కాసులు కురిపిస్తున్న కామెడీ
కామెడీ లేకుంటే లైఫ్‌కు కిక్కంటూ ఉండదు. కన్నీళ్లను గుండె వెనకాల దాచుకుని ఎంతో మందిని ఎంటర్ టైన్ చేసే కమెడియన్లు ఎందరో . చాలా మందికి హాస్యం అంటేనే సినిమాలు గుర్తుకు వస్తాయి. తెర కంటే ముందు వీధుల్లో, రచ్చకట్టల వద్ద నాటకాలు వేసే వాళ్లు తమ నైపుణ్యంతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తూ వచ్చారు. కామెడీ అన్నది ఆరోగ్యకరంగా ఉండాలి. అదిప్పుడు వెకిలితనం ముసుగు వేసుకుంది. ఎదుటివాళ్లను ఇబ్బంది పెట్టేలా, వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా కామెడీ రాజ్యమేలుతోంది. తమిళనాడులో వడివేలు, తెలుగులో బ్రహ్మానందం, బాలీవుడ్‌లో చాలా మంది కమెడియన్లు తమ హవా కొనసాగిస్తున్నారు. రాను రాను వారిని కాదని మరికొందరు సినిమా రంగంలోకి వచ్చారు. తమ క్రియేటివిటితో ఆకట్టుకుంటున్నారు.
జీవితాన్ని ప్రజెంటేషన్ చేయడంలో కామెడి కీలక పాత్ర పోషిస్తుంది. సినిమా అయితే ప్రత్యేకమైన పాత్ర వుండాలి. వారి కోసం కొత్తగా క్రియేట్ చేయాలి. ఇదంతా స్క్రిప్ట్ రచయితలు చూసుకుంటారు. ప్రతి మూవీలో కామెడీ లేకుండా, కమెడియన్ లేకుండా రిలీజ్ కావడం లేదు. అంటే అంతగా పాపులర్ అయ్యిందన్నమాట. సినిమా రంగం భారీ ఖర్చుతో కూడుకున్నది. దీనిని భరించాలంటే చాలా తాహత్తు ఉండాలి. మూవీస్ కంటే ముందు నాటకాలు కీలకమైన పాత్రను పోషించాయి. స్వాతంత్ర పోరాట కాలంలో, స్వేచ్ఛా వాయులు పీల్చాక నాటకాలకు జనం బ్రహ్మరథం పట్టారు. ఎస్‌వీ రంగారావు, ఎన్టీఆర్, గిరీష్ కర్నాడ్, కోట శ్రీనివాసరావు, ప్రకాశ్ రాజ్, తనికెళ్ల భరణి లాంటి నటులు ఎందరో డ్రామాల నుండి వచ్చిన వారే. సినిమాలో రాణించాలంటే ముందు నాటకాల్లో అనుభవం సంపాదించాలి. అపుడు పాత్రలను తేలిగ్గా అర్థం చేసుకోగలుగుతారు. వాటికి న్యాయం చేయగలుగుతారు.
నేటి ఆధునిక కాలంలో సైతం స్టేజ్ డ్రామాలకు డిమాండ్ వుంటోంది. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌కు చెందిన జకీర్ ఖాన్ ఇండియన్ కమెడియన్ గా రాణిస్తున్నారు. వేలాది మందిని తన కామెడి కాన్సెప్ట్ తో ఆకట్టుకుంటున్నారు. వీధుల్లో నాటకాలు వేస్తూ ..జనంలో ఫుల్ జోష్ నింపుతున్నాడు జకీర్. హే స్టాండప్ కామెడీ పేరుతో దుమ్ము రేపుతున్నాడు. రస్సెల్ పీటర్స్, జార్జ్ కార్లిన్ లు ఇదే కోవకు చెందిన వారు. వీరి ప్లాట్ ఫాం వెరీ డిఫరెంట్. వీరే మనోడికి ఆదర్శం. ఇంకేం ..కొంత మందిని పోగు చేసుకుని ..హాస్యాన్ని పండిస్తూ ..నాటకాన్ని బతికిస్తున్నాడు . ఢిల్లీ, ముంబై లాంటి నగరాల్లో జకీర్‌కు విపరీతమైన ఫాలోయింగ్. టైం స్లాట్ సరిపోక పోవడంతో జకీర్..సామాజిక మాధ్యమంలోకి ఎంటర్ అయ్యాడు.
సఖ్త్ లౌండా ఫిగల్ గయా పేరుతో కామెడీ ట్రాక్‌ను జత చేసి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. ఇంకేముంది ..లక్షల్లో వ్యూవర్స్ ..అనుకోని ఆఫర్లు..లెక్కలేనన్ని కామెంట్స్..తక్కువ టైంలో జకీర్ ఖాన్ పాపులర్ కమెడియన్లలో ఒకడిగా చేరి పోయాడు. స్టడీ పరంగా అంతగా రాణించక పోయినా ..జీవితంపై మంచి పట్టు కలిగి ఉండడంతో ఈ కమెడియన్ ..క్రియేటివిటికి పదును పెట్టాడు. భిన్నమైన కాన్సెప్ట్స్‌తో నాటకాలు వేస్తూ ..కాసులు సంపాదిస్తున్నాడు. నో గాడ్ ఫాదర్స్..నో పాలిటిక్స్..నో రెకమెండేషన్స్..జస్ట్ కాసింత తెలివి..కూసింత నమ్మకం..మనోడిని మరింత పాపులర్ గా మార్చేశాయి. సో మీరూ ట్రై చేయండి..మీ టాలెంట్‌కు పదును పెట్టండి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి