ట్రిలియన్ డాలర్ల బిజినెస్ దాటేసిన రాస్తా
హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ కంపెనీ రాస్తా స్టూడియో ట్రిలియన్ డాలర్ల బిజినెస్ ను దాటేసింది. ఐటీ రంగంలో స్థాపించిన తక్కువ కాలంలోనే మోస్ట్ పాపులర్ కంపెనీగా పేరొందింది. స్టోరీస్‌కు వీడియోల ద్వారా ప్రాణం పోయడం దీని ప్రత్యేకత. డిజిటల్ మీడియాలో కొత్త పుంతలు తొక్కుతోంది. స్టోరీ టెల్లింగ్ అనే కాన్సెప్ట్ కాసులను కురిపిస్తోంది. యాడ్ ఫిల్మ్స్ మేకింగ్, కమర్షియల్ ప్రోగ్రామ్స్, కార్పొరేట్ వీడియోలు, ప్రొడక్ట్, డాక్యుమెంటరీ వీడియోస్, 2డి, 3డి వీడియో మేకింగ్, కెరీర్స్, ఈ లెర్నింగ్ ప్రోగ్రామ్స్, ఏరియల్, మ్యూజిక్ వీడియోస్, మోటివేషనల్, ఇన్సిపిరేషనల్ వీడియోస్‌ను రాస్తా స్టూడియో తయారు చేస్తుంది.
ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చూస్తుంది. స్టోరీ టెల్లింగ్ పేరుతో మేకింగ్ చేసిన వీడియోలకు గ్రాఫిక్ డిజైన్ జత చేసి వీడియో మిక్సింగ్ చేసి విడుదల చేసిన ప్రతి వీడియోకు వేలాదిగా లైకులు రావడం ప్రారంభమయ్యాయి. తక్కువ టైంలో వీడియోలకు జనాదరణ లభించింది. ఈ రాస్తా స్టూడియోను హైదరాబాద్‌కు చెందిన ప్రేంకుమార్ దీనిని ఏర్పాటు చేశారు.
ప్రతి మనిషికి ఓ కథ వుంటుంది. ప్రతి వ్యక్తికి ఓ చరిత్ర వుంటుంది. ప్రతి ప్రాంతానికి..పల్లెకు..పట్టణానికి ఓ ప్రత్యేకత వుంటుంది. గతం..వర్తమానం..భవిష్యత్ కలిస్తే ఓ సంపూర్ణమైన కథ తయారవుతుంది. దీనికి విజువల్స్ జత చేసి..ఆడియో, వీడియో మేకింగ్ చేయడం అన్నది క్రియేటివిటీకి సంబంధించిన అంశం. ఇందులో వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, గ్రాఫిక్ డిజైనర్స్, రైటర్స్, స్టోరీ టెల్లర్స్, వీడియో మేకర్స్, లోగో డిజైనర్స్, బ్రాండ్ ఇమేజ్ , కంటెంట్ , కాపీ ఎడిటర్లు, కంటెంట్ రైటర్లతో కలిపి వీడియోలను అర్ధవంతంగా, అద్భుతంగా తీర్చిదిద్దుతారు. ఇదంతా రాస్తా స్టూడియోకున్న క్రెడిబిలిటి. వరల్డ్ వీడియో మేకింగ్‌లో రాస్తా స్టూడియో టాప్ టెన్‌లో చోటు సంపాదించింది.
టెక్నాలజీని అనుసంధానం చేస్తూ సృజనాత్మకతకు పెద్దపీట వేస్తూ ..తయారైన వీడియోలకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ కంపెనీ ద్వారా వచ్చిన వీడియో మేకింగ్ కు ఫిదా అయిన కంపెనీలు ఆర్డర్స్ ఇవ్వడం మొదలు పెట్టాయి. హిందూస్తాన్ లీవర్ లిమిటెడ్, హెటిరో, ఫోనిక్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా, మైక్రోసాఫ్ట్, ఎల్‌వి ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్, ఐఎస్‌బీ, జివికె, మైట్రా, పిడబ్ల్యుసీ, ఫేస్‌బుక్, టిహబ్, అపొలో హాస్పిటల్స్, ఐకియా, సియంట్, గోద్రెజ్ ప్రాపర్టీస్ కంపెనీలు ఉన్నాయి.
హెచ్ ఐ ఎల్, సీడీకే గ్లోబల్, నాస్కాం, టీచ్ ఫర్ ఇండియా, బిహెచ్ ఇ ఎల్, రిచ్, అశోకా, అడ్మినిస్ట్రేటివ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, అశోకా యూనివర్శిటీ, తెలంగాణ సర్కార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, టై, ఎస్‌సీఎస్‌సీ, ల్యాంకో హిల్స్, టెడ్ ఎక్స్, ఆంట్రపెన్యూర్స్ ఆర్గనైజేషన్, ఇసిలాట్, నౌఫ్లాట్స్, కాల్ అంబులెన్స్, క్రెడాయి, వెగా, షోర్, జీఎంఆర్, జీహెచ్ ఎంసీ డిపార్ట్ మెంట్ తో పాటు కంపెనీలు రాస్తాస్టూడియో కంపెనీకి క్లయింట్లు.
ప్రతి కథకు ఓ ముగింపు ఉంటుంది..దానికి విజువల్స్‌ను ..సౌండ్‌ను జత చేస్తే అద్భుతమైన వీడియోలు మన ముందు వాలిపోతాయి. మన గుండెల్ని పిండేసేలా చేస్తాయి. వందలాది కంపెనీలు రాస్తా స్టూడియో వైపు పరుగులు తీస్తున్నాయి. బిలియన్ డాలర్లను దాటుకుని ట్రిలియన్ డాలర్లను దాటేసింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి