అద్దెదారుల‌కు పేమాట్రిక్స్ ఆలంబ‌న

ఈ దేశంలో స‌గానికి పైగా జ‌నానికి స్వంత స్థ‌లాలు..ఇళ్లు ...కాసులు లేవు. బ‌తుకు దెరువు దొర‌క‌ని ప‌రిస్థితి దాపురించింది. ఎక్క‌డికి వెళ్లినా అద్దె కొంప‌లే. ఇవి దొర‌కాలంటే మ‌ధ్య ద‌ళారీల‌ను ఆశ్ర‌యించాల్సిందే. స్థ‌లాలే కాదు పొలాల కొనుగోలు విష‌యంలో కూడా ఇదే . టెక్నాల‌జీ పెర‌గ‌డం..స్పీడ్ యుగం లో ఎవ‌రు ఎటు పోతున్నారో..ఏం చేస్తున్నారో తెలియ‌డం లేదు. అద్దెదారులు..కొనుగోలుదారుల‌కు మ‌ధ్య‌న వార‌ధిగా ఉంటే ఎలా వుంటుంద‌న్న ఆలోచ‌నలోంచి పుట్టిందే పేమ్యాట్రిక్స్ స్టార్ట‌ప్‌.
ఇల్లు అద్దెకు ఇవ్వ‌డంలో య‌జ‌మానులు..కిరాయికి తీసుకోవ‌డంలో టెనెంట్లు ప‌డే పాట్ల‌కు ఓ ప‌రిష్కారం చూపాల‌న్న‌దే వీరి ల‌క్ష్యం. ఆ ఐడియాకు ప్రాణం పోశారు. ఆన్‌లైన్‌లో ప్రాప‌ర్టీ రెంట్ మేనేజ్‌మెంట్ ఫ్టాట్‌ఫామ్ త‌యారు చేశారు. అదే కంపెనీగా రూపొందిన పేమాట్రిక్స్‌. దీనిని స్థాపించింది మ‌న తెలంగాణ కుర్రాళ్లే.
వీరి ఐడియాకు మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష డాల‌ర్లు ఈ కంపెనీకి స‌మ‌కూరాయి. బిజినెస్ విస్త‌రించేందుకు ఇంకా 7 కోట్లు కావాల్సి ఉంటుంది. వాటిని సేక‌రించేందుకు దృష్టి పెట్టారు..దీని వ్య‌వ‌స్థాప‌కులు..2017లో టీ హ‌బ్ స్టార్ట‌ప్ కొన్ని నిధులు స‌మ‌కూర్చింది. బిట్స్‌కు చెందిన ముఖేష్ చంద్ర అంచూరి, ముర‌ళీధ‌ర్ నాయ‌క్‌లకు వ‌చ్చిన ఐడియానే ఇది రూపొందేందుకు దోహ‌ద‌ప‌డేలా చేసింది.
2016లో పేమాట్రిక్స్‌ను ప్రారంభించారు. అద్దెదారుల‌కు, ఇంటి ఓన‌ర్ల‌కు ..ప్రాప‌ర్టీ మేనేజ‌ర్ల‌కు..ఆస్తుల‌కు సంబంధించిన అద్దె నిర్వ‌హ‌ణ సంస్థ సేవ‌ల‌ను అంద‌జేస్తుంది.
దీంతో పాటు డిజిట‌ల్ రెంట్ డాక్యుమెంటేష‌న్‌, ఈఎంఐ ఫ్రీ డిపాజిట్ లోన్స్‌, టెనెంట్ స్క్రీనిం గ్ స‌ర్వీసెస్‌, అద్దెల‌కు సంబంధించిన బీమా స‌దుపాయం వంటి సేవ‌లు దీని ద్వారా అందుతాయి. నియ‌మ నిబంధ‌న‌ల మేర‌కు డాక్యుమెంటేష‌న్ పూర్తి చేస్తే చాలు ..రెంట‌ల్ అగ్రిమెంట్ ను త‌యారు చేసి ఇంటి వ‌ద్ద‌కే వ‌చ్చి అంద‌జేస్తారు.
కిరాయికి ముందు చెల్లించే డిపాజిట్ కోసం ఈఎంఐ ప‌ద్ద‌తిలో ఉచితంగా సేవ‌లు అంద‌జేస్తోంది పేమాట్రిక్స్‌. ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు అంటూ ఉండ‌దు. నెల నెలా వ‌డ్డీ చెల్లించి ఇల్లు ఖాళీ చేసేట‌ప్పుడు చెల్లిస్తే స‌రిపోతుంది. క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లించే వెసులుబాటును క‌ల్పిస్తుందీ ఈ కంపెనీ. అద్దెపై రాయితీలు కూడా పొందే వీలుంది. టెనెంట్ స్క్రీనింగ్ ద్వారా కిరాయి తీసుకునే వ్య‌క్తుల పూర్తి స‌మాచారాన్ని సేక‌రిస్తారు.
ఆధార్ కార్డుతో పాటు సివిల్ స్కోర్‌, సోష‌ల్ నెట్ వ‌ర్క్‌కు సంబంధించిన స‌మాచారాన్ని కూడా పొందుప‌రుస్తారు. రెంట‌ల్స్‌కు..లాండ్ లార్డ్స్‌కు రిస్క్ త‌గ్గించేందుకు పే మ్యాట్రిక్స్ సాయం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఈ కంపెనీ విస్త‌రించింది. విస్తృతంగా సేవ‌లు అందిస్తోంది.. 13000 వేల మంది టెనెంట్స్‌, భూ య‌జ‌మానులు దీనిలో రిజిస్ట‌ర్ చేసుకున్నారు. 24 కోట్ల రెంట‌ల్ ట్రాన్సాక్ష‌న్ ట‌ర్నోవ‌ర్ సాధించ‌డం స్టార్ట‌ప్ కంపెనీల‌ను విస్మ‌యానికి గురి చేసింది.

కామెంట్‌లు