ఐటీ మార్కెట్ లో విప్రో కంపెనీదే హవా
ఐటీ దిగ్గజ కంపెనీగా పేరొందిన బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజీమ్ ప్రేమ్‌జీ నేతృత్వంలోని విప్రో కంపెనీ తన హవాను కొనసాగిస్తోంది. 2 వేల 388 కోట్ల ఆదాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో గడించింది. గణనీయంగా గత ఏడాది కంటే ఈ సారి పెంచుకుంది. జూన్ క్వార్టర్ వరకు చూస్తే 12 శాతం పెరిగింది. సీక్వెన్షియల్‌గా చూస్తే 4 శాతం తగ్గింది. గత క్యూ1 లో 13 వేల 978 కోట్లుగా ఉండగా 5 శాతం ఆదాయం వృద్ధితో 14 వేల 716 కోట్లకు పెరిగిందని విప్రో కంపెనీ వెల్లడించింది. ఇటీవల ఫలితాల వెల్లడిలో టీసీఎస్, ఇన్ఫోసిస్‌ల కంటే విప్రో రెవిన్యూ విషయంలో వెనుకబడి పోవడం గమనార్హం. టీసీఎస్ కంపెనీ ఆదాయం 11 శాతం వృద్ధితో 38 వేల 172 కోట్లకు చేరుకోగా, ఇన్ఫోసిస్ కంపెనీ ప్రాఫిట్ 14 శాతం వృద్ధితో 21 వేల 803 కోట్లకు ఆదాయం పెరిగింది.
విప్రో కంపెనీకి కీలకమైన విభాగం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీనే. ఈ విభాగం ఆదాయం 2 శాతం తగ్గి 203 కోట్ల డాలర్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో ఈ విభాగం ఆదాయం 204 -208 కోట్ల డాలర్ల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా వేసింది. అయితే నిర్వహణ లాభం 6 శాతం తగ్గి 2 వేల 652 కోట్లకు చేరుకుంది. మార్జిన్ పరంగా చూస్తే 18.4 శాతానికి చేరింది. వేతనాల ఖర్చు అంచనాలకు మించి ఉండడం, రూపాయి బలపడటం కూడా కారణాలని పేర్కొంది. కాగా ప్రస్తుతం తామేమీ ఆందోళన చెందడం లేదని ..కంపెనీ అన్నాక సవాలక్ష సమస్యలు ఉంటాయి. ఐటీ రంగంలో ఒడిదుడుకులు అనేవి సర్వ సాధారణమే. దీనిని పెద్దగా పట్టించుకోం. మేం మూడో స్థానంలో ఉన్నాం. కీలకమైన సేవలన్నింటిలోను మేం ముందంజలో ఉన్నప్పటికీ కొంత గ్యాప్ ఏర్పడిన మాట వాస్తవమే నంటూ తెలిపింది.
తాజాగా 10 కోట్ల డాలర్లకు మించిన ఒప్పందాలు మూడు సాధించామని విప్రో సీఇఓ అబిదాలి ప్రకటించారు. అంతర్జాతీయ పరంగా చూస్తే ఐటీ మార్కెట్ రంగం నిలకడగానే ఉందని, అయితే దీనికి తగ్గట్టు ఆర్థిక వ్యవస్థ మందగమనంగా ఉండడంతోనే ఈ సమస్య వచ్చి పడిందన్నారు. బ్యాంకింగ్, బీమా, ఆర్థిక రంగ కంపెనీలు నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒకింత వెనుకాడుతున్నాయని వివరించారు. ఇది తాత్కాలికంగానే ఉంటుందని, రోజులు గడుస్తున్న కొద్దీ పరిస్థితులు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశాభావంతో ఉన్నామని చెప్పారు. కాగా సెబీ ఆమోదం రాగానే 10 వేల 500 కోట్ల షేర్ల బై బ్యాక్‌ను పూర్తి చేస్తామని తెలిపారు. ఒక్కో షేరును 325 ధరకు కేటాయిస్తోంది. ఇంత జరిగినా ఇంకా అనిశ్చితి కొనసాగుతుండడం విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి