రిలయన్స్ సాయం - జియో మరింత బలం..!
ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా టెలికాం రంగాన్ని తనదైన పనితీరుతో షేక్ చేస్తున్న జియో కంపెనీని మరింత విస్తరించేందుకు, ఇతర ఏ టెలికాం రంగ కంపెనీ సైతం దరి దాపుల్లో రాకుండా వుండేందుకు రిలయన్స్ నడుం బిగించింది. ఈ మేరకు భారీగా పెట్టుబడి పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు లక్షలను దాటి కోట్లకు చేరుకుంది ..జియో కస్టమర్ల సంఖ్య. ఇపుడు ఈ కంపెనీ కన్ను ప్రత్యేకంగా ఈ కామర్స్, బ్రాడ్ బాండ్, 5జీ సర్వీసులపై పడింది. వీటిలో కూడా సంచనాలకు తెర లేపుతూ ..ఇండియన్, వరల్డ్ మార్కెట్‌లలోకి ప్రవేశించేందుకు పావులు కదుపుతోంది.
ఇంత పెద్ద ఎత్తున విస్తరించాలంటే భారీగా పెట్టుబడి కావాల్సి వస్తుంది. రిలయన్స్ జియో కంపెనీకి దాని పేరెంట్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొన్నేళ్లుగా కొనసాగుతోంది. భారీగా విస్తరించేందుకు హెవీ ఇన్వెస్ట్‌మెంట్ అవసరం పడుతుంది. రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లోకి రిలయన్స్ ఇండస్ట్రీ 20 వేల కోట్లకు పైగా క్యాపిటల్‌ను పెట్టుబడి రూపంలో పెట్టబోతోందని సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి. ఈ పెట్టుబడి డబ్బులన్నీ బ్రాడ్ బ్యాండ్, ఈ కామర్స్ బిజినెస్ తో పాటు 5జి సర్వీసెస్ లో నెంబర్ వన్ లో ఉండేందుకు ఖర్చు చేయనుంది జియో. ఇంత పెద్ద మొత్తంలో ఇస్తున్న పెట్టుబడి అంతా బ్యాండ్లలో , డిపాజిట్ల రూపంలో అనుకుంటే పొరపాటు పడినట్టే.
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ఏకంగా మొత్తం డబ్బులన్నంటిని నగదు ద్వారానే అందజేయనున్నట్లు తెలపడంతో మార్కెట్ వర్గాలు ఒక్క సారిగా షాక్‌కు గురయ్యాయి. అంతేకాకుండా రిలయన్స్ జియో దాని పేరెంట్ కంపెనీకి 400 కోట్ల నాన్ క్యూములేటివ్ ఆప్షనల్లీ కన్వర్టబుల్ ప్రిఫరెన్స్ షేర్లను జారీ చేయబోతుందని తెలిసింది. దీని వల్ల రిలయన్స్ జియో మరింత విస్తరించేందుకు ఉపయోగపడుతుంది. ఎన్‌సిఏసిపి షేర్లపై 9 శాతం మేర వడ్డీ రేటు చెల్లించేందుకు ఎంఓయు కూడా చేసేసుకుంది. ఇన్‌ఫ్రాక్ట్చ్రర్ అప్‌గ్రేడేషన్ స్థిరంగా కొనసాగడం, 5జీ విస్తరణతో టెలికాం రంగానికి మూలధన అవసరాలు అత్యధికంగానే ఉంటున్నాయని దేశీయ బ్రోకరేజ్‌కు చెందిన ఓ అనలిస్ట్ చెప్పారు.
ఇండియాలో కనీస సదుపాయాలు అందని ఇళ్లకి, ఎంటర్‌ప్రైజ్ కనెక్టివిటీ మార్కెట్‌ను చేరుకోవాలని ప్రస్తుతం జియో లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు.గిగాఫైబర్ ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌తో పాటు మొబిలిటీ సర్వీసులపై ఎక్కువగా ఫోకస్ చేసిందన్నారు. కాగా మూడేళ్ల కంటే తక్కువ వయస్సున్న రిలయన్స్ జియో 30.67 కోట్ల సబ్ స్క్రైబర్లను స్వంతం చేసుకుంది. ఈ ఏడాది 2019 మార్చి నెలాఖరు నాటికి రెవిన్యూ మార్కెట్ షేర్ ధర 31.7 శాతానికి పెరిగింది. వొడాఫోన్ ఐడియా మార్కెట్ షేరు ప్రస్తుతం 32.3 శాతంగా ఉండగా, ఎయిర్‌టెల్ రెవిన్యూ మార్కెట్ షేర్ 27.3 శాతంగా ఉంది. మొత్తం మీద రిలయన్స్ భారీ పెట్టుబడితో జియో మరో రికార్డుకు చేరువ కాబోతోందన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి