కాంట్రోవర్షియల్ కామెంట్స్..అంతటా హల్ చల్
తెలంగాణ ఎన్నికల దంగల్ పుణ్యమా అంటూ జనానికి మాంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరుకుతోంది. తక్కువ టైం..ఎక్కువ సభలు ఉండడంతో ఆయా పార్టీలు..అధినేతలు..స్టార్ క్యాంపెయనర్స్ క్యాచీ పదాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొందరు పరిధి దాటి పవర్ ఫుల్ పంచ్‌లతో రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. మాటలతో మంటలు రేపి..తూటాల్లాంటి పదాలతో ప్రతిపక్షాలు..విపక్షాలు విస్తుపోయేలా..విస్మయానికి గురి చేసేలా దమ్మున్న నేతగా తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆ పార్టీ అధినేత ..ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావకు పేరుంది. ఆయన ఏది మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. నిమిషాల్లో కోట్లల్లో అభిమానులు లైక్ చేస్తారు. విపక్షాలు సైతం వెయిట్ చేస్తారు. అంతగా ఆయన మాటలు పాపులర్ అయ్యాయి. పవర్ ఫుల్ డైలాగ్‌లు ప్రజలను మెస్మరైజ్ చేస్తున్నాయి.
కానీ ఆయన ఇటీవల ఎలక్షన్ క్యాంపెయిన్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో చేసిన కామెంట్స్ జనాన్నే కాదు ప్రతిపక్షాలను విస్మయానికి గురి చేశాయి. ఒకవేళ ఓడిపోతే ఫాం హౌస్‌లో పడుకుంటా. అక్కడే ఎంచక్కా వ్యవసాయం చేసుకుంటా. అన్న మాటలు వైరల్ అయ్యాయి. విపక్షాలకు అవే బలాన్నిచ్చాయి. తండ్రి ఇక్కడే ఉండాలి..కొడుకు కేటీఆర్ పారిపోకుండా పాస్ పోర్టులు మీ ఆధీనంల ఉంచుకోండి..ముందే చెబుతున్నా..జరగబోయే ఎన్నికల్లో మహకూటమిదే అధికారంలోకి వస్తుంది. మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మిషన్ భగీరథ. మిషన్ కాకతీయ ..ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో నొక్కేసిన కోట్లను కక్కిస్తాం. జనం సాక్షిగా అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ నేత ఎనుముల రేవంత్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇప్పుడా మాటాలు అంతటా హల్ చల్ చేస్తున్నాయి.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఆయన కేసీఆర్‌ను..ఫ్యామిలీని టార్గెట్ చేశారు. కేసీఆర్ పని అయిపోయింది..రాబోయే సర్కార్ మాదే. ప్రజా కూటమి మాది. కేసీఆర్ ఫాం హౌస్‌కు పోవడం ఖాయం అంటూ కామెంట్స్ చేశారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధినేత ఎల్. రమణ..గులాబీ దళపతి కుటుంబంపై మాట్లాడిన మాటలు వైరల్ అయ్యాయి. ప్రగతి భవన్‌ను ప్రజా ఆస్పత్రిగా మార్చేస్తాం. కల్వకుంట్ల కానిస్టిట్యూషన్ ను తరిమే రోజు దగ్గర్లోనే ఉందంటూ మాట్లాడారు. మేడ్చెల్ సభ సందర్భంగా సీపీఐ అధినేత చాడ వెంకట్ రెడ్డి చేసిన కామెంట్స్ ..కూడా ప్రభావం చూపాయి. నియంత పాలన..రాచరిక పాలనకు అంతం పాడాలి. దొరల గడీల తలుపులు తెరవాల్సి ఉందన్నారు.
ఇదే సందర్భంగా లక్షలాది ప్రజలను ఉద్దేశించి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గులాబీ అధినేత కేసీఆర్ ను టార్గెట్ చేశారు. ఆయన గెలిస్తే ఎవరికి లాభం. తెలంగాణకు నష్టం. కేసీఆర్ గెలిస్తే ఫాం హౌస్‌కే..ఓడిపోతే నష్టం. మరెందుకు ఓటు వేయడం. ఓటేస్తే బురద గుంటలో వేసినట్టే . గడీల పాలనకు అంతం పాడుదాం. కల్వకుంట్ల ఫ్యామిలీని ఫాం హౌస్‌కు పంపేద్దామంటూ చేసిన కామెంట్స్ దుమ్ము రేపాయి.
నేను బాద్‌షాను కాను కానీ కింగ్ మేకర్‌ను ఇదేదో ఆర్‌జీవీ, బోయపాటి శ్రీను, పూరీ జగన్నాథ్ సినిమాల్లోని డైలాగ్ అనుకుంటున్నారా కానే కాదు తెలంగాణలోని ఓ పొలిటికల్ పార్టీకి చెందిన లీడర్ మాట్లాడిన పవర్ ఫుల్ మాటలు ఇవి. ఇంత పవర్ ఫుల్ పంచ్‌లతో కూడిన పదాలు ఇపుడు వైరల్ అవుతున్నాయి. ప్రింట్, మీడియా, సోషల్ , డిజిటల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇదంతా హైదరాబాద్‌లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగిన ప్రచార సభలో ఎంఐఎం పారర్టీకి చెందిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ. ఆయన చేసిన ప్రసంగం, మాట్లాడిన మాటలతో ప్రధాన పార్టీలు పునరాలోచనలో పడ్డాయి. దేశంలో ఏ పార్టీ అయినా సరే..తెలంగాణలో ..అదీ హైదరాబాద్ గడ్డపై ఏర్పాటు చేయబోయే సర్కార్..దాని అధిపతి అంటే సీఎం తమకు తలవంచాల్సిందేనని కాంట్రోవర్షల్ కామెంట్స్ చేశారు. ఆనాటి గాంధీ నుండి నిన్నటి వైఎస్ఆర్, కిరణ్ కుమార్ రెడ్డి, రోశయ్యతో పాటు ఇవాళ్లీ ఆపద్దర్మ సీఎం కేసీఆర్ దాకా అంతా తమకు తల వంచాల్సిందేనని అన్నారు.
యమ స్పీడ్‌తో కారు దూసుకు పోవచ్చు..కానీ స్టీరింగ్ మా చేతుల్లో ఉందంటూ అక్బరుద్దీన్ బ్రదర్ అసదుద్దీన్ ఓవైసీ గతంలో కామెం చేశారు. ఆ వర్డ్స్ సోషల్ మీడియాల్‌లో వైరల్ అయ్యాయి. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత వీహచ్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితర పొలిటికల్ లీడర్లు చేసిన కామెంట్స్..క్యాచీ వర్డ్స్ కు యమ క్రేజీ ఏర్పడింది. మొత్తం మీద ఎన్నికల పుణ్యమా అంటూ ..జనానికి భలే ఎంజాయ్‌మెంట్ లభిస్తోంది. రోజుకో కామెంట్స్..క్రేజీ వర్డ్స్..తెలంగాణ ఎన్నికల దంగల్ రంజైన వాతావరణం నెలకొని వుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి