అతడు మాటల మాంత్రికుడు..!
తెలుగు సినిమా చరిత్రలో సక్సెస్ కు పెట్టింది పేరు ఆయన. తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న అతడు ఏది మాట్లాడినా ..ఇంకేమి చేసినా ఓ సంచలనమే . అలాంటి ఆయన తన కలం బలంతో మాటలతో మంటలు పుట్టిస్తున్నారు. తెలుగు సినిమాను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. మాటలకున్న మహత్తు ఏమిటో అతడిని చూస్తే తెలుస్తుంది. మనిషి జీవితం ఎంత గొప్పదో అర్థమవుతుంది. ఇంతగా చెప్పాల్సిన పేరు మరెవరో కాదు త్రివిక్రం . అంతా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే నిర్మాతలు , నటీనటులు అతడి పిలుపు కోసం ఎదురు చూస్తున్నారు . అదే ఆయన స్పెషాలిటీ . అదే ఆయనకున్న బ్రాండ్. కథ , స్క్రీన్ ప్లే , మాటల రచయితగా , దర్శకుడిగా ఇలా ఎన్నో రంగాలలో తనదైన శైలితో ఆకట్టుకుంటున్నారు . తెలుగు సినిమాను సుసంపన్నం చేస్తున్నారు .
డైలాగ్ రైటర్స్ కు మరింత గౌరవాన్ని తెచ్చి పెట్టారు. అభిమానులు ఆయన పేరుంటే చాలు సినిమాలకు వెళ్లడం అలవాటుగా మార్చుకున్నారు . ఇదీ ఆయన కలానికున్న బలమేమిటో చెపుతుంది . దారాల కంటే పలుచనైన బంధాలలోని ఔనత్యాన్ని ఒడిసి పట్టిన యోగి త్రివిక్రమ్ . ఆ తర్వాత నంబర్ వన్ స్థానానికి వెళ్ళాడు . ఆ ఉన్నతమైన మెట్టు ఎక్కేందుకు ఎన్నో తిప్పలు పడ్డాడు . మరెన్నో కన్నీళ్లను తనలో దాచుకున్నాడు. కమెడియన్ సునీల్ తో కలిసి నగరంలో తిరుగని రోడ్డు లేదు . రేయింబవళ్ళు పుస్తకాలతో కుస్తీ పట్టడం వాటిలో అంతర్లీనమైన భావ జాలాన్ని ప్రస్తుత సమాజానికి . కాలానికి సరిపోయేలా ..గుండెలకు హత్తుకునేలా రాసేందుకు అష్టకష్టాలు పడ్డాడు . తనకంటూ ఓ ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మాటల్ని దట్టించే తూటాలుగా వాడుకోవచ్చనే వాస్తవాన్ని త్రివిక్రమ్ చేసి చూపించాడు .
రచయితగా మొదట్లో ఓ వెలుగు వెలిగారు . ఆ తర్వాత మెలమెల్లగా డైరెక్షన్ రంగంలోకి అడుగు పెట్టారు . ఇంకేముంది అక్కడ కూడా తన మార్క్ తో రికార్డ్ బ్రేక్ చేసాడు . అతడు సినిమా కోట్లు కురిపించింది. అందులోని ప్రతి సన్నివేశం తెలుగువాడి నాడిని పట్టేసింది . గుండెల్ని పిండేసింది . అప్పటి దాకా పోకిరి పాత్రకే పరిమితమైన మహేష్ బాబు ను ఓ రోల్ మాడల్ గా తీర్చి దిద్దాడు . మొహంలో గాంభీర్యాన్ని .. కళ్లలో కోపాన్ని ..పాత్రల్ని డామినేట్ చేసే స్థాయికి తీసుకు వెళ్లారు . ఇక అప్పటి నుంచి నేటి దాకా వెనుతిరిగి చూడలేదు . పంచ్ లు .. ప్రాసలతో ఆకట్టుకున్నారు . తెలుగు సినిమా పోకడను ఒక్క సారిగా మార్చేశారు .
1999లో స్వయం వరం సినిమాతో మొదలైంది ఆయన ప్రస్తానం .. సునీల్, పవన్ కళ్యాణ్ తో చెలిమి , డైరెక్టర్ విజయ భాస్కర్ తో చనువు ఎక్కువ , సునిశితమైన హాస్యం , కన్నీళ్లను తెప్పించే వ్యంగ్యం . పాత్రల మధ్య చిలిపితనం త్రివిక్రమ్ సొంతం . అతడు ఓ సునామి లా చుట్టేసింది . 2005లో ఉత్తమ దర్శకుడిగా , మాటల రచయితగా చిరునవ్వుతో , నువ్వు నాకు నచ్చావ్ , నువ్వే నువ్వే , మల్లేశ్వరి సినిమాలకు పురస్కారాలు అందుకున్నారు . పదునైన సంభాషణలకు కేరాఫ్ గా మారిపోయారు . ఏ రసమైనా సరే క్లుప్తంగా సూటిగా మాటలు రాస్తారన్న పేరు తెచ్చుకున్నారు . పవర్ ఫుల్ డైలాగుల కోసం పడిపోయిన సందర్భాలు ఎన్నో . వాటిలో కొన్ని మరింత పాపులర్ అయ్యాయి.
నిజం చెప్పక పోవటం అబద్దం . అబద్దాన్ని నిజం చేయాలని అనుకోవడం మోసం . నాకు బతకటం రాదు . ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను . వీడు చూసేందుకు కాంప్లాన్ బాయ్ లాగా ఉంటాడు . కానీ చాలా కాంప్లికేటెడ్ బాయ్ అని తెలియదు . ఇంట్లో వున్న పూరి నచ్చదు కానీ ఆ చపాతి మొహం కావాలంట . అమ్మాయి అడగాలే కానీ సినిమాకేంటయ్య స్మశానికైనా వస్తా . ఇక జల్సా సినిమా అదరహో అనేలా చేసింది . పవన్ ను కొత్తగా చూపించాడు . మాటలతో మంటలు రేపాడు . బెదిరింపులకు భాష అక్కర్లేదు . యాస చాలు . పంటకు పురుగు పట్టకుండా మందు చల్లాడు . పని చేయలేదు . తాను తాగాడు పని చేసింది . నాకెప్పుడూ తొందర . పది నిమిషాల ముందర . అందుకే నా జీవితమంతా చిందర వందర . యుద్ధంలో గెలవటమంటే శత్రువును చంపటం కాదు ఓడించటం . జులాయిలో త్రివిక్రమ్ కలం మరింత పదునెక్కింది .
ఆశ క్యాన్సర్ వున్న వాడిని కూడా బతికిస్తుంది . భయం అల్సర్ వున్న వాడిని చంపేస్తుంది . ఖలేజా సినిమాలో మహేష్ మేనరిజం , మాటలు ఆకట్టుకునేలా చేశాయి . రెండేళ్ల గ్యాప్ తర్వాత పవన్ తో తీసిన సినిమా అత్తారింటికి దారేది సినిమా వసూళ్లు తీరుగా రాసింది . ఒక్కో డైలాగ్ త్రివిక్రమ్ కు వున్న పవర్ ఏమిటో చూపించింది . సింహం పడుకుంది కదా అని జూలుతో జేడెయ కూడదు ..అలాగే పులి పలకరించింది కదా అని పక్కన నిలబడి ఫోటో తీసుకోకూడదు రోయ్ .. ఆనందం ఎలా ఉంటదిరా .. వెతుకు .. డబ్బులో ఉంటదా ..లేదంటే వాళ్ళ వంటి మీద జాలువారే సబ్బు నీళ్ళల్లో ఉంటదా .. సార్ ఇదీ హైదరాబాద్ ..ట్రాఫిక్ చాలా బ్యాడ్ .. పెద్దమ్మ తల్లి ఫెమస్ గాడ్ . జీవితంలో ప్రతి సమస్య మనిషికి రెండు దారులు చూపిస్తుంది . ఒకటి ప్రేమతో ఉన్నది .. రెండు ద్వేషంతో నిండింది . ఎక్కడ నెగ్గాలో కాదురా ..ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు .. ఇలా ఆ ఆ సినిమా లో కూడా త్రివిక్రం తన మార్క్ తో ఆకట్టుకున్నాడు .
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది తర్వాత ఎంతో శ్రద్ధ పెట్టి తీసిన సినిమా అజ్జాతవాసి బాక్సాఫిస్ వద్ద బోల్తా కొట్టింది. త్రివిక్రం చెక్కు చెదరలేదు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. తన కలానికి పని చెప్పాడు. జూనియర్ ఎన్టీఆర్ తో అరవింద సమేత సినిమా తీశాడు. నిశ్శబ్ద విప్లవంలా ..తెలుగు సినిమా ఇండస్ట్రీని వూసూళ్లతో షేక్ చేశాడు. బాక్సాఫిస్ బద్దలు కొట్టాడు. ఓవర్ సీస్‌లో 100 కోట్లను కొల్లగొట్టింది. ఎన్టీఆర్‌కు మళ్లీ జీవం పోశాడు. గెలుపులో ఉన్న మజా ఏమిటో రుచి చూపించాడు త్రివిక్రం. అద్భుతమైన టేకింగ్. దుమ్ము రేపే ..తూటాల్లాంటి మాటలతో మంటలు రేపాడు. కరవు ప్రాంతంగా పేరొందిన రాయలసీమలోని ఓ మారుమూల పల్లెలో పాఠాలు చెబుతూ జీవిస్తున్న ఓ అనామక టీచర్ పెంచికలదాస్‌తో పాటలు రాయించాడు. ప్రతిభ ఎక్కడ ఉన్నా సరే గుర్తించే అలవాటు ఉన్న ఈ డైరెక్టర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. త్రివిక్రం ఇలాగే మాటలు రాస్తూనే ఉండాలి .మమ్మల్ని ఆనందపర్చాలి. ఏది ఏమైనా ఆయన తెలుగు సినిమాకు దక్కిన మణిపూస .. కాదంటారా ..!!
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి