విశిష్ట సేవలందిస్తున్న ఏపీ యాప్
టెక్నాలజీ పుణ్యమా అంటూ లెక్కలేనన్ని సేవలు ఉచితంగానే అందుతున్నాయి. మరికొన్ని కొద్దిపాటి రుసుముతో జనానికి అందుబాటులో ఉంటున్నాయి. ఇన్మర్మేషన్ టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. యువతీ యువకులు తమ కలల్ని నిజం చేసుకునేందుకు మెదళ్లకు పరీక్ష పెడుతున్నారు. ఊహించని రీతిలో సక్సెస్ స్వంతం చేసుకుంటున్నారు. దీనిని గుర్తించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఐటీ సెక్టార్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేశారు. సింగపూర్ తరహా లో ఏపీని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ప్రతి కొత్త మార్పును ఆయన స్వాగతిస్తున్నారు. ఐటీ శాఖ బాధ్యతలు చూస్తున్న నారా లోకేష్ అనుభవం కలిగిన వారిని తన వింగ్‌లో చేర్చుకున్నారు. ఎక్కడ కొత్తదనం కనిపించినా..ఐడియాస్ ఉన్నా ఫండింగ్ సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి గ్రామాన్ని డిజిటలైజేషన్ చేయాలన్నది ఆయన కల. దానినే తన విజన్‌గా పేర్కొంటూ ముందుకు సాగుతున్నారు.
డిజిటల్ టెక్నాలజీకి ప్రయారిటీ ఇస్తూ ..పౌరులకు క్షణాల్లోనే సేవలు అందించాలన్న ఉద్ధేశంతో ఏపీ ఈ గవర్నెనెన్స్ ప్రత్యేకంగా యాప్‌ను తయారు చేసింది. దీని ద్వారా కనీస సౌకర్యాలన్నీ అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఈ యాప్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మొదటి డిజిటలైజేషన్ గ్రామంగా ఏపీ దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మధ్య దళారీల బెడద వుండదు. పూర్తి పారదర్శకత ఉంటుంది. పుర మరియు ఉద్యోగస్తుల కోసం తయారు చేసిన ఈ యాప్‌కు పుర సేవా కేంద్రం అని పేరు పెట్టారు. పౌరులకు, ఉద్యోగులకు ఏం కావాలో ఇందులో ఉంటుంది. దీని వల్ల టైం వేస్ట్ కావడం అంటూ ఉండదు. ఏపీలో మున్సిపల్ అడ్మిస్ట్రేషన్ డైరెక్టర్‌గా ఉన్న కన్నబాబు కృషి వుంది .
పురసేవా కేంద్రంకు వెళ్లి తమకు కావాల్సిన దాని కోసం ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు దారుడికి నేరుగా మెస్సేజ్ వస్తుంది. దానికో నెంబర్..ఎప్పుడు పూర్తవుతుందో కూడా అందులోనే పేర్కొంటారు. ఎవరి దగ్గర, ఏ శాఖ వద్ద, ఏ అధికారి వద్ద తమ అభ్యర్థన ఉందో తెలిసి పోతుంది. టెక్నాలజీ ద్వారా మరింత వెసలుబాటు కలుగుతుంది. పౌరసేవలన్నీ ఈ కేంద్రం ద్వారా లభించేలా చేశారు. ఇంటి పర్మిషన్, నల్లా బిల్లు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, స్కాలర్ షిప్‌లు, ఇండ్ల దరఖాస్తులు, భూముల రిజిస్ట్రేషన్లు, రైతుల పాసు పుస్తకాలు, గ్యాస్, గ్రామపంచాయతీలు, పట్టణాల సమగ్ర సమాచారం అంతా ఈ యాప్‌లో పొందుపరిచారు. ప్రపంచం టెక్నాలజీ పరంగా ముందుకెళుతోంది. ప్రతి రంగంలోను దీని వాడకం పెరుగుతోంది. ఇది గమనించే ప్రభుత్వం ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వాటిల్లకుండా ఉండేందుకు పుర సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దీని వల్ల ప్రజలకు ..సర్కార్‌కు మధ్య వారధి ఏర్పడుతోంది అంటారు కన్నబాబు.
నిరంతరం అభివృద్ధి జపం చేసే ఏపీ సీఎం చంద్రబాబు కలలను ఏపీ ఐటీ విభాగం సాకారం చేసేందుకు అహర్నిశలు కృషి చేస్తోంది. ఆ దిశగా అడుగులు వేస్తే..మరిన్ని ఫలాలు ప్రజలకు అందే అవకాశం ఉంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి