బిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ - ఇన్‌మొబి స‌క్సెస్

ప్ర‌తి ఇండియ‌న్‌కు అమెరికా ఓ క‌ల‌. అక్క‌డికి వెళ్లాల‌ని..డాల‌ర్లు సంపాదించాల‌ని. కానీ ఈ ఇండియ‌న్ కుర్రాడు ఏకంగా త‌న కంపెనీతో అమెరికా టెలికాం రంగాన్ని శాసించే స్థాయికి ఎదిగాడు. వ‌ర‌ల్డ్ మార్కెట్లో త‌న వాటాకు న‌మ్మ‌క‌మైన బ్రాండ్‌ను ఏర్పాటు చేశాడు. ఇది క‌ల కాదు.క‌థ అంత‌కంటే కాదు..జీవిత స‌త్యం. న‌వీన్ తెవారీ బెంగ‌ళూరు కేంద్రంగా ఇన్ మొబీ కంపెనీని స్థాపించాడు. దీని టార్గెట్ మొబైల్ అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ టెక్నాల‌జీ ద్వారా డేటా సేవ‌ల‌ను అందించ‌డం. బిగ్గెస్ట్ కంపెనీల‌న్నీ డేటా మీదే ఆధార‌ప‌డ‌తాయి.
ప్ర‌తి ఐటీ కంపెనీకి డేటా అన్న‌ది కీల‌కం. స‌ర్వీస్ ప్రొవైడ‌ర్స్ ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసుకుంటారు. ఇదంతా ఓ పెద్ద క‌థ‌. టెక్నాల‌జీలో క్లౌడ్ స‌ర్వీసెస్ తో స‌మానంగా డిజిట‌ల్ టెక్నాల‌జీ పోటీ ప‌డుతోంది. వ‌ర‌ల్డ్ వైడ్ మార్కెట్ ప‌రంగా చూస్తే వీటి మీదే ట్రిలియ‌న్ డాల‌ర్ల బిజినెస్ న‌డుస్తోంది. ప్ర‌తి కంపెనీకి డేటా ప్రాణం. దీని ఆధారంగానే అన్ని స‌ర్వీసులు అందుతాయి. బీపీఓ, కేపీఓ, సాఫ్ట్‌వేర్‌, హార్డ్ వేర్ అంతా ఈ టెక్నాల‌జీ ఆధారంగా ప‌నిచేస్తాయి.
ఇన్‌మొబి 32 బిలియ‌న్ డాల‌ర్లతో అమెరికాకు చెందిన కంపెనీల‌తో ఒప్పందం చేసుకోవ‌డం ఇండియ‌న్ ఐటీ రిలేటెడ్ సెక్టార్లో ఇదే మొద‌టిది. బిగ్గెస్ట్ డీల్‌గా పేర్కొన్నారు టెక్కీలు. తెవారీ యంగెస్ట్ ఫెలో. మోస్ట్ ఎక్ప్‌ప‌ర్ట్ ఇన్ డిజిట‌ల్ టెక్నాల‌జీ. అమెరికా టెలికాం సెక్టార్‌లో ప్ర‌ధాన భూమిక పోషిస్తున్న టెలికాం కంపెనీ పిన్‌సైట్ మీడియా ఇన్‌మొబితో డేటా సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు ఈ భారీ ఆఫ‌ర్ తో ముందుకు వ‌చ్చింది. ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ఒప్పందం చేసుకున్నాయి. ఇది ఓ రికార్డ్‌. ఈ ఒక్క కంపెనీనే కాదు ప‌లు కంపెనీలు డేటా విష‌యంలో ఇన్‌మొబి మీదే ఆధార‌ప‌డుతున్నాయి.
ఇంటెలిజెన్స్ సిస్టం ద్వారా ఆయా కంపెనీల‌కు డేటా అందించ‌డ‌మే కాదు..ఎంత మంది క‌స్ట‌మ‌ర్స్ , వ్యూవ‌ర్స్‌, వారికి ఎలాంటి యాడ్స్ న‌చ్చుతాయోనన్న ఆర్టిఫిసియ‌ల్ ఇంటెలిజెన్స్ తో అన‌లైజ్ చేస్తూ ఇస్తుంది ఇన్‌మొబి. అడ్వ‌ర్ టైజ్‌మెంట్ , మార్కెటింగ్ ప‌రంగా నార్త్ అమెరికాలో మేమే నెంబ‌ర్ అంటారు న‌వీన్ తెవారి. అక్క‌డ బిగ్ బాయ్స్ క్ల‌బ్ అన్న‌ది ఫేమ‌స్‌. అందులో టెలికాం కంపెనీలు, దిగ్గ‌జాలు, బిజినెస్‌మెన్స్‌..ఉంటారు. వారిలో కంపెనీ ప‌రంగా నేను కూడా ఒక‌డిగా ఉన్నానంటారు.
అమెరికా టెలికాం మార్కెట్లో స్ప్రింట్స్ కంపెనీకి వెరిజోన్ , ఏటీ అండ్ టీ కంపెనీల‌తో పోటీ ఉంది. వీటిని దెబ్బ తీయాలంటే మాతో జ‌తక‌ట్టాల్సిందే. డిజిట‌ల్ అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ ప‌రంగా ఈ రెండు కంపెనీలు ఫేస‌బుక్‌, గూగుల్ ల‌లో ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నాయి. ఈ రెండు సంస్థ‌ల నుండి భారీ మొత్తంలో ఆ కంపెనీల‌కు ఆదాయం స‌మ‌కూరుతోంది. ఇవే కాకుండా ప‌లు కంపెనీలు డేటా సేక‌ర‌ణ‌, నిల్వ‌, స‌ర‌ఫ‌రా దానిపైనే ఆధార‌ప‌డ్డాయి. ఒరిజాన్ కంపెనీకి ఓత్ కాంబినేష‌న్‌..క‌లిగి ఉంది. ప్ర‌క‌ట‌న‌ల వ‌ర‌కు వ‌చ్చేస‌రిక‌ల్లా యాహూ కంపెనీకి చెందిన ఏఓఎల్‌తో అనుసంధామై ఉన్న‌ది. ఏటీ అండ్ టీ కంపెనీ ప్ర‌క‌ట‌న‌ల్ని యాడ్ వ‌ర్డ్స్ పేరుతో ఇస్తున్నాయి. ఈ ఇయ‌ర్ సెకండాఫ్ వ‌ర‌కే 1.8 బిలియ‌న్ డాల‌ర్ల‌ను కొల్ల‌గొట్టింది .
డిజిట‌ల్ అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ ప‌రంగా చూస్తే ఓత్‌, యాడ్ వ‌ర్డ్స్ కంటే పిన్‌సైట్ వాటా త‌క్కువ‌. డేటా టెక్నాల‌జీ తో ప‌నిచేస్తున్న ఇన్‌మొబి సేవ‌లు తీసుకుంటే..ఆ రెండింటికి చెక్ పెట్ట‌వ‌చ్చ‌ని పిన్‌సైట్ భావించింది. స్ప్రింట్ వైర్‌లెస్ టెక్నాల‌జీలో అగ్ర‌గామి. అమెరికాలో నాలుగో స్థానంలో ఉంది. డేటా ప్రాసెసింగ్‌..మొబిలిటి క‌నెక్టెవిటి..క‌న్వ‌ర్ట‌బిలిటి ద్వారా ఏలొచ్చ‌న్న‌ది యుఎస్ కంపెనీ ఆలోచించింది. అందుకే అక్క‌డి మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేసే లోపే ఇన్ మొబితో అగ్రిమెంట్ కుదుర్చుకుని షాక్‌కు గురి చేసింది. టిమొబైల్ ద్వారా మూడో స్థానం సాధించింది టెలికాం రంగంలో.
స్ప్రింట్ డిజిట‌ల్ ఆఫీస‌ర్ రాబ్ రాయ్ మాత్రం టెలికాం రంగానికి మంచి ఊపునిస్తుంద‌న్నారు. స్ప్రింట్‌తో లాంగ్‌ట‌ర్మ్ రిలేష‌న్‌షిప్ కొన‌సాగుతుంద‌న్నారు న‌వీన్ తెవారి. 1.6 బిలియ‌న్ క‌న్సూమ‌ర్స్ క‌లిగి ఉన్నారు. 400 మిలియ‌న్ డాల‌ర్ల రెవిన్యూ సాధించింది. గూగుల్‌, ఫేస్‌బుక్ స్వంతంగా డేటా నిర్వ‌హిస్తుంటే.. ఇన్ మొబి మాత్రం యుఎస్ టెలికాం రంగాన్ని త‌న గుప్పిట్లోకి తెచ్చుకుంది. తన వాటా కోల్పోకుండా కాపాడుకుంటోంది. ఈ కంపెనీలే కాకుండా ఇత‌ర కంపెనీల‌కు ఔట్ సోర్సింగ్ ద్వారా డేటా సేవ‌లందిస్తోంది. యాడ్ కాల‌నీ, వుంగ‌ల్, చార్ట్ బూస్ట్ లాంటి దిగ్గ‌జ కంపెనీల‌కు సేవ‌లందిస్తోంది ఇన్ మొబి.
ఈ ఏడాది మొబైల్ అడ్వ‌ర్‌టైజ్‌మెంట్ టెక్నాల‌జీ ద్వారా 6 మిలియ‌న్‌ల‌కు పైగా యాడ్ రెవిన్యూ సాధించ‌నుంద‌ని అమెరికా ఫేమ‌స్ న్యూస్ ఏజెన్సీ రాయిట‌ర్స్ ఉటంకించింది. ఈ కాలం డిజిట‌లైజేష‌న్ దే. ఏది ఏమైనా క్లౌడ్‌, ఆండ్రాయిడ్ ..ఇక ఏ ఫ్లాట్ ఫాం అయినా టెలికాం మీద ఆధార ప‌డాల్సిందే. వీటికి డేటా ముఖ్యం.అది ఇండియ‌న్ ఇన్ మొబి చేస్తోంది. త‌న రికార్డుల‌ను తానే తిర‌గ రాస్తోంది. సో..న‌వీన్ తెవారీ సాధించిన ఈ అద్భుత విజ‌యం ఇండియాకు ద‌క్కిన గౌర‌వంగా భావించాలి

కామెంట్‌లు