కానిస్టిట్యూషన్ తయారీలో మహిళలే కీలకం
ప్రపంచంలో భారత రాజ్యాంగానికి విశిష్టమైన గుర్తింపు ఉన్నది. కానిస్టిట్యూషన్ తయారీలో ఎందరో పాలు పంచుకున్నారు. ఈ దేశం భవిష్యతు..జాతి జీవనాదం ఇందులో ఇమిడి ఉంటుంది. ప్రతి దేశానికి దిక్సూచి లాంటిది రాజ్యాంగం. మనవరకు వచ్చేసరికల్లా బాబా సాహెబ్ అంబేద్కర్ ఠక్కున గుర్తుకు వస్తారు. అంతగా ఆయన కష్టపడ్డారు. స్వతహాగా బారిస్టర్ అయిన ఆయన నేటికీ పేదలు, ప్రజలకు ఆదరణీయమైన మేధావిగా..సంఘ సంస్కర్తగా ..దీన జనుల బాంధవుడిగా కొనియాడబడుతున్నారు.
ఎన్నో ఏళ్లు నిద్రహారాలు మాని ఈ దేశం కోసం..ప్రజల సంక్షేమం కోసం..జాతి అభ్యున్నతి కోసం..ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో భాగంగా దీనిని అద్భుతంగా తయారు చేశారు. దీని కోసం అంబేద్కర్‌తో పాటు 15 మంది విశిష్టమైన మహిళల పాత్ర కూడా ఉన్నది. వారెవరో తెలుసు కోవాలంటే..ఈ కథ చూడాల్సిందే. కేరళ రాష్ట్రంలోని పైఘాట్ జిల్లా అనక్కర గ్రామానికి చెందిన అమ్ము స్వామినాథన్ రాజ్యంగ తయారీలో పాలు పంచుకున్నారు. మద్రాస్‌లో 1917 సంవత్సరంలో ఉమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ఏర్పాటు చేశారు. ప్రజలందరి ఆలోచనలు ప్రతిఫలించేలా ఉండాలని ఆమె అభిలషించారు.
దాక్షాయని కొచ్చిన్‌కు చెందిన వారు . 1912 జూలై 4న జన్మించారు. బహుజనుల హక్కుల కోసం ఆమె పోరాడారు. ప్రతి ఒక్కరికి బతికే స్వేచ్ఛ..హక్కు ఉందన్నది ఆమె వాదన. ఈమె కూడా కానిస్టిట్యూషన్ తయారీలో కీలకంగా వ్యవహరించారు. బేగం అయిజాజ్ రసూల్ కూడా రాజ్యాంగ తయారీలో కీలక పాత్ర పోషించారు. ప్రిన్స్ ఫ్యామిలీ నుంచి ఆమె వచ్చారు. ముస్లిం లీగ్‌లో సభ్యురాలు. హిందూ..ముస్లింలు ఒక్కటవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రికి చెందిన దుర్గాబాయ్ దేశ్‌ముఖ్ కీలక భూమిక పోషించారు. హక్కులే కాదు బాధ్యతలు కూడా పంచుకోవాలని కోరారు. భారత స్వాతంత్ర సంగ్రామంలో స్వయంగా పాల్గొన్నారు.
నాన్ కోఆపరేటివ్ మూవ్‌మెంట్‌లో దుర్గాబాయ్ చురుకుగా వ్యవహరించారు. ఎన్నో విద్యా సంస్థలను స్థాపించారు. మహిళలకు ప్రాతినిద్యం ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలు లేకుండా ఏ సమాజం బాగుడలేదన్నారు. స్త్రీలు, యువత కోసం ప్రత్యేకంగా సంక్షేమ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆమె కూడా రాజ్యాంగ తయారీకి సంబంధించి అంబేద్కర్‌కు తోడ్పాటు అందించారు. హన్సా జివోజీ బరోడాకు చెందిన వారు. ఆమె కూడా కానిస్టిట్యూషన్ రూపొందించడంలో చురుకుగా పాల్గొన్నారు. లక్నో నగరంలో కమలా చౌదరి జన్మించారు. విద్యాధికురాలు. ఈమె కూడా రాజ్యాంగాన్ని రూపొందించడంలో ముఖ్య భూమిక పోషించారు.
అస్సాం రాష్ట్రానికి చెందిన లీలా రాయ్ మంచి ప్రావీణ్యం ఉన్న వారు. సమాజం పట్ల బాధ్యత కలిగిన వారు. మహిళలు ప్రజల సమస్యల గురించి స్వతహాగా తెలిసిన వారు. వీటన్నింటి గురించి అనుభవం కలిగిన ఆమె రాజ్యాంగ తయారీలో కీలకంగా వ్యవహరించారు. ఈస్ట్ బెంగాల్ ఇపుడు బంగ్లాదేశ్‌లో ఉంది..ఇక్కడే జన్మించారు..మాలతీ చౌదరి. అలహాబాద్ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలిగా ఉన్నారు ..
పూర్ణిమా బెనర్జీ. లక్నోలో 1869లో జన్మించిన రాజ్ కుమారి అమృత్ కౌర్, రేణుకా రే..గొప్ప సామాజిక కార్యకర్త. హైదరాబాద్‌కు చెందిన సరోజనీ నాయుడు భారత రాజ్యాంగ నిర్మాణ తయారీలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆమె చివరి వరకు అంబేద్కర్‌కు అన్ని అంశాల్లో చేదోడుగా నిలిచారు. హర్యానాలోని అంబాలా పట్టణానికి చెందిన సుచేతా కృపాలిని, అలహాబాద్‌కు చెందిన విజయలక్ష్మి పండిట్, తిరువనంతపురంకు చెందిన అన్నీ కేతరిన్ కీలకంగా వ్యవహరించారు.
పాలకులు మారినా ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఈ వ్యవస్థలో మహిళల పరిస్థితి దయనీయంగా ఉంది. 33 శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు పార్లమెంట్ ఒప్పుకోక పోవడం విచారకరం. పురుషాధిక్య సమాజంలో మహిళలు నానా ఇక్కట్లకు లోనవుతున్నారు. జాతి జీవన వికాసం కోసం ఏర్పాటు చేసుకున్న భారత రాజ్యాంగం తయారీలో మహిళలు కీలక పాత్ర వహించడం ప్రశంసనీయం. వారిని మిగతా మహిళలు ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి