడుతుండగా అనామక జట్లు అద్భుత విజయాలు నమోదు చేసుకుంటున్నాయి.
ప్రపంచంలో మొట్ట మొదటిసారిగా 1975 సంవత్సరంలో ఇంగ్లండ్ దేశం వరల్డ్ క్రికెట్ కప్ టోర్నీ నిర్వహించింది. ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ మైదానంలో జరిగింది. వెస్ట్ఇండీస్ ..ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. 60 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విండీస్ 291 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాపై 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టేడియంలో 24 వేల మంది ఉన్నారు. ఇక రెండో ప్రపంచ కప్ పోటీలు ఇదే దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్‌లో వెస్ట్ఇండీస్ ..ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. 9 వికెట్లు కోల్పోయి విండీస్ 296 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 51 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌట్ అయింది. 92 పరుగుల తేడాతో విండీస్ ఘన విజయం నమోదు చేసుకుని కప్ చేజిక్కించుకుంది. 32 వేల మంది ఈ మ్యాచ్ ను తిలకించారు.
1983లో మూడో ప్రపంచ కప్ క్రికెట్ టోర్నీని ఇంగ్లండ్ దేశం ఆతిథ్యం ఇచ్చింది. ఫైనల్‌లో ఇండియా, విండీస్ జట్లు తలపడ్డాయి. 54.4 ఓవర్లలో 183 పరుగులకు ఆలవుట్ కాగా, విండీస్ జట్టు 52 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. కపిల్‌దేవ్ కెప్టెన్ గా అద్భుత విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ దెబ్బతో విండీస్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 1987లో ఇండియా , పాకిస్తాన్ ఇరు దేశాలు నాలుగో ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ఫైనల్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 246 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది.
1992లో ఐదో ప్రపంచ కప్ టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా నిర్వహించాయి. ఫైనల్‌లో పాకిస్తాన్, ఇంగ్లండ్ తలపడ్డాయి. పాకిస్తాన్ 50 ఓవర్లలో 246 పరుగులు చేయగా, ఇంగ్లండ్ 227 పరుగులకు ఆలౌట్ అయింది. పాకిస్తాన్ 22 పరుగుల తేడాతో గెలుపొందింది. 1996లో పాకిస్తాన్, శ్రీలంక, ఇండియా మూడు దేశాలు సంయుక్తంగా వరల్డ్ క్రికెట్ టోర్నమెంట్‌ను నిర్వహించాయి. ఈ టోర్నీలో ఆతిథ్య జట్టు శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. లాహోర్‌లో హోరా హోరీగా ఇరు జట్ల మధ్య పోటీ జరిగింది. శ్రీలంక జట్టు నిర్ణీత 46.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 245 పరుగులు చేయగా..ప్రత్యర్థి ఆస్ట్రేలియా జట్టు 7 వికెట్లు కోల్పోయి కేవలం 241 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. శ్రీలంక 7 వికెట్లతో అద్భుత విజయం సాధించింది.
ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే..పసికూనలుగా భావించిన శ్రీలంక జట్టుకు అద్భుతమైన ప్రతిభను కనబర్చేలా తీర్చిదిద్దాడు ..ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ. ఆయన నాయకత్వంలో ఆ జట్టు ఎన్నో విజయాలు సాధించింది. నాయకుడిగా ఎనలేని విజయాలు శ్రీలంకకు అందించాడు. క్రికెట్ చరిత్రలో శ్రీలంకకు ఒక స్థానం దక్కేలా చేశాడు. 1990 మధ్య కాలంలో క్రికెట్‌లో దిగ్గజ క్రికెటర్లు ప్రపంచ క్రికెట్ అభిమానులను తమ ఆటతీరుతో, అద్భుత ప్రదర్శనతో కనువిందు చేశారు. ముఖ్యంగా ఇండియా నుండి మాజీ కెప్టెన్..మణికట్టు మాంత్రికుడు మహ్మద్ అజారుద్దీన్ చిరస్మరణీయ గెలుపులు అందించాడు. బ్యాట్స్‌మెన్‌గా, ఫీల్డర్‌గా, కెప్టెన్‌గా పలు ఫార్మాట్‌లలో ఇండియాకు ప్రపంచంలో మంచి పేరు తీసుకు వచ్చాడు. ఆతర్వాత అనుకోని రీతిలో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు.
1999 వరల్డ్ కప్ టోర్నీకి మరింత క్రేజ్ వచ్చింది. ఇంగ్లండ్ దేశం ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. లండన్‌లో ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. లండన్‌లో మ్యాచ్ జరిగింది. మొదట ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ చేసి 20.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ ను కొన్ని ఓవర్లకే పరిమితం చేశారు. అనుకోని రీతిలో అదృష్టం ఆస్ట్రేలియాను వరించింది. పాకిస్తాన్ 39 ఓవర్లలో 132 పరుగులకే ఆలౌట్ అయింది. కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో ప్రపంచ కప్‌ను ఎగరేసుకు పోయింది ఆస్ట్రేలియా జట్టు.
ఇక 2003 ప్రపంచ కప్ విషయానికి వస్తే..దక్షిణాఫ్రికా దేశం ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది. ఆస్ట్రేలియా, ఇండియా క్రికెట్లు జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌ను ఛేదించలేక ఇండియా జట్టు 39.2 ఓవర్లలో 234 పరుగులు చేసి 125 పరుగుల తేడాతో కప్పును కోల్పోయింది.
2007లో దక్షిణాఫ్రికా దేశంలో ప్రపంచ కప్ టోర్నమెంట్‌కు హోస్ట్‌గా ఉన్నది. బ్రిడ్జ్ టౌన్ లో వేలాది మంది అభిమానుల సాక్షిగా ..స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సమయంలో దీనిని నిర్వహించారు. నెల్సెన్ మండేలాకు గౌరవ వందనం చేశారు క్రికెటర్లు. ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు ఫైనల్ కు చేరుకున్నారు. నిర్ణీత 38 ఓవర్లలో ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్లు కోల్పోయి 281 పరుగులు చేయగా, శ్రీలంక 36 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఇక 2011 ప్రపంచ కప్ విషయానికి వస్తే..శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాలు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించాయి. ముంబయిలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా జట్టు 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. టార్గెట్‌ను ఛేదించే క్రమంలో ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో పోరాడాయి.
ఎంఎస్ ధోనీ నేతృత్వంలోని భారత జట్టు అనూహ్యమైన రీతిలో శ్రీలంక జట్టును కట్టడి చేసింది. 50 ఓవర్లలో 6 వికెట్లు పడగొట్టి 274 పరుగులకే పరిమితం చేసింది. దీంతో ఈ కప్పు ఇండియా వశమైంది. 2015లో జరిగిన ప్రపంచ కప్ కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. పలు జట్లు తమ ప్రతిభను కనబర్చాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రికెట్ జట్లు ఫైనల్‌కు చేరాయి. మెల్ బోర్న్ లో ఫైనల్ జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 33.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేయగా..ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టు 45 ఓవర్లలో 183 పరుగులకే చతికిలపడింది. మొత్తం మీద 2019లో ప్రస్తుతం ప్రపంచ కప్ టోర్నమెంట్ జరుగుతోంది. అన్ని జట్లు బలంగానే ఉన్నట్టు అనిపిస్తున్నా..ఇండియా ఫెవరేట్ జట్టుగా కనిపిస్తోంది. ఇంకా కొన్ని రోజుల వరకు క్రికెట్ ఫీవర్ తగ్గేట్గుగా లేదు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి