నో పాలిటిక్స్..మూవీస్ బెటర్..తలైవా, కమల్ లకు మెగా హితబోధ..!

భారతీయ సినిమా రంగంలో ఆయనకు ఓ చరిత్ర ఉంది. తెలుగు సినిమా రంగాన్ని ఆయన కొన్నేళ్ల పాటు తన ప్రభావాన్ని చూపిస్తున్న ఒకే ఒక్క నటుడు. వన్ అండ్ ఓన్లీ హీరో, లక్షలాది మంది అభిమాలను సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఎట్టకేలకు తన మనసులో ఉన్న దానిని ఇన్నాళ్లకు బయట పెట్టారు. ఏకంగా తన తోటి నటులు ఇండియాలో పేరున్న తమిళ్ తలైవా రజనీకాంత్, విలక్షణమైన యాక్టర్ కమల్ హాసన్ లకు పాలిటిక్స్ వద్దే వద్దంటూ సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ రంగం పూర్తిగా కలుషితమై పోయిందని, దానిలో మనలాంటి నటులు నెగ్గుకు రావడం కష్టమన్నారు. ఇప్పటికే కమల్ హాసన్ తమిళనాడులో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. మరో వైపు కోట్లాది ఫ్యాన్స్ కలిగిన రజనీకాంత్ కూడా పార్టీని స్థాపించాలన్న డిమాండ్ పెరుగుతూ వస్తోంది. డీఎంకే అధినేత స్టాలిన్ తో ఆయన సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఇక బీజేపీ హోమ్ శాఖా మంత్రి అమిత్ చంద్ర షా కూడా తలైవాను బీజేపీలోకి తీసుకు రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

తాజాగా రజనీకాంత్ కూడా కొంచెం సన్నిహితంగా ఉన్నట్టు కనిపించారు. భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమానికి రజనీకాంత్ ప్రత్యేకంగా హాజరయ్యారు. అంతే కాకుండా స్పెషల్ గా అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ ముగ్గురు కూడా ఏకాంతంగా కొంత సేపు మాట్లాడుకున్నారు కూడా. ఇదే సమయంలో ఓ సమావేశంలో హిందీ భాషను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని, అది రాజ భాష అంటూ అమిత్ షా చెప్పారు. ఈ వ్యాఖ్యలు దేశంలో సంచలనం కలిగించాయి. ఎక్కడ చూసినా అమిత్ షా పై ఆరోపణలు వెల్లువెత్తాయి. తమిళనాడులో ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఇంకో వైపు బెంగాల్ లో కూడా బీజేపీపై విమర్శలు రావడంతో పార్టీకి డ్యామేజ్ కలుగుతుందని భావించిన అమిత్ షా అలాంటిది ఏమీ లేదని చెప్పారు. ఆయా ప్రాంతాలు, రాష్ట్రాలలో వారి మాతృ భాషను వాడుతూనే రెండో భాషగా హిందీని కూడా వాడాలని సూచించారు. ఇదే సమయంలో తలైవా, స్టాలిన్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దగ్గరవుతారనుకున్న సమయంలో భాష విషయంలో కొంత ఎడబాటు ఏర్పడింది.

ఇక చిరంజీవి తనకు రాజకీయంగా ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన సీఎం కావాలని కలలు కన్నారు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజారాజ్యం పేరుతో పార్టీని స్థాపించారు. ఎక్కడా ఫలితాలు రాబట్టలేక పోయారు. తీరా ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు రావడంతో ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేశారు. చిరంజీవి ఎంపీగా పని చేశారు. ఇప్పుడు కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం భారీ ఖర్చుతో తన కొడుకు రామ్ చరణ్ నిర్మాతగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో సైరా పేరుతో సినిమా తీశారు. దానిపై భారీ అంచనాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా చిరంజీవికి రజనీకాంత్, కమల్ హాసన్ లు సన్నిహిత స్నేహితులు. తన రాజకీయ అనుభవం దృష్ట్యా మీరిద్దరూ పాలిటిక్స్ లోకి రాక పోవడమే బెటర్ అంటూ సూచించారు. నిజాయితీగా పని చేయాలని అనుకున్నా రాజకీయాల్లో పని చేయలేమంటూ స్పష్టం చేశారు. తాను పాలిటిక్స్ లో ఎంటరైనప్పుడు సినిమా రంగంలో నెంబర్ వన్ పొజిషన్ లో ఉండే వాడినని, ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేసి తనను, తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ను ఓడించారని అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లోకి రాకపోవడమే బెటర్ అని, లేకపోతే జనం నుంచి ఇబ్బందులు ఎదురవ్వక తప్పదన్నారు. మొత్తం మీద మెగాస్టార్ కు కలిగిన జ్ఞానోదయం ఈ తమిళ అగ్ర హీరోలను కదిలిస్తుందో లేదో వేచి చూడాలి.

కామెంట్‌లు