జనం మెచ్చిన దేవుళ్లు..ఈ సివిల్ సర్వెంట్స్
ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి ఓ కల వుంటుంది. చదువు కుంటున్నవాళ్లు..విద్యపై ప్రేమను చంపుకోలేని వాళ్లు..అందరిదీ ఒకే గమ్యం..ఒకటే గమనం కూడా..అదే సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావాలను కోవడం. ఎన్నో ఏళ్ల శ్రమ..రేయింబవళ్లు కష్టపడటం. వృత్తి రీత్యా అత్యున్నతమైన సర్వీస్ సెక్టార్‌గా ఈ దేశంలో వినుతికెక్కిన పరిపాలన రంగం. దీనిని ఎంచు కోవడం..దక్కించు కోవడం అంటే మరో జన్మ ఎత్తడం లాంటిదే. అలాంటి సర్వీసెస్ ఎంపిక ప్రక్రియ చాలా క్లిష్టతరంగా ఉంటుంది. ప్రతి ఏటా లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షకు ప్రిపేర్ అవుతారు. కానీ కొద్ది మంది మాత్రమే ఎంపికవుతారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవలు అందించే భాగ్యం ఈ సర్వీసెస్ ద్వారానే సాధ్యమవుతుంది. అటు ప్రజలకు ఇటు ప్రజాప్రతినిధులకు మధ్య వారధిగా సేవలందిస్తారు. ఇలా ఎంపికై వివిధ సర్వీస్ సెక్టార్లలో పనిచేస్తూ జనం నీరాజనాలు అందుకుంటున్న వారు ఈ దేశంలో వేళ్ల మీద లెక్కించ వచ్చు. అలాంటి కోవలోకి కొద్ది మంది మాత్రం చేరిపోయారు. వారిలో వీరు మాత్రం వెరీ వెరీ స్పెషల్.
తుకారాం ముండే - వెరీ వెరీ స్పెషల్ ఆఫీసర్ ..మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఐ.ఏ.ఎస్ ఆఫీసర్. 2015 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వ్యక్తి. గత 12 ఏళ్ల కాలంలో 15 సార్లు ఆయన బదిలీ అయ్యారు. అయినా వెరవ లేదు. బెదర లేదు. అప్పగించిన ప్రతి శాఖను ఆయన ప్రక్షాళన చేశారు. పారదర్శకతకు పెద్దపీట వేశారు. అవినీతి అక్రమార్కుల భరతం పట్టారు. ఏకంగా బార్ లైసెన్సులను రద్దు చేయించారు. దీంతో అక్కడి సర్కార్ కు ఆయన తలనొప్పిగా మారారు. ట్రాన్స్‌ఫర్స్ చేసుకుంటూ పోయింది. ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. భూ, వాటర్ మాఫియాలను పరుగులు తీయించారు. ప్రభుత్వం వేతనాలు ఇస్తోంది..తిని కూర్చునేందుకు కాదు..ప్రజలకు జవాబుదారీగా వుండేందుకంటారు తుకారాం ముండే.
ప్రజల ఆరాధ్య దైవం పామే - ఇపుడు దేశమంతా ఆయన పేరే జపిస్తోంది. ప్రజలంతా ఆరాధ్య దైవంగా కొలుస్తున్న ఐఏఎస్ అధికారి ఆర్మ్‌స్ర్టాంగ్ పామే. మిరకిల్ మ్యాన్ ఇన్ మణిపూర్ గా ప్రసిద్ధి చెందారు. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండానే పనిలో నిమగ్నం కావడం ఆయన నైజం. పని పట్ల అంకితభావం..కచ్చితత్వం..సేవా గుణం పామే స్వంతం. 20 గంటల పాటు జనం కోసం పాటుపడతారు. ఎక్కడ సమస్య వుంటే అక్కడికి తక్షణమే వాలిపోతారు. తాను పని చేయడమే కాదు..తన తోటి సిబ్బంది..కింది వారితో కూడా అలా పని చేయిస్తారు. ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేకుండానే 100 కిలోమీటర్ల రోడ్డు వేయించిన ఘనత పామేది. తుసేమ్, తామెంగ్‌లాంగ్ ఊర్లకు రోడ్లే లేవు. విషయం తెలుసుకున్న పామే స్వంతంగా ఆ ఊళ్లకు వెళ్లారు. అక్కడి పరిస్థితిని దగ్గరుండి చూశారు. తానే రంగంలోకి దిగారు. వారికి రహదారి సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ రోడ్డును ఇపుడు పీపుల్స్ రోడ్‌గా పిలుస్తున్నారు. ఇదంతా పామే చలవే..
రీతూ మహేశ్వరి...అధికారుల్లో అగ్గిబరాటా..ఆమె పేరు చెబితే చాలు ..అక్రమార్కులు జడుసుకుంటారు. జనం మాత్రం ఆమె తమ పాలిట దేవత అంటారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఇపుడు ఆమె హాట్ టాపిక్ గా మారింది. కాన్పూర్ ఎలక్ర్టిసిటీ కంపెనీ లిమిటెడ్‌కు రీతూ ఉన్నతాధికారిగా నియమింపబడ్డారు. కంపెనీని నష్టాల బారి నుండి లాభాల్లోకి తీసుకు వచ్చింది. ప్రతి ఊరికి విద్యుత్ వెలుగులు వచ్చేలా చేశారు. అంతేకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లకు చుక్కలు చూపించారు. ప్రతి ఇంటికి విద్యుత్ సరఫరా అయ్యేలా కృషి చేశారు. తక్కువ ధరకే విద్యుత్ మీటర్లను బిగించేలా చేశారు. చీకటి నిండిన బతుకుల్లో వెలుగులు నింపారు మహేశ్వరి.
ఫ్రెండ్లీ పోలీస్ ఈ డీసీ రాజప్ప - ఎవరీ రాజప్ప అని అనుకుంటున్నారా..మోస్ట్ వాంటెడ్ ఐపీఎస్ ఆఫీసర్ ఇన్ కర్ణాటక. ముఖ్యమంత్రి పేరు చెబితే కొందరు చెప్పక పోవచ్చు..కానీ కన్నడ రాష్ట్రంలో రాజప్ప పేరు చెబితే చాలు ఇట్టే గుర్తు పడతారు. అంతలా పాపులర్ అయ్యారు ఆయన. నిర్లక్ష్యానికి మారు పేరుగా మారిన పోలీస్ వ్యవస్థను గాడిన పెట్టారు. కమ్యూనిటీ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో పోలీసులకు ప్రజలకు మధ్య సత్సంబంధాలు ఏర్పడేలా చేశారు. దీని వల్ల కేసులు తగ్గి పోయాయి. ట్రాఫిక్ కష్టాలు తీరి పోయాయి. జనం స్వచ్ఛందంగా పోలీస్ స్టేషన్‌ల వద్దకు రావడం ప్రారంభించారు. తమ గోడు వెళ్ల బోసుకునేలా రాజప్ప మంచి వాతావరణాన్ని కల్పించేలా కష్టపడ్డారు. రాజప్ప లాఠీ, పిస్టల్ పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ కానే కాదు..కలం పట్టుకున్న కవితా యోధుడు..కూడా..పోలీసుల కోసం నాలుగు పుస్తకాలు రాశారు. ఇటీవల వాటిని రిలీజ్ చేశారు.
42 ఏళ్లు..40 అవార్డులు - ఏమిటని ఆశ్చర్య పోతున్నారు. నిజం..ఎన్.పి.నరహరి ..సీనియర్ ఐఏఎస్ అధికారి..మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మోస్ట్ పవర్ ఫుల్ ఉన్నతాధికారిగా పేరు తెచ్చుకున్నారు. కేవలం 42 ఏళ్లలో 40 పురస్కారాలు అందుకున్న ఘనత ఆయనదే. 10 ఏళ్ల పాటు వివిధ ప్రాంతాలలో పనిచేశారు. సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్నారు. ఏ అధికారి చేయలేని గొప్ప పనిని ఆయన తలకెత్తుకున్నారు. ప్రతి చోటా..ఎక్కడికి వెళ్లినా సరే దివ్యాంగులకు సకల సౌకర్యాలు ఉండేలా కృషి చేశారు. ఇదే ఆయన గొప్పతనం. 2001 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి మరీ స్ర్టిక్ట్ ఆఫీసర్‌గా ఉండడమే తనకు ఇష్టమంటారు. కాదనడానికి మనమెవరం..
స్మితం జన హితం - దేశంలోనే ఆమె పేరు హాట్ టాపిక్. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం..కచ్చితమైన అధికారిణిగా తక్కువ కాలంలోనే పేరు తెచ్చుకున్నారు స్మితా సబర్వాల్. కరీంనగర్ కలెక్టర్‌గా అవినీతి అధికారులకు చుక్కలు చూపించారు. మెదక్ జిల్లా కలెక్టర్‌గా వందలాది కంపెనీలకు సీఆర్ ఎస్ కింద డబ్బులు చెల్లించేలా చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన బిడ్డల తల్లులను సన్మానించారు. అంతేకాదు తాను కూడా ఓ తల్లినేనంటూ భోరున విలపించారు. మార్క్ ఫెడ్ ఎండీగా మార్కెటింగ్ శాఖను ప్రక్షాళన చేశారు. గోదాముల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆమె పనితీరును మెచ్చి సీఎంఓలో అదనపు కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఇలాంటి అధికారి తమకు కావాలంటూ పలు జిల్లాల ప్రజలు కోరడం ఆమె పనితీరుకు నిదర్శనం.
మిష్రానా మజాకా - మార్పు ఎక్కడి నుంచో రాదు అది మనలోంచి రావాల్సిందే అంటారు ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఐపీఎస్ ఆఫీసర్ మిష్రా. 2012 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి సర్వీస్ సెక్టార్లో స్వల్ప కాలంలోనే మంచి పేరు తెచ్చుకున్నారు. లా అండ్ ఆర్డర్‌ను కంట్రోల్ చేస్తూనే విద్యా దానం అన్ని దానాల కన్న గొప్పదని చేసి చూపించారు. ఆచరణలోకి తీసుకు వచ్చారు. ఎక్కడ పిల్లలు కనిపించినా సరే వారిని బడిలోకి వెళ్లేలా చేశారు. పాఠాలు చెప్పడమే కాదు..వారికి సకల సౌకర్యాలు కల్పించేలా తీర్చిదిద్దారు. చదువు ఒక్కటే మనిషిని చేస్తుందంటారు మిష్రా..కీప్ ఇట్ అప్ అనక ఏం చేస్తాం.
యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ - కేరళ ప్రభుత్వంలో ఆమె పేరు చెబితే చాలు జడుసుకునే స్థాయికి తీసుకు వచ్చారు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ టీవీ అనుపమ. ఫుడ్ అండ్ సేఫ్టీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. బాధ్యతలు తీసుకున్న క్షణమే దాడులు చేయడం స్టార్ట్ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారి భరతం పట్టారు. కేసులు నమోదు చేయించారు. అంతటా పారదర్శకత ఉండేలా కృషి చేశారు. ఇల్లీగల్‌గా ట్రేడింగ్ జరిపే వారిని రఫ్రాడించారు. మొత్తం మీద అవినీతికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టారు అనుపమ.
అనుభవానికి దక్కిన గౌరవం - స్నేహలతా శ్రీవాత్సవ సీనియర్ ఐఏఎస్ అధికారిణి. పరిపాలనలో ఆమెకు అపారమైన అనుభవం ఉన్నది. ఎక్కడ ఏ చిన్న సమస్య వచ్చినా అంతా తానై పరిష్కరించేలా చేయడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. 1982 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన స్నేహలతా పలు శాఖల్లో ఉన్నతమైన పదవులు నిర్వహించారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటుకు, అవినీతికి తావీయకుండా కష్టపడ్డారు.
దీంతో ఆమె పనితీరును మెచ్చుకున్న కేంద్ర సర్కార్ ఏకంగా లోక్‌సభకు సెక్రటరీ జనరల్ పోస్టుకు ఎంపిక చేసింది. అనూప్ మిశ్రా స్థానంలో ఆమెను నియమించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 35 ఏళ్ల అనుభవం ఆమె ఉన్నతమైన పదవికి ఎంపిక చేసేలా దోహద పడింది.
దీంతో ఆమె పనితీరును మెచ్చుకున్న కేంద్ర సర్కార్ ఏకంగా లోక్‌సభకు సెక్రటరీ జనరల్ పోస్టుకు ఎంపిక చేసింది. అనూప్ మిశ్రా స్థానంలో ఆమెను నియమించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 35 ఏళ్ల అనుభవం ఆమె ఉన్నతమైన పదవికి ఎంపిక చేసేలా దోహద పడింది.
అపరాజితా రాయ్ - చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకున్న అపరాజితా రాయ్ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రజలకు సేవలందించేందుకు సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకున్నారు. ఏకంగా సిక్కిం రాష్ట్రంలో మొదటి ఐపీఎస్ ఆఫీసర్‌గా ఎంపికై చరిత్ర సృష్టించారు. ప్రజలకు పోలీసులకు మధ్య సంబంధాలు మెరుగు పర్చారు. ఎక్కడ కూడా భయం అనేది లేకుండా జనం నేరుగా తన వద్దకు వచ్చేలా రూల్స్ ఛేంజ్ చేశారు. ఇపుడు ఆమె లేకుండా మేం ఉండలేమంటున్నారు అక్కడి జనం.
సివిల్ సర్వీసెస్ అంటే జీతాలు, హోదా కాదు..ప్రజలకు అందుబాటులో ఉండటం..నిరంతరం సేవలందించడం..అంతే కాదు మానవీయ దృక్ఫథాన్ని కలిగి ఉండటం అంటారు..వీరంతా ..వీరిని చూసి నేర్చు కోవాల్సింది ఎంతో ఉంది కదూ...
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి