అపురూపం అమ్మ విజయం
ఎవరూ ఊహించని రీతిలో ఆమె అపురూపమైన..చిరస్మరణీయమైన విజయాన్ని అందించారు. బంగారు పతకాన్ని అందుకుని భారత జాతి యావత్తు ప్రపంచంలో తలెత్తుకునేలా చేశారు మణిపూర్ రాష్ట్రానికి చెందిన బాక్సర్ మేరీ కోమ్. మహిళలు తల దించుకునేలా ఆమె మహిళగా చరిత్రలో నిలిచిపోయే గెలుపును స్వంతం చేసుకున్నారు. నిరాదరణకు గురై..లైంగిక వేధింపులకు లోనై..తీవ్ర వివక్షకు బలై పోతున్న మహిళలకు ఆమె ఇపుడు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఆమె జీవితం సందేశం కాదు..ఓ పుస్తకం. అందరూ తన పనై పోయిందని అనుకున్న తరుణంలో బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో మరో స్వర్ణం సాధించి ఆశ్చర్య పోయేలా చేసింది. ప్రత్యర్థి ఉక్రెయిన్ క్రీడాకారిణిని 5-0 తేడాతో ఓడించి తనలో ఏమాత్రం పవర్ తగ్గలేదని లోకానికి చాటి చెప్పింది.
మేరీ కోమ్ అసలు పేరు మాంగ్లే చుంగ్నీ జంగ్ . ఇద్దరు పిల్లలకు తల్లి. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా పలు స్వర్ణాలను సాధించింది. రెండేళ్ల విరామం అనంతరం ఢిల్లీలో జరిగిన ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొంది. 2008లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఏఐబీఏ మేరీకోమ్‌ను దేదీప్యమానమైన గెలుపుగా అభివర్ణించింది. మణిపూర్‌కు చెందిన బాక్సర్‌ఱ డింగ్ కోసింగ్‌ను చూసి స్ఫూర్తి పొందారు. 2010లో బ్రిడ్జిటౌన్‌లో ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ బిరుదు స్వీకరించారు. రొమేనియన్ ప్రత్యర్థి డుటూ సెలూటాను ఓడించారు. నిర్వహించిన ఆరు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో ప్రతి ఒక్కటిలో పతకం గెలిచిన ఒకే ఒక్క బాక్సర్ గా మేరీ కోమ్ చరిత్ర సృష్టించారు.
2000 సంవత్సరంలో బాక్సింగ్‌పై పట్టు సాధించేందుకు మరింత పదును పెట్టారు. స్టేట్ ఛాంపియన్ షిప్‌ను గెలిచాక ఆమె గురించి వార్తాపత్రికలో ఫోటో అచ్చు కావడంతో అంతా ఆమె గురించి వాకబు చేశారు. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఏడో ఈస్ట్ ఇండియా ఉమెన్స్ బాక్సింగ్ పోటీల్లో గెలుపొందారు. 2005 వరకు జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో బంగారు పతకాలను పొందారు. ఇంటర్నేషనల్ స్థాయిలలో నిర్వహించిన పోటీల్లో టాలెంట్ ప్రదర్శించి మేరీ కోమ్.
2003లో జరిగిన పోటీల్లో చైనా, శ్రీలంకలకు చెందిన బాక్సర్లను ఆమె ఓడించారు. అంతకు ముందు అమెరికాలో జరిగిన ఏఐబీఏ వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ పోటీల్లో వెండి పతకంతో సంతృప్తి చెందాల్సి ఉంది. 48 కిలోల విభాగంలో పోలాండ్, కెనాడాలకు చెందిన వారిని ఓడించినా ఫైనల్‌లో టర్కీకి చెందిన సాహిన్ చేతిలో ఓటమిపాలైంది. ఆమె సాధించిన విజయాలకు గాను కేంద్ర సర్కార్ మేరీకోమ్‌కు అర్జున అవార్డును అందజేసింది. 2004లో ఏప్రిల్ నుండి మే 2 వరకు నార్వేలో జరిగిన మహిళా ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో చైనాకు చెందిన లీను ఓడించి బంగారు పతకాన్ని సాధించారు. అదే ఏడాదిలో హంగేరీలో జరిగిన విచ్ కప్ టోర్నమెంట్ ఛాంపియన్‌గా నిలిచారు. తైవాన్‌లో జరిగిన పోటీల్లో ఫిలిప్పీన్స్‌కు చెందిన అబనీల్‌ను ఓడించి ఔరా అనిపించారు.
రష్యాలో 2005 అక్టోబర్‌లో నిర్వహించిన మూడో ఏఐబీఏ ఉమెన్స్ వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌ను పొందారు. రష్యన్ల మనసు దోచుకున్నారు మేరీ. 2006లో డెన్మార్క్‌లో జరిగిన పోటీల్లో కోమ్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. నవంబర్ నెలలో ఢిల్లీలో జరిగిన బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలో గెలుపొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విజయాలు ఆమె అమ్ముల పొదిలో ఉన్నాయి. తన లాంటి వారిని తయారు చేసేందుకు ఆమె స్వంతంగా తన పేరుతో మేరీకోమ్ బాక్సింగ్ అకాడెమీని స్థాపించారు.
2006లో పద్మశ్రీ పురస్కారం దక్కించుకున్నారు. 2007లో రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న, పీపుల్స్ ఆఫ్ ది ఇయర్ - లిమ్కా బుక్ ఆఫ్ రికార్బ్ష్ , సీఎన్ ఎన్ - ఐబీఎన్ రియల్ హీరోస్ పురస్కారం 2008లో పొందారు. ఇదే ఏడాదిలో పెప్సీ ఎంటీవీ యూత్ ఐకాన్ పురస్కారం అందుకున్నారు. 2008లో ఏఐబీఏ మాగ్నిఫిషింట్ మేరీ, న్యూ లంకా వైపీఏ వద్ద జోమీ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అభినందన. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ అంబాసిడర్ ఫర్ ఉమెన్ బాక్సింగ్‌గా ఎంపికయ్యారు.
మేరీ కోమ్ అందించిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఇండియాలో ఎంతో వెనుకబడిన ప్రాంతంగా పేరున్న మణిపూర్ లాంటి చిన్న రాష్ట్రం నుండి ..ప్రపంచం మెచ్చుకునే విధంగా తనను తాను మల్చుకున్న మేరీ కోమ్ గురించి ఎంత రాసినా..ఎంత చెప్పినా తక్కువే. అందరూ ఇక ఆమె పనై పోయిందంటూ కామెంట్స్ చేస్తున్న సమయంలో తనలో సత్తా ఉందని మరోసారి నిరూపించారు. దేశ రాజధాని సాక్షిగా పసిడి పతకాన్ని ముద్దాడారు. పని చేయాలంటే నామోషీగా భావించే మహిళలున్న ఈ తరుణంలో ..మేరీ కోమ్ తల్లిగా సాధించిన ఈ విజయం అపురూపమైనది..కాదనడానికి మనమెవ్వరం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి