యంగ్ క్రికెట‌ర్స్ కు అత‌డే దిక్సూచి

అండ‌ర్ -19 జ‌ట్టు ప్ర‌పంచ‌క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకుంది. కోట్లాది క్రిక‌ట్ అభిమానులు ఊపిరి బిగ‌ప‌ట్టి చూస్తున్నారు. క్రికెట్ కామెంటేట‌ర్స్ మాత్రం ఇండియాదే క‌ప్ అంటూ స్ప‌ష్టం చేస్తున్నారు. ఓ వైపు క్రికెట‌ర్లు..ఇంకో వైపు అభిమానులు..మ‌రో వైపు భార‌త దేశ అధ్య‌క్షుడు, ప్ర‌ధాని..త‌దిత‌రులంతా ఈ ఆట‌పైనే దృష్టి సారించారు. ఇంత ఉద్విగ్న‌త చోటు చేసుకున్నా ఒక‌రు మాత్రం మౌనంగా..ఏమీ తెలియ‌న‌ట్టు..త‌న‌కేమీ ప‌ట్టన‌ట్టు లాన్స్‌లో ఉండి పోయారు. ముఖంలో కానీ ఎలాంటి భావోద్వేగాల‌ను క‌నిపించ‌నీయ‌కుండా ఉన్న ఆ క్రికెట్ దిగ్గ‌జం ..ది వాల్ గా పేరు పొందిన రాహుల్ ద్రవిడ్‌. బ్యాట్స్‌మెన్‌గా..ఫీల్డ‌ర్‌గా..వికెట్ కీప‌ర్‌గా..కెప్టెన్‌గా..కోచ్‌గా ..మెంటార్‌గా..ప‌లు ఫార్మాట్‌ల‌లో రాణించిన ఈ క్రికెట్ ఆట‌గాడి గురించి ఎంత చెప్పినా త‌క్కువే.
దాయాది పాకిస్తాన్ టీం త‌మ‌కూ ద్రావిడ్ లాంటి ఆట‌గాడు అయివుంటే బావుండేద‌ని చెప్పారంటే ఆయ‌న‌కున్న క్రేజ్ ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు. మోస్ట్ డిపెండ‌బుల్ క్రికెట‌ర్‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయ‌న‌కు పేరుంది. క్రికెట్ రంగం నుండి తాను వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించిన‌ప్పుడు అభిమానులు ఒక్క‌సారిగా షాక్‌కు గుర‌య్యారు. ఎలాంటి ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఎదుర్కోకుండా క్రికెట్టే ప్రాణంగా భావించిన రాహుల్ చివ‌రి వ‌ర‌కు ఒక ప‌ద్ధ‌తిగా ఉన్నారు. దేశం కోసం ఆడాడు. త‌నకు ఎన్నో ఆఫ‌ర్లు వ‌చ్చినా వాటిని తిర‌స్క‌రించాడు. ఒకానొక ద‌శ‌లో ఇండియ‌న్ క్రికెట్ టీంకు కోచ్‌గా ప‌నిచేయ‌మ‌ని బీసీసీఐ కోరింది. కోట్ల రూపాయ‌ల ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. ఇంకొక‌రైతే ఓకే చెప్పేవారు. కానీ ద్ర‌విడ్ నాట్ ఏ క్రికెట‌ర్ హీ ఈజ్ ఏ కంప్లీట్ హ్యూమ‌న్ బీయింగ్ అంటాడు ఓ సంద‌ర్భంలో మాజీ కెప్టెన్ మ‌హ‌మ్మ‌ద్ అజ‌హ‌రుద్దీన్‌.
అజ్జూ భాయ్ కాలంలో ఎంద‌రో వెలుగులోకి వ‌చ్చారు. వారికి పూర్తి స్వేచ్ఛ‌ను ఇచ్చాడు. ఆ స‌మ‌యంలోనే బెంగ‌ళూరుకు చెందిన మిస్ట‌ర్ డిపెండ‌బుల్ రాహుల్ ద్ర‌విడ్ క్రికెట్ లోకి ఎంట‌ర్ అయ్యాడు. టెస్ట్ క్రికెట్‌లోను..వ‌న్డే జ‌ట్టులోను త‌న సేవ‌లందించాడు. క్రికెట్ నుంచి త‌ప్పుకున్నాక‌. ఐపీఎల్‌లో ఆడాడు. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు సార‌ధ్యం వ‌హించాడు రాహుల్‌. భార‌త్‌కు ఆణిముత్యాల్లాంటి యంగ్ క్రికెట‌ర్ల‌ను త‌యారు చేసే ప‌నిలో నిమ‌గ్న‌మ‌య్యాడు. ప్ర‌పంచం నివ్వెర పోయేలా మెరిక‌ల్లాంటి కుర్రాల‌ను ఎంపిక చేశాడు. వాళ్లు అద్భుతాల‌ను సృష్టిస్తున్నారు. ఒక‌ప్పుడు ఇండియా జ‌ట్టు ఆట‌గాళ్ల కోసం వెదికేది. ఇపుడు ద్రావిడ్ పుణ్య‌మా అంటూ ఆ బెంగ తీరి పోయింది. కాంపిటేష‌న్ పెరిగింది. ఒక్కో ఆట‌గాడు అన్ని ఫార్మాట్ల‌లో ఆడేలా త‌ర్ఫీదు ఇస్తున్నాడు ద్ర‌విడ్‌.
అండ‌ర్ -19 జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వాళ్లంతా రాహుల్‌ను దేవుడిగా భావిస్తారు. ఆయ‌న ఏది చెప్పినా పాటిస్తారు.
క‌ఠోర‌మైన శిక్ష‌ణ వారిని ఆయ‌న వైపు తిప్పుకునేలా చేశాయి. మెంటార్‌గా..వ్య‌క్తిత్వ వికాస నిపుణుడిగా..మేధావిగా..ఫిలాస‌ఫ‌ర్‌గా ..క్రికెట‌ర్‌గా ద్ర‌విడ్ వారిలో ఆత్మ విశ్వాస్వాన్ని నింపుతున్నారు. ఒక‌రు పోతే ఇంకొక‌రు వ‌స్తారు. కానీ ద్ర‌విడ్ లాంటి ఆట‌గాడు ఇండియాకు ఎంతైనా అవ‌స‌రం అంటారు..వ‌ర్ద‌మాన ఆట‌గాళ్లు. ఇండియ‌న్ ప్రైమ్ మినిష్ట‌ర్ మోడీ, భార‌త‌దేశ అధ్య‌క్షుడు సైతం ద్ర‌విడ్ సేవ‌ల‌ను కొనియాడారు. ఆయ‌న‌ను ప్ర‌త్యేకంగా అభినందించారు. ఇదంతా ద్ర‌విడ్‌కు ద‌క్కిన గౌర‌వం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాల‌న్న రాహుల్ ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది క‌దూ...

కామెంట్‌లు