ఐడియా వుంటే చాలు ఆదుకుంటాం



మీకు ఓ ఐడియా వుంటే చాలు ఎంచ‌క్కా స్టార్ట‌ప్ సంస్థ‌ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. ఫండింగ్ గురించి ..మెంటార్ గురించి..ట్రైనింగ్ గురించి బెంగ ప‌డాల్సిన ప‌నిలేదు. అన్నింటిని ప్రొవైడ్ చేస్తోంది ఐబీహ‌బ్స్‌. వారి కార్యాల‌య మెట్లు ఎక్కితే చాలు..వ్యాపారంలో ఓన‌మాలు నేర్పిస్తారు. మిమ్మ‌ల్ని బెస్ట్ ఆంట్ర‌ప్రెన్యూర్స్‌గా మార్చేస్తారు. కావాల్సింద‌ల్లా స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ..స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ఏ అంశంపైనా ఆలోచ‌న వుంటే దానిని ఆచ‌ర‌ణ‌లోకి తీసుకు వ‌చ్చేందుకు సిద్ధంగా వున్నామ‌ని ఐబీ బాధ్యులు.
వ్యాపారం చేయ‌డం అంటే లాభాల‌ను ఆర్జించ‌డం కాదు. కొత్త‌గా ఆలోచించ‌డం. మార్కెట్ పోక‌డ‌ను అర్థం చేసుకోవ‌డం. భిన్నంగా వెళ్ల‌డం. ప‌ది మందికి ఉపాధి చూపించేలా చేయ‌డం. అన్ని ఐడియాలు ఒకేలాగా ఉంటాయి. మ‌రికొన్ని ఇబ్బందిక‌రంగా ప‌రిణ‌మిస్తాయి. వెన‌క్కి చూడాల్సిన ప‌నిలేదు. ఆలోచ‌న‌ల‌కు ఓ రూపం తీసుకు వ‌చ్చేలా చూడాల్సిన బాధ్య‌త మాదే అంటారు.
వీళ్లు వాళ్లు అని కాదు మంచి ఐడియాతో వ‌స్తే చాలు ఎవ్వ‌రికైనా తోడ్పాటు అందించేందుకు సిద్దంగా ఉన్నామ‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. నెట్‌వ‌ర్కింగ్‌, ప‌రిశోధ‌న‌, బ్రాండింగ్ మెంటారింగ్, న్యాయ స‌ల‌హా, నిధుల సేక‌ర‌ణ‌, మార్కెటింగ్‌తో పాటు బిజినెస్ స్టార్ట్ చేసేందుకు స్థ‌లం కూడా చూపిస్తోంది ఈ సంస్థ‌.
మార్కెట్‌లో విప‌రీత‌మైన పోటీ నెల‌కొని వుంది. మిగ‌తా వారిని త‌ట్టుకుని ముందుకు వెళ్లాలంటే డిఫ‌రెంట్‌గా ఆలోచించాలి. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వ‌ర‌కు ప్ర‌తిదీ ద‌గ్గ‌రుండి చూసుకుంటారు. ఆర్థిక లాభంగా ఉండాల‌ని లేదు..సామాజిక ప్ర‌యోజ‌నం వుంటే చాలు. బ‌లమైన న‌మ్మ‌కం క‌లిగి ఉండి వ‌స్తే ..ద‌గ్గ‌రుండి నేర్పిస్తాం..నిల‌బ‌డేలా చేస్తామంటోంది ఐబీ హ‌బ్స్‌.
ఎవ‌రికైనా చ‌క్క‌టి ఆలోచ‌న వ‌స్తే ..నేరుగా క‌ల‌వాల్సిన ప‌నిలేదు..జ‌స్ట్ మీ డిటైల్స్‌తో ఐబీహ‌బ్స్‌.కో లింక్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే చాలు. ఐబీ టీం మెంబ‌ర్స్ ప‌రిశీలిస్తారు. ఐడియా క్రియేట్ చేసిన వారితో నేరుగా మాట్లాడ‌తారు. మీతో పాటే ఐడియాను అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. ఆచ‌ర‌ణాత్మ‌కంగా ఉండేలా తీర్చిదిద్దుతారు.
బిజినెస్ టైకూన్స్ లేరు ఇందులో..ఈ ఐబీ హ‌బ్స్‌లో అంతా యంగ్ ట‌ర్క్స్‌. లేలేత యువ‌తీ యువ‌కులు. క‌సితో..డిఫ‌రెంట్ ఐడియాస్‌తో ర‌గిలిపోతున్న వారు స‌భ్యులుగా ఉన్నారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఎన్ ఐటీ, ఐఐఎం అన్నీ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన సంస్థ‌లే. ఇందులో చ‌దువుకున్న స్టూడెంట్సే ఐబీ హ‌బ్స్‌కు మూలం. పూర్వ విద్యార్థులంతా క‌లిసి ఓ బృందంగా ఏర్ప‌డ్డారు.
వీరంతా వేర్వేరు ప్రాంతాల‌కు చెందిన వాళ్లు. వీళ్ల ఆశ‌యం..ల‌క్ష్యం ఒక్క‌టే తోచినంత సాయం చేయ‌డం. మార్కెట్‌లో విజేతలుగా త‌యారు చేయ‌డం వీరి గ‌మ్యం. 200 మందికి పైగా టాలెంట్ క‌లిగి ఉన్నవారు ఉన్నారు. వేర్వేరు బృందాలుగా ఏర్పాటై..డిఫ‌రెంట్ ఐడియాస్‌ను ఐడెంటిఫై చేస్తూ స‌హ‌క‌రిస్తున్నారు.
సైబ‌ర్ సెక్యూరిటీ కోసం ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌ని చేస్తున్నారు..ఇందులోని స‌భ్యులు. 20 మందితో క‌లిసి ఐబీహ‌బ్స్‌. కో పేరుతో ఏర్పాటు చేశారు. ఇది హైద‌రాబాద్ కాకుండా ఢిల్లీ, ల‌ఖ్నో, ముంబ‌యి, బెంగ‌ళూరుల‌లో నోడ‌ల్ ఏజెన్సీలు ఉన్నాయి. మ‌రో 30 చోట్ల సెంట‌ర్లు ఏర్పాటు చేశారు.స్టార్ట‌ప్ ను స‌క్సెస్ చేయ‌డం..
వారికి ఆదాయం వ‌చ్చాక కొంత ఈక్విటీ రూపంలో తీసుకుంటారు. ఇదే ఐడియా వేలాది మందిని ఆలోచించేలా చేస్తోంది. సో ...మీకూ ఐడియా వ‌స్తే..ఉంటే ఐబీ హ‌బ్స్ టీంను సంప్ర‌దించండి. మంచి వ్యాపార వేత్త‌లుగా త‌యారు కండి.. ప‌ది మందికి ఆస‌రా ఇవ్వండి.

కామెంట్‌లు