జీ సుభాష్ చంద్ర న్యూ జర్నీ
బియ్యం వ్యాపారాన్ని మొదలు పెట్టి..ఆసియా ఖండంలో బిగ్గెస్ట్ మీడియా మొఘల్‌గా విజయం సాధించిన జీ గ్రూపు సంస్థ ఎస్సెల్ మరో కొత్త రంగంలోకి ఎంటరైంది. ఇప్పటికే 39 న్యూస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో తనకంటూ పదిలమైన స్థానాన్ని సంపాదించుకుంది జీ గ్రూపు. అన్ని కంపెనీలు, సంస్థలు వారానికి ఆరు రోజుల పనిదినాలుంటే ..జీ గ్రూపులో మాత్రం కేవలం అయిదు రోజులు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. పని చేసే వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి..వారిలో క్రియేటివిటీని ప్రోత్సహించే అలవాటు సుభాష్ చంద్రది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ పరంగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ..స్టాక్ మార్కెట్ కుదుపులకు లోనైనా జీ గ్రూప్ మాత్రం స్టేబుల్‌గా ఉండేలా ఎప్పటికప్పుడు ప్లాన్స్ రూపొందించడంలో జీ యాజమాన్యం సక్సెస్ అయింది. ఇలా వుండడం వెనుక ఛైర్మన్ సుభాష్ చంద్ర కృషి ఉన్నదనేది వాస్తవం.
మీడియా , ఎంటర్ టైన్ మెంట్ రంగాల్లోనే కాకుండా ఇప్పటికే అమ్యూజ్‌మెంట్ పార్కుల రంగంలో ఎస్సెల్ గ్రూపు సక్సెస్ ఫుల్‌గా రన్ చేస్తోంది. తక్కువ పెట్టుబడి..ఎక్కువ రాబడి..వర్కర్స్, సిబ్బందికి స్వేచ్ఛ. ప్రసారాల్లో భిన్నమైన ప్రోగ్రామ్స్ రూపొందించడం, జనం ఆలోచనలకు తగ్గట్టు ఉండడంతో జీ తన బ్రాండ్‌ను నమ్మకమైనదిగా పేరు సంపాదించుకుంది. ఇవాళ క్రికెట్ లో టీ -20 మ్యాచ్‌లకు ఆద్యుడు జీ సుభాష్ చంద్రనే చెప్పవచ్చు. మార్కెట్‌లో ఏది కొత్తది కనిపించినా ఆయన దానిపై దృష్టి పెడతారు. ఇదీ ఆయనకున్న స్పెషాలిటీ. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో బ్యాటరీలతో నడిచే వాటికి డిమాండ్ ఉంటోంది. గ్యాస్, బ్యాటరీ రీఛార్జ్ ఫిల్లింగ్ స్టేషన్లు దేశమంతటా విస్తరిస్తున్నాయి. ఇందు కోసం ఎలాంటి పర్యావరణ ముప్పు ఏర్పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ మీడియా మొఘల్ ఎలక్ట్రిక్ కార్లకు అవసరమయ్యే బ్యాటరీ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు సమాచారం. ఇందు కోసం ఏపీలో ఓ ప్లాంటును నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. బ్యాటరీల తయారీకి ఉపయోగించే లిథియం కోసం విదేశాల్లో గనులు కొనేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ప్రత్యేకంగా వీటి కోసం ఎస్సెల్ గ్రీన్ మొబిలిటీ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశారు. ఈ వాహన రంగంలో పూర్తి స్థాయిలో సేవలు అందించేందుకు సుభాష్ చంద్ర కృషి చేస్తున్నారు. ఇప్పటికే నిధుల సమీకరణపై దృష్టి పెట్టారు. ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా 250 ఎలక్ట్రిక్ ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ల నిర్మాణానికి 250 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఈ వాహనాలకు ప్రభుత్వం తరపు నుండి భారీ మద్దతు, ప్రోత్సహకాలు ఉంటాయని ఆ దిశగా సుభాష్ ప్రయత్నాలు ప్రారంభించారు.
బ్యాటరీలు తయారు చేయడంతో పాటు ఎలక్ట్రిక్ ఆటోలను కూడా అద్దెకు ఇచ్చే వ్యాపారంలోకి ఎస్సెల్ ఎంటరైంది. పంజాబ్ నగరంలో మొహాలీలో రెంటల్ సెంటర్ ఏర్పాటు చేశారు. రిక్షాకు నెలకు 299 రూపాయలు, ఫుల్లీ ఛార్జ్‌డ్ బ్యాటరీలకు 99 చెల్లించాలి. ప్రస్తుతం 100 రిక్షాలను రెంట్‌కు ఇచ్చింది ఎస్సెల్ సంస్థ. ఈ బియ్యం వ్యాపారి పట్టిందల్లా బంగారమే. చాలా మంది వ్యాపారులు నష్టాల జోలికి వెళ్లరు. కానీ జీ సుభాష్ చంద్ర సమస్యలున్న వాటినే ఎంచుకుంటారు. వాటిని అధిగమించి సక్సెస్ సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. బ్యాటరీ తయారీల రంగంలో మనోడు ముందంజలో ఉండడం ఖాయం అన్నది మార్కెట్ వర్గాల అంచనా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి