ప్ర‌పంచాన్ని నివ్వెర ప‌రిచిన జియోమీ - విద్యుత్ బైక్‌ను లాంఛ్ చేసిన చైనా

లోకంలో కొత్త వ‌స్తువును త‌క్ష‌ణ‌మే రూపొందించాలంటే చైనా దేశం త‌ర్వాతే ఏదైనా. ఇప్ప‌టికే త‌క్కువ ధ‌ర‌లో..అంద‌రికీ అందుబాటులో ..అన్ని ఫీచ‌ర్స్ వుండేలా మొబైల్స్, యాక్సెస‌రీస్‌, టీవీల‌ను రూపొందిస్తూ వ‌ర‌ల్డ్ మార్కెట్‌లో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను క‌లిగి ఉన్న‌ది జియోమి. అంద‌రూ రెడ్ మిగా పిలుస్తారు. ఇపుడు ప్ర‌పంచాన్ని నివ్వెర పోయేలా చేసింది ఆ కంపెనీ. ఏకంగా కేవ‌లం విద్యుత్ తో న‌డిచే బైక్‌ను త‌యారు చేసింది. ఆక‌ట్టుకునే డిజైన్‌తో ..అంద‌రికీ సౌక‌ర్యంగా ఉండేలా తీర్చిదిద్దింది. ఇంకేం ఇపుడంతా దానిని స్వంతం చేసుకునేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌నం పోటీ ప‌డుతున్నారు. ప్ర‌స్తుతానికి చైనాలో ఈ కంపెనీ తాజాగా విడుద‌ల చేసింది. ఇంకేం లోకమంత‌టా ఈ బైక్ ..వైర‌ల్‌గా మారింది.

ఇదీ చైనాకున్న స‌త్తా ఏమిటో మ‌రోసారి నిరూపించుకుంది. ఈ విద్యుత్ సాయంతో న‌డిచే బైక్ పేరు హిమో టి1. 14000 ఎంఏహెచ్ బ్యాట‌రీ సామ‌ర్థ్యం దీని స్వంతం. దీనిని ఇండియ‌న్ మార్కెట్‌లో స్వంతం చేసుకోవాలంటే..మీ ద‌గ్గ‌ర 30 వేల రూపాయ‌లు వుంటే చాలు. ఎంచ‌క్కా ఈ బుల్లి బైక్ మీద స్వారీ చేయొచ్చు. ఎలాంటి టెక్నిక్ వుండాల్సిన ప‌నిలేదు. ఎక్కువ నాలెడ్జ్ కూడా అక్క‌ర్లేదు. కేవ‌లం ఒకే ఒక్క బ‌ట‌న్ ఆన్ చేస్తే చాలు..హాయిగా సైకిల్ తొక్కిన‌ట్టే దీనిని న‌డిపించ‌వ‌చ్చు. ఇటీవ‌లే జియోమి కంపెనీ లెడ్..స్మార్ట్ టీవీల‌ను విడుద‌ల చేసింది. ఇండియాలో వీటిని ఎగ‌బ‌డి కొన్నారు క‌స్ట‌మ‌ర్స్. ప్యూరిఫైర్స్ అండ్ అద‌ర్ ప్రొడ‌క్ట్స్ ను కూడా లాంఛ్ చేసింది. త్వ‌ర‌లో భార‌త్ మార్కెట్‌లోకి ఈ బైస్కిల్ రానుంది. ఒక్క‌సారి ఛార్జింగ్ చేస్తే చాలు..120 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయవ‌చ్చు

దీనిపై. డిజిట‌ల్ ఇనుస్ట్రుమెంట్ క్ల‌స్ట‌ర్, ప‌వ‌ర్ ఫుల్ లెడ్ బల్బు కూడా అమ‌ర్చారు. క్ల‌స్ట‌ర్ ప‌రిక‌రాన్ని ఏర్పాటు చేయ‌డం వ‌ల్ల‌..ఎంత వేగంలో వెళుతోంది. బ్యాట‌రీ ఏ స్థాయిలో వుంది. టైంతో పాటు దారిని కూడా చూపిస్తుంది బైక‌ర్స్ కు. చైనాలో హిమో కంపెనీకి విప‌రీత‌మైన డిమాండ్ ఉంది అక్క‌డ‌. మొద‌ట‌గా హిమో వి1, హిమో సి20 పేరుతో ఈ బైక్స్ ను త‌యారు చేసింది. ప్ర‌స్తుతం మూడో ఎల‌క్ట్రిక్ బైక్‌ను లాంఛ్ చేసింది. 14 ఏహెచ్ ర‌మారమి 60 కిలోమీట‌ర్లు ప్ర‌యాణం చేయొచ్చు. తెలంగాణ స‌ర్కార్ ఈ బైక్‌ల‌కు ఎక్కువ ప్ర‌యారిటీ ఇస్తోంది. హోండా, టీవీఎస్, ఫోర్డ్ , త‌దిత‌ర బిగ్ కంపెనీల‌న్నీ ఈ బైస్కిల్స్ ను రూపొందించాయి. ఇపుడు జియోమీ త‌క్కువ ధ‌ర‌కే అందిస్తోంది. బెంగ‌ళూరు కేంద్రంగా నిర్వ‌హిస్తున్న స్టార్ట‌ప్ కంపెనీ తాజాగా లాంఛింగ్ అయిన మి- విద్యుత్ సైకిల్‌కు జై కొడుతోంది. మొత్తం మీద బైస్కిల్ ప్రేమికుల‌కు ఓ పండ‌గేన‌ని చెప్పుకోవ‌చ్చు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!