ఐటీలో దూసుకెళుతున్న సైబర్ ఐ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం అన్ని రంగాలను దాటి ముందంజలో ఉంది. టెలికాం, ఐటీ, ఆయిల్, మైన్స్, మీడియా, డిజిటల్ టెక్నాలజీ ఏది ఏమైనా ..ఏ రంగమైనా సరే అన్నీ సైబర్ సెక్యూరిటీ మీద ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొన్నది. సైబర్ సెక్యూరిటీ అన్నది రక్షణాత్మక, ఆయుధ రంగాల్లో కీలకమైన పాత్ర పోషిస్తోంది. ప్రజలకు విశిష్ట సేవలందిస్తున్న బ్యాంకింగ్ వ్యవస్థకు ఈ టెక్నాలజీ కీలక ఆధారం. సైబర్ సెక్యూరిటీ అన్నది లేకపోతే కోట్లాది మందికి జీవితాన్ని ప్రసాదిస్తూ..డాలర్లు కురిపిస్తున్న కంపెనీలు కూలి పోతాయి.
అంతగా భాగమై పోయింది ఈ వ్యవస్థ. ట్రిలియన్ డాలర్ల బిజినెస్ సాధిస్తున్న కంపెనీలన్నీ సైబర్ సెక్యూరిటీని వాడుతున్నాయి. ఈ రంగంలో ఇండియాకు చెందిన సైబర్ ఐ ఐటీ కంపెనీ ఆసియా ఖండంలోనే టాప్ వన్ కంపెనీగా పేరు సాధించింది. వివిధ రంగాలకు చెందిన కంపెనీలన్నింటికి సేవలందిస్తోంది సైబర్ ఐ.
ఎథికల్ హ్యాకింగ్, మేకర్స్, సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కు వరల్డ్ వైడ్‌గా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోట్లల్లో జీతాలను ఆఫర్ చేస్తున్నాయి కంపెనీలు. ఈ రంగంలో సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్ ఇంజనీర్లు సైబర్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా..ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ప్రపంచంలో పేరెన్నికగన్న లార్వాన్ కంపెనీతో సైబర్ ఐ కంపెనీ ఎంఓయు కుదుర్చుకుంది. 2016లో అత్యధికంగా ఇండియాలో సైబర్ సెక్యూరిటీ కన్సల్టెంట్స్ గా తీర్చిదిద్దింది.
నాస్కాంతో పాటు డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సైబర్ ఐ మెంబర్ కంపెనీగా ఉంది. 2500 మంది ప్రొఫెషనల్స్, సైంటిస్టులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సెక్యూరిటీ వింగ్‌లో నిపుణులు, ఉద్యోగులకు సైబర్ సెక్యూరిటీ అంశంపై విస్తృతంగా శిక్షణ ఇచ్చారు. ప్రొఫెసర్స్, స్టూడెంట్స్‌కు ట్రైనింగ్ ప్రొవైడ్ చేశారు.
సైబర్ ఐ కంపెనీ వెనుక పలువురి శ్రమ దాగుంది. డిఆర్‌డిఓ కంపెనీలో మాజీ ఉద్యోగి అయిన రామ్ ఈ ఐటీ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. హైదరాబాద్ ఐఐఐటీ లో చదువుకుని అమెజాన్‌లో మాజీ ఉద్యోగి అయిన రాహుల్ ఈ కంపెనీకి కో ఫౌండర్‌గా ఉండగా, ఐఐటీ మద్రాస్‌లో చదువుకుని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా ఉన్న తరుణ్ డైరెక్టర్‌గా , త్రిబుల్ ఐటీ హైదరాబాద్‌లో చదువుకున్న అవినాష్, శేషసాయిలు డైరెక్టర్లుగా ఈ కంపెనీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
సైబర్ ఐ టెక్నాలజీ కంపెనీ స్మార్ట్ అండ్ సెక్యూర్ వరల్డ్ టాగ్ లైన్‌తో నడుస్తోంది. బిలియన్ల వ్యాపారం చేస్తోంది. హ్యాకింగ్ కు పాల్పడకుండా ఉండేలా చర్యలు చేపడుతోంది. డిఆర్‌డిఓ తెలంగాణ ప్రభుత్వం, యుపీ సర్కార్, డీఎస్‌సీఎల్, ఎస్ ఎస్‌సీ నాస్కాం, తెలంగాణ స్టేట్ పోలీస్, హిమాచల్ ప్రదేశ్ పోలీస్, ఇఐ నాస్కాం, సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ ఇజ్రాయిల్, యుకెలోని సైబర్ కంపెనీస్ లిమిటెడ్ , లోరాతో అలయెన్స్, స్పెషల్ ఇంటరెస్ట్ గ్రూప్‌తో పాటు ఐబీ హబ్స్‌కు సైబర్ సెక్యూరిటీ విషయంలో టెక్నాలజీని అందిస్తోంది సైబర్ ఐ. సైబర్ సెక్యూరిటీ లో మంచి పట్టు సాధిస్తే కోట్ల రూపాయల వేతనాలు అందుకునే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి