బిగ్ ఆఫర్ కొట్టేసిన బైజు - ఖతార్ కంపెనీ పెట్టుబడి
ఇండియాకు చెందిన స్టార్టప్‌లు దిగ్గజ కంపెనీలను ఆకర్షిస్తున్నాయి. భారీగా పెట్టుబడులు అందుకుంటున్నాయి. తాజాగా ఖతార్ కంట్రీకి చెందిన సావరిన్ ఫండ్ అండ్ ఓల్ వెంఛర్స్ 150 మిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు ప్రకటించాయి. ఆన్‌లైన్‌లో విద్యా బోధనను వినూత్నంగా స్టార్ చేసింది బైజు కంపెనీ. ఒకప్పుడు చదువు కోవాలంటే నానా ఇబ్బందులు. వాటన్నింటిని దూరం చేస్తూ బైజు ఆన్ లైన్‌లోనే క్లాసులు చెప్పిస్తోంది. ఆయా సబ్జెక్టుల నిపుణులతో తరగతులు నిర్వహిస్తూనే..పిల్లలకు , విద్యార్థులకు చేదోడుగా ఉంటోంది. బైజు వల్ల లక్షలాది మందికి మేలు జరుగుతోంది విద్యా పరంగా. కంటెంట్ విషయంలోను..ఆయా సబ్జెక్టుల పరంగా బైజు కంపెనీ క్వాలిటీని కాపాడుకుంటూ వస్తోంది.
ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ , ఖతార్ గవర్నమెంట్స్ సావరిన్ వెల్త్ ఫండ్ తో పాటు శాన్ ఫ్రాన్సిస్‌కో కేంద్రంగా పనిచేస్తున్న ఓల్ వెంచర్స్ బైజుకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చాయి. భారీ ఎత్తున పెట్టబుడులు పెడుతున్నట్లు వెల్లడించాయి. ఈ పెట్టుబడి వల్ల ఇతర దేశాల్లో కూడా ఆన్‌లైన్‌లో చదువు కునేందుకు ఎక్కువ డిమాండ్ ఉంటోంది..ఇంకా ఎక్కువ స్కోప్ ఉందని నమ్ముతోంది ఆ సంస్థ. పాఠాలు తయారు చేస్తోంది..అందివచ్చిన టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగించుకుంటోంది బైజు. ఇండియా వ్యాప్తంగా ప్రధాన నగరాలలో బైజూ తన కార్యకలాపాలను విస్తరించింది. ప్రతి చోటా ఎడ్యూకేషన్ ఇనిస్టిట్యూట్స్‌తో టై అప్ చేసుకుని క్వాలిటీ ఉండేలా జాగ్రత్త పడుతోంది. మార్కెట్ అంచనాల ప్రకారం బైజు ప్రస్తుత కంపెనీ విలువ 5.7 బిలియన్ డాలర్లుగా ఉంది.
ఈ దేశంలో అత్యంత విలువైన ప్రైవేట్ ఇంటర్నెట్ కంపెనీగా బైజు నాలుగో స్థానంలో నిలిచింది. అమెరికా దిగ్గజ కంపెనీ వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన భారత్‌కు చెందిన ఫ్లిప్ కార్ట్ మొదటి ప్లేస్‌లో ఉండగా , పేటిఎం అండ్ ఓలా తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాయి. వీటి తర్వాత బైజు వచ్చి చేరింది. గత ఏడాది నుంచే మెల్లగా తన స్థానాన్ని పదిల పర్చుకుంటోంది ఈ సంస్థ. గత ఏడాది అంటే 2018లో బైజు మార్కెట్ విలువ 3.6 బిలియన్స్ ఉండగా ఇపుడు అది 5.4 బిలియన్స్‌కు పెరిగింది. జనరల్ అట్లాంటిక్ పార్ట్‌నర్స్ చేరడంతో బైజు వాల్యూ అమాంతం 25 మిలియన్లకు చేరుకుంది. బైజు రవీంద్రన్ దీనిని ప్రారంభించారు. ఆయన వాటా 36 శాతం. అంటే 1.9 బిలియన్‌ల ఆస్తి ఆయన ఒక్కడికే దక్కింది. మొత్తం మీద ఈ ఇండియన్ కంపెనీకి రాబోయే రోజుల్లో మంచి ఫ్యూచర్ ఉందన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి