స్వామీ సదా స్మరామి - ఆశీస్సులు పొందిన జగన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సీట్లను గెలుపొంది అటు అసెంబ్లీలో, ఇటు లోక్‌సభ స్థానాల్లో తన సత్తాను చాటిన వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు , ఏపీ సీఎం విశాఖకు వచ్చారు. ఆయనకు అపూర్వమైన రీతిలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు జేజేలు పలికారు. దారి పొడవునా ఫ్లెక్సీలు, బ్యానర్లు, బాణా సంచాలు పేలుస్తూ ..వేలాది మంది ఆయన వెంట పరుగులు తీశారు. జై జగన్ అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ యువనేత కొట్టిన దెబ్బకు అపర చాణుక్యుడిగా పేరొందిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విలవిల లాడి పోయారు.
ఆ పార్టీకి ఇపుడు జనం లేకుండా పోయారు. అంతలా ఈ యువనేత తన స్ట్రాటజీని ప్లాన్ చేసుకుంటూ చాప కింద నీరులా పవర్ లోకి వచ్చారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోగా , 22 స్థానాల్లో ఎంపీ సీట్లను గెలుపొంది తన పవర్ ఏమిటో రుచి చూపించారు పసుపు తమ్ముళ్లకు. అతిరథ మహారథులు, సీనియర్ నాయకులు వైసీపీ ప్రభంజనానికి కొట్టుకు పోయారు. అంతలా జనం ఛీ కొట్టారు టీడీపీ శ్రేణుల్ని. ఆఖరులో పసుపు కుంకుమ అంటూ జనాన్ని బురిడీ కొట్టించాలని చూసిన బాబుకు బాగానే బుద్ది చెప్పారు. కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. ఆయనకు సైతం భారీగా ఓట్లు తగ్గాయి.
తనకు వెన్నంటి వుంటూ ..ఎప్పటికప్పుడు సలహాలు , సూచనలు అందించడమే కాకుండా తనలో భక్తి భావాన్ని పెంపొందింప చేసిన విశాఖలోని శ్రీ శారదా పీఠం పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు పొందేందుకు విశాఖకు తన పరివారంతో వచ్చారు జగన్. ఈ యువ సీఎంకు సాదర స్వాగతం లభించింది. స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు జగన్. ఆలయాల అభివృద్ధికి పాటుపడాలని, ఎవరైనా ఆలయాల జోలికి వస్తే ఇలాగే ఓటమి పాలవుతారని, ఎక్కడైతే గుళ్లో ధూప, దీపాలు, నైవేద్యాలు ఉంటాయో అక్కడ సుభిక్షంగా ఉంటుందని బోధించారు స్వామి వారు.
జగన్‌కు తిరుగు లేదని, ఇక పాలన జనరంజకం కావాలని సూచించారు. దేవుడు చల్లంగా చూస్తాడని, శ్రీ శారదా అమ్మ వారు ఎల్లవేళలా అండగా ఉంటుందని, కావాల్సందిల్లా సంకల్పమే తప్ప మరొకటి కాదన్నారు. స్వామి వారి సన్నిధిలో జగన్ సంతోషంగా గడిపారు. ఏపీ రాష్ట్ర ప్రజలు క్షేమంగా ఉండాలని, వారు మరిచి పోని విధంగా తన రుణం తీర్చుకుంటానని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. తిరుమలను సందర్శించుకున్న జగన్ ..సీఎం ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు ఫోన్‌లో పొందారు. మొత్తం మీద జగన్‌లో వచ్చిన మార్పును చూసి ..ఆయన అభిమానులు సంతోషానికి లోనవుతున్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి