గోద్రెజ్ చేతికి ఆర్కే స్టూడియోస్
ఎట్టకేలకు గోద్రెజ్ దిగ్గజ కంపెనీ ప్రతిష్టాత్మకమైన ..బాలీవుడ్ నిర్మాత రాజ్ కపూర్‌కు చెందిన ఆర్కే స్టూడియోల సముదాయాన్ని దక్కించుకుంది. ఈ స్టూడియోను దక్కించుకునేందుకు భారీ ఎత్తున సంస్థలు పోటీ పడ్డాయి. గత ఏడాది అక్టోబర్ లోనే 190 కోట్ల రూపాయలకు వేలం పాటలో చేజిక్కించుకుంది. కొనుగోలుకు సంబంధించి లావాదేవీలన్నీ పూర్తి కావడంతో ఆర్కే ఐకాన్ స్టూడియోస్ గోద్రెజ్ పరమైంది. కొన్ని తరాల పాటు బాలీవుడ్ సినిమాలకు ..ఆర్టిస్టులకు, కళాకారులకు, టెక్నిషియన్లకు , చిన్నా చితక ప్రతిభ కలిగిన వారికి ఈ ఆర్కే స్టూడియోస్ పెద్ద దిక్కుగా వుంటూ వచ్చాయి. ఆర్కే స్టూడియోస్ ను రూపాయల్లో వర్ణించలేం. దీనిని వెలకట్టలేం కూడా. కాకపోతే ఏదో ఒకరోజు అమ్ముకోవాల్సిన పరిస్థితి కపూర్ కుటుంబాలది.
రాజ్ కపూర్ ..ఇండియన్ సినిమాకు అతడో ఐకాన్. ఆయన ఓ బ్రాండ్. ఆ కాలంలోనే ..ఎంతో ముందు చూపుతో ఆర్కే స్టూడియోస్ పేరుతో ఏర్పాటు చేశారు. ఎన్ని కోట్లు పెట్టామన్నది ముఖ్యం కాదు.ఎంతో ప్రతిష్టాక్మమైన ..అరుదైన నటుడికి చెందిన ఆస్తులు మా సంస్థలో విలీనం కావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోందంటూ గోద్రెస్ సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. ఇలాంటి అరుదైన అవకాశాలు కొద్ది మందికి లేదా కొన్ని సంస్థలకే దక్కుతాయని, అలాంటి మహా నటుడికి చెందిన స్టూడియోస్ మాకు లభించడం ఎంతో సంతోషాన్ని కలుగ చేస్తోందని తెలిపింది. చెంబూరు మౌళిక సదుపాయాల పరంగా..ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధిని సాధిస్తోంది. రాబోయే కాలంలో మా వ్యూహాలను ఆచరణలోకి తీసుకు వచ్చేందుకు ఈ స్థలం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది గోద్రెజ్.
ఆర్కే స్టూడియోస్‌కు ఎంతో మంచి పేరుంది. ఆ పేరుకు ఎలాంటి మచ్చ అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాపై ఉందంటూ కంపెనీ తెలిపింది. 2017లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఈ స్టూడియోస్‌లో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మరమ్మతులు చేయించాలని యాజమాన్యం భావించింది. ఎందుకనో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. దీనిని అమ్ముతున్నట్లు మేనేజ్‌మెంట్ ప్రకటించింది. ముంబయిలోని చెంబూరులో 2.2 ఎకరాల స్థలంలో ఆర్కే స్టూడియోస్ నెలకొని ఉన్నది. 70 ఏళ్ల కిందట ప్రముఖ సినీ నిర్మాత, నటుడు రాజ్ కపూర్ ఈ స్టూడియోస్ ను నిర్మించారు. 1970, 1980 కాలం నాటి సినిమాలన్నీ ఇందులోనే రూపుదిద్దుకున్నాయి. చాలా సినిమాలు ఇక్కడే చిత్రీకరణ జరుపుకున్నాయి. ఆర్కే ఫిలింస్ బ్యానర్‌లో ఆవారా, మేరా నామ్ జోకర్, శ్రీ 420 వంటి సినిమాలు నిర్మించబడ్డాయి.
రాజ్ కపూర్ తనువు చాలించాక వారి కుటుంబీకులు ఈ స్టూడియోస్ బాగోగులు చూస్తూ వచ్చారు. దీనిని అమ్మి వేయాలంటూ రిషీ కపూర్ ఫ్యామిలీ నిర్ణయించడంతో భారీ ఎత్తున ..బడా కంపెనీలు స్వంతం చేసుకునేందుకు పోటీ పడ్డాయి. కానీ గోద్రెజ్ కంపెనీ అనూహ్యంగా స్వంతం చేసుకుంది. 70 ఏళ్ల ప్రస్థానంలో ఆర్కే స్టూడియోస్ గుర్తుంచుకోతగ్గ సినిమాలను అందించింది. 1948లో ఆగ్ , 1949లో బర్సాత్ సినిమాలు నిర్మించారు. అనూహ్యంగా బర్సాత్ భారీ విజయాన్ని స్వంతం చేసుకోవడంతో ఆ స్టూడియోస్ కు రాజ్ కపూర్ బర్సాత్ లోగోను పెట్టారు. ఆవారా బూట్ పాలిష్, జాగ్‌తే రహో, శ్రీ 420 సినిమాలు విజయం సాధించాయి. 15 సినిమాలకు పైగా చిత్రీకరణ జరుపుకున్న సినిమాల్లో నర్గీస్ నటించింది. 1985లో ఆఖరుగా రామ్ తేరీ గంగా మైలి సినిమాగా వచ్చింది.
ఆర్కే ఫిలింస్ ఎన్నో సినిమాలను నిర్మించింది. జిస్ దేష్ మే గంగా బెహతీ హై, మేరా నామ్ జోకర్, బాబీ, సత్యం శివం సుందరం, ప్రేమ్ రోగ్ సినిమాలు ఉన్నాయి. రాజ్ కపూర్ తర్వాత ఆయన కుమారుడు రణధీర్ కపూర్ స్టూడియోను చూసుకున్నాడు. కల్ ఆజ్ అవుర్ కల్ సినిమాను బబితతో కలిసి నిర్మించారు. ఇందులో తన తాత పృథ్విరాజ్ కపూర్‌తో కలిసి సినిమా తీశారు. ఆయన దర్శకత్వంలోనే మరో రెండు సినిమాలు నిర్మించారు. అందులో ధరమ్ కరమ్ సినిమా ఒకటి. మధ్యలోనే వదిలేశారు రాజ్ కపూర్. తండ్రి చనిపోవడంతో ..1991లో హెన్నా తీశాడు. ఆయన తమ్ముడు శశి కపూర్ కూడా ఎన్నో సినిమాలు తీశారు. రాజ్ కపూర్ 1988లో చనిపోయాడు. రణధీర్ కపూర్ దీనిని చూసుకున్నాడు. ఆయన తమ్ముడు రాజివ్ కపూర్ ప్రేమ్ గ్రంథ్ తీశాడు. రిషి కపూర్ దర్శకత్వంలో ఆ అబ్ లౌట్ చలే సినిమా వచ్చింది.
ఆయన ఎన్నో సినిమాలను ఆర్కే బ్యానర్ కింద విడుదల చేశాడు. చాలా సినిమాలకు ఈ స్టూడియో అన్ని రకాలుగా ఉపయోగపడింది. కాస్టూమ్స్ విషయంలో హాలీవుడ్ స్టూడియోలతో పోటీ పడింది. ఇప్పటికే మా ఫాదర్ ఏర్పాటు చేసిన ఈ స్టూడియోను సంరక్షించాలని అనుకున్నాం. కోట్లాది రూపాయలు ఖర్చు చేశాము. కానీ తెల్ల ఏనుగులా తయారైంది. మేం సంపాదించుకున్నదంతా దీనిని మేపేందుకే సరిపోతోంది. ఇక దీనిని భరించడం మా వల్ల కావడం లేదనే ..గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసేయాల్సి వచ్చిందంటూ రిషీ కపూర్ బాధాతప్త హృదయంతో తెలిపారు. మొత్తం మీద ఎన్నో చిరస్మరణీయమైన సినిమాలను..అవి సక్సెస్ అయ్యేందుకు దోహద పడుతూ వచ్చిన ఆర్కే స్టూడియో ఇవాళ కపూర్ ఫ్యామిలీ నుండి గోద్రెజ్ సంస్థకు దక్కడం ఓ రకంగా అదృష్టమనే చెప్పాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి