చదువులో లాస్ట్..సక్సెస్‌లో ఫస్ట్
వారు ఉన్నత స్థాయి చదువులు చదువుకోలేదు. కానీ ఉన్నత స్థానాలను అధిరోహించారు. కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. స్వశక్తిని నమ్ముకున్నారు. వందలాది మందికి ఆదర్శంగా నిలిచారు. వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగారు. విజయం సాధించాలంటే డబ్బులు ఉండాల్సిన పని లేదని, చదువే అక్కర్లేదన్న వాస్తవం వీరిని చూస్తే తెలుస్తుంది. ప్రతి చరిత్ర ఓ పాఠం..మరో జీవితానుభవం. శోధిస్తే సాధించలేనిది ఏమీ ఉండదన్న మహాకవి శ్రీశ్రీ మాటలు వాస్తవమేనన్న విషయం బోధ పడుతుంది. వీరి లైఫ్ లో తెలుసు కోవాల్సిన అంశాలు
చాలా వున్నాయి. భిన్నంగా ఆలోచించడం..కష్టపడటం..ఫలితం కోసం వేచి చూడక పోవడం ఇవే మమ్నల్ని విజేతలుగా నిలిపాయని వారంటున్నారు.
పీసీ మహంతా - మోస్ట్ సక్సెస్ ఫుల్ పర్సన్ ఇన్ ఇండియా. కేరళలోని పేద కుటుంబానికి చెందిన మహంతా స్టోరీ వెరీ వెరీ స్పెషల్. కేవలం ఆరో తరగతి వరకు చదివారు. ఓ ఫాంలో కూలీగా పని చేశాడు. ప్రైవేట్‌గా చదువుకున్నాడు. ఏకంగా 62 కోట్ల టర్నవోర్ కంపెనీకి ఓనర్‌గా మారాడు. ఇది నిజంగా జరిగిన మన ముందున్న కథ. జనం అవసరాలను గుర్తించాడు. ఈ స్పీడ్ యుగంలో భోజనం చేసేందుకు కూడా తీరిక లేని పరిస్థితి నెలకొంది. దీనిని గమనించిన మహంతా ఏకంగా ఫాస్ట్ ఫుడ్ వైపు దృష్టి పెట్టారు. ఐడీ స్పెషల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీని ఏర్పాటు చేశాడు. వేలాది మందికి కొలువులు ఇచ్చాడు. ఏకంగా కాలికట్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో , బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో ప్రసంగించే స్థాయికి ఎదిగాడు. వ్యాపారానికి..విజయానికి చదువు అక్కర్లేదన్నది పీసీ మహంతాను చూస్తే తెలుస్తుంది కదూ.
గాడ్ ఫాదర్ లేని ఫేమస్ హీరో - బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోగా పేరు సంపాదించుకున్నాడు అక్షయ్ కుమార్. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఇండియన్ హీరోలలో అక్షయ్ పేరు కూడా ఉంది. టాలీవుడ్, కోలివుడ్, బాలీవుడ్‌లలో పేరొందిన హీరోలందరికీ ఇండస్ట్రీలో ఎవరో ఒకరు గాడ్ ఫాదర్ ను కలిగి ఉన్నారు. ముఖ్యంగా బాలీవుడ్‌లో ఖాన్‌ల త్రయం హవా కొనసాగుతోంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్‌లే ఏలుతున్నారు. సైఫ్ అలీ ఖాన్, రణ్‌వీర్ సింగ్, రణదీప్ హూడా , అభిషేక్ బచ్చన్, తదితరులు హవా కొనసాగిస్తున్న తరుణంలో అక్షయ్ కుమార్ ఒక్కడే ఒంటరిగా తనకంటూ ఓ బ్రాండ్ ఇమేజ్ స్వంతం చేసుకున్నాడు. కోట్లు సంపాదించాడు. వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తున్నాడు. మహిళలు ప్రతి నెలా ఎదుర్కొనే నెలసరి విషయంలో వారికి మద్ధతుగా ఏకంగా ప్యాడ్ మాన్ సినిమా తీశాడు అక్షయ్ కుమార్. మరి భారీ సక్సెస్ సాధించిన అక్షయ్ స్కూల్ వరకే చదివారంటే నమ్మగలమా.
వీర్ దాస్ - బెస్ట్ కమెడియన్ - బిలియనీర్ - వాట్ ఏ స్టోరీ ..బిహైండ్ వీర్ దాస్. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ కమెడియన్లలో ఇతను ఒకడు. భావోద్వేగాలను ఒడిసి పట్టు కోవడం..జనరంజకమైన ప్రోగ్రాంలు రూపొందించి ఎంటర్ టైన్ మెంట్ చేయడంలో దిట్ట. సోషల్ మీడియా దిగ్గజం నెట్ ఫ్లిక్స్ లో తనకంటూ ఓ స్పేస్‌ను ఏర్పాటు చేసుకున్న ఘనత ఈ కమెడియన్‌దే. ఇతడి ప్రోగ్రాంలకు వీవర్స్ విరగడి చూడడంతో ఆల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానల్స్ హెవీ డిమాండ్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి. బెస్ట్ కమెడియన్‌గా పేరు తెచ్చుకుని..కోట్లు సంపాదిస్తున్న వీర్ దాస్ ..చదువుకున్నది ఏమీ లేదు. జస్ట్ స్కూల్ వరకే..
వారెవ్వా సందీప్ మహేశ్వరి - లైఫ్‌ను..సొసైటీని..ప్రపంచాన్ని తన కెమెరాతో కళ్లకు కట్టినట్టు చూపించాడు. ఫోటోగ్రాఫర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఒక్క ఫోటో క్లిక్ మనిపిస్తే చాలు ..కోట్లల్లో లైక్‌లు..కామెంట్లు..అంతగా ఎక్స్ పర్ట్ సందీప్ మహేశ్వరి. ఆన్‌లైన్లో అత్యధికంగా అమ్ముడు పోయే ఫోటోలు ఈయన తీసినవే. ఇమేజెస్ బాజార్‌లో సందీప్ టాప్ ఒన్ ఫోటో గ్రాఫర్. మరి ఇంతటి సక్సెస్ సాధించిన సందీప్ కాలేజ్ డ్రాపవుట్ అంటే నమ్మశక్యం కావడం లేదు కదూ.
బిష్వ కళ్యాణ్ రథ్ - ఏమీ చదువు కోలేదు. ఏ కాలేజీకి వెళ్లలేదు. కానీ సామాజిక దిగ్గజంగా పేరొందిన యూట్యూబ్ మాధ్యమంలో బిష్వ కళ్యాణ్ దుమ్ము రేపుతున్నారు. కమెడియన్‌గా తక్కువ కాలంలోనే పేరొందారు. లక్షలాది వ్యూవర్స్‌ను సంపాదించుకున్నారు. కోట్లు సంపాదిస్తున్నారు. కళ్యాణ్ స్వంతంగా తయారు చేసిన వీడియోస్ పోస్టు చేసిన క్షణాల్లోనే వైరల్ అవుతున్నాయి. రికార్డులు బ్రద్దలు కొడుతున్నాడు మనోడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ కమెడియన్‌గా పేరొందిన బిష్వ మాత్రం ఏమీ చదువు కోలేదు. దేశ వ్యాప్తంగా పేరొందిన కాలేజీల్లో ఇనిస్పిరేషనల్ స్పీచెస్ ఇస్తున్నారు. సో..విజయానికి దగ్గరి దారులు లేవు.
ఐటీలో సంచలనం కైలాష్ కేట్కర్ - మహారాష్ట్రలోని ఓ మారుమూల పల్లెకు చెందిన వ్యక్తి ఏకంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసే వ్యక్తుల జాబితాలోకి చేరి పోయాడు. ఇది నమ్మగలమా..తప్పదు నమ్మాలి. అత్యంత స్ఫూర్తివంతమైన స్టోరీ ఇది. కుటుంబ పరిస్థితుల కారణంగా స్కూలుకు వెళ్లలేదు. కాలేజీ గడప తొక్కలేదు. బతుకు దెరువు కోసం పలు చోట్ల పనికి కుదిరాడు. ఉన్న కొద్దిపాటి సమయంలో కంప్యూటర్ క్లాసులకు వెళ్లాడు. వాటిపై పరిజ్ఞానం పెంచుకున్నాడు. హార్డ్ వేర్‌గా పరిణతి సాధించాడు. కొత్త టెక్నాలజీలో పట్టు సాధించాడు. కంప్యూటర్ కోర్సులు బోధించాడు. ఐటీలో తరుచూ కంప్యూటర్లు, ల్యాప్ టాప్‌లు, ట్యాబ్‌లకు వచ్చే యాంటీ వైరస్‌ను ఎలా కట్టడి చేయాలో..నిలువరించాలన్న దానిపై కసరత్తు చేశాడు. క్విక్ హీల్ పేరుతో యాంటి వైరస్ ను రూపొందించాడు..కైలాష్ కేట్కర్. ఇపుడది ఐటీ కంపెనీగా రూపాంతరం చెందింది. 200 కోట్ల రూపాయల బిజినెస్ సాధించింది. ఇదంతా కైలాష్ సాధించిన ఘనత. ఆయన పెద్దగా చదువు కోలేదు.కానీ కోట్లు సంపాదించారు.
కోట్లు కొల్లగొడుతున్న ప్రేమ్ గణపతి - ఎవరీ ప్రేమ్ గణపతి అనుకుంటున్నారా. మోస్ట్ సక్సెస్ ఫుల్ బిజినెస్‌మెన్ ఇన్ ఇండియా. ప్రపంచం తన వైపు తిప్పుకునేలా చేసుకున్న అత్యంత సాధారణ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి. కుటుంబంలో ఏడో సంతానం . బతుకు దెరువు కోసం ముంబయి బాట పట్టింది. అక్కడే పనికి కుదిరాడు. ఓ బేకరిలో రెండేళ్ల పాటు పని కుర్రాడుగా చేశాడు. తానెందుకు వ్యాపారం స్టార్ట్ చేయకూడదంటూ రోజూ ప్రతి ఒక్కరు కోరుకునే ..తినే దోసను ఎంచుకున్నాడు. నాణ్యత..రుచి..శుచి..శుభ్రత..ఇదే పాలసీని ఇంప్లిమెంట్ చేస్తూ ప్రేమ్ గణపతి ..మహారాష్ట్రలో దోస ప్లాజా పేరుతో రెస్టారెంట్ తెరిచాడు. మొదట్లో కొంత ఇబ్బంది ఎదురైనా ..జనం తండోపతండాలుగా రావడం ప్రారంభించారు. తక్కువ డబ్బులతో ప్రారంభించిన ఈ దోస ప్లాజా ..ఇపుడు ఇతర దేశాలకు విస్తరించింది. న్యూజిలాండ్, యుకె, యుఎస్, దుబాయి, సింగపూర్, తదితర దేశాలకు పాకింది. చిన్నపాటి ఐడియా..తనమీదున్న నమ్మకం ..వేలాది మందికి ఉపాధి కల్పించేలా చేసింది. కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందుతున్న ప్రేమ్ గణపతి ఎక్కువగా చదువు కోలేదు.
మీడియా మొఘల్ - సుభాష్ చంద్ర - ఇండియాలో ఎవరైనా మీడియా మొఘల్ ఉన్నారంటే ..అతడి పేరు చెప్పాల్సిందే. అతడే జగమెరిగిన సుభాష్ చంద్ర. జీ గ్రూప్ పేరుతో ఏకంగా 39 ఛానల్స్ సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్న అధినేత. వేలాది మందికి ప్రత్యక్షంగా,పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఘనత ఆయనదే. తెలుగు వాకిట జీ తెలుగు టాప్ ఛానల్ గా రాణిస్తోంది. ఉద్యోగుల స్వర్గధామంగా జీ గ్రూప్‌కు పేరుంది. ఎంటర్ టైన్ మెంట్ , స్పోర్ట్స్, ఐపీఎల్ ..ఇలాప్రతి రంగంలో సుభాష్ చంద్ర తనదైన ముద్ర వేశారు. పది వేల కోట్లకు పైగా తన వ్యాపారాన్ని విస్తరించారు. బియ్యం వ్యాపారిగా ప్రారంభమైన సుభాష్ చరిత్ర ఇపుడు మీడియా అధిపతిగా మారారు. కానీ ఆయన ఏమీ చదువుకోలేదు. కాలేజీకి వెళ్లలేదు.
మార్కెట్‌లో డబ్బులకు కొదువ లేదు. కావాల్సిందల్లా ఒడిసి పట్టు కోవడమే. దీనికి పెద్దగా పరిజ్ఞానం అక్కర్లేదు. క్లాసులకు వెళ్లాల్సిన పనిలేదు. ఏ పుస్తకాలు భట్టీ పట్టనక్కర్లేదు. పట్టుదల..కృషి..టైమ్ సెన్స్ కలిగి ఉండటమే. సక్సెస్ అదంతకు అదే వస్తుంది.
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి