దివ్య సాకేతం ..భక్తుల స్వర్గ ధామం..!
నిర్మలమైన గాలి ..కల్మషం లేని మనుషుల గుంపు. వేదమంత్రాల స్వరాలు..లోకాన్ని ద్విగుణీకృతం చేసే విశాలమైన ప్రదేశం ..వేలాదిగా తరలి వచ్చే భక్తుల సమూహం. అటు ఇటు అంతటా తమదేనంటూ స్వామిజీ స్మరణ చేసుకుంటూ తిరుగాడే సర్వం వదిలేసిన చిన్నారులు ..సన్యాసులు ..పక్కనే గోవులు ..లేగ దూడల చప్పుళ్ళు..మధ్యలో దైవాంశ కలిగిన కలియుగంలో వెలసిన మానవతా మూర్తి ..యోగి ..అన్నీ తెలిసిన ఆచార్యుడు శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామిజీ గొంతుక మనల్ని అమ్మలా పలకరిస్తుంది. నాన్నలా మాధుర్యం నిండిన ఆ స్వరం నీడలా వెంటాడుతుంది.
ఇదంతా ఏడో నంబర్ జాతీయ రహదారి పక్కనే ఉన్న ముచ్చింతల్ గ్రామం లోని దివ్య సాకేతం ఎందరికో దిశా నిర్దేశనం చేస్తోంది . ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఈ క్షేత్రం ఓ రికార్డ్ స్వంతం చేసుకోబోతోంది. శ్రీరామానుజ చార్యుల భారీ అంటే 216 అడుగుల విగ్రహం ఇక్కడ ఏర్పాటు కాబోతోంది . ఎక్కడా ఇలాంటి భారీ విగ్రహం ఏర్పాటు కాలేదు . వెయ్యేళ్ళు పూర్తయినా నీటికీ రామానుజ జీవితం స్ఫూర్తి కలిగిస్తూనే ఉన్నది . ఈ విషయాన్ని స్వతహాగా మన ప్రధాని మోడీ ఇటీవల జరిగిన జయంతి ఉత్సవాల సందర్బంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు . ఇదీ ఆ ఆచార్యుడికి ఉన్న ప్రత్యేకత .. విశిష్టత. ఇదో మహత్తరమైన యజ్ఞమనే చెప్పాలి . ఎంతో కష్టంతో కూడుకున్న పని . కోట్లాది రూపాయల ఖర్చు . అయినా స్వామిజీ రేపటి తరాలకు గుర్తుగా .. సంకేతంగా .. స్ఫూర్తి కలిగించేలా ఉండేందుకు రామానుజుడి రూపం భద్రంగా ఉండేలా తీర్చి సిద్ధేందుకు సంకల్పించారు . అదే స్పూర్తితో ఎందరికో ఆయన చేసిన సమాజ సేవ గురించి ప్రభోదించారు . ఎన్ని దేశాలు తిరిగినా ..ఏ ప్రాంతం సందర్శించిన చైనా జీయర్ స్వాములు మాత్రం ఆయన స్మరణతోనే సాగుతున్నారు .
దేశం ..ప్రపంచం లోని భక్త జనం అంతా దివ్య సాకేతం వైపు చూస్తోంది . వేలాది మంది కార్మికులు ..ఎందరో సహాయ సహకారాలు ..స్వామిజీ సంకల్పం తో ఇప్పుడు దివ్య సంకేత క్షేత్రం ..ఆశ్రమం ..దేదీప్య మానంగా వెలుగొందుతోంది . ప్రతి ఉదయం కొత్తగా అగుపిస్తుంది . ప్రతి సాయంత్రం మనల్ని మనుషులయ్యేలా చేస్తుంది . రాత్రి అయితే చాలు మనలోని నిర్లిప్తత మాయమై పోతుంది. ఇదంతా కల కాదు . ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే వాస్తవం . వస్తువుల మాయలో పడి లైఫ్ లోని మాధుర్యాన్ని కోల్పోయిన వారంతా దివ్య సాకేతంలోకి వచ్చాక మాములు వ్యక్తుల్లా మారిపోతారు . అహాన్ని వదిలేసుకుని తోటి వారిని పలకరిస్తూ ..ఇంకొకరికి సాయ పడుతూ సేవకులై పోతారు . ఇదంతా స్వామిజీ మహిమ . ఆయన దగ్గర మాయమంత్రాలు లేనే లేవు ..ఉన్నదంతా మనుషుల్ని ప్రేమించడమే . దైవం పట్ల ఎరుక కలిగి వుంటే చాలు ఇక ప్రయాణం సాఫీగా సాగుతుందంటారు స్వామిజీ .
జీవితంలో మీరు ఎన్నో చూసి ఉంటారు ..ఇంకెన్నో ప్రదేశాలు తిరిగి ఉంటారు . కానీ ఒక్కసారి దివ్య సాంకేతాన్ని దర్శించండి చాలు . మీలో ఎక్కడో దాగి ఉన్న మానవత్వం మళ్ళీ పురుడు పోసుకుంటుంది . మీలోని అమ్మతనం తోటి వారి పట్ల ప్రేమను పంచేలా చేస్తుంది . మీలో సేవ చేయాలన్న సంకల్పం మొదలవుతుంది . అదంతా స్వామిజీ చల్లని చూపుల మహిమ . ఆయన ఆశీస్సులు మీలో అంతులేని నమ్మకాన్ని ..మెరుగైన ఆత్మ విశ్వాసాన్ని కలిగిస్తాయి . సర్వసంగ పరిత్యాగిగా ..యోగిగా ..గురువుగా ..ఆచార్యుడిగా ..సన్యాసిగా ..ఎన్నో రూపాల్లో అగుపిస్తున్న ఆ నడిచే నారాయణుడి తో మీరూ ప్రయాణం చేయండి . పోతే పోయేది ఏముంది ఒక్క సంకల్పం తప్ప ..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి