నిన్న దిన‌స‌రి కూలీ..నేడు ఐపీఎల్ క్రికెట‌ర్

ఇండియ‌న్ ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఇదో హాట్ టాపిక్‌. దేశ స‌రిహ‌ద్దులో ఎప్పుడూ తూటాల మోత‌తో ద‌ద్ద‌రిల్లే జ‌మ్మూ కాశ్మీర్ స్టేట్ నుండి ఓ కుర్రాడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు అత‌డే మంజూర్ ధార్‌. ఈ ఆట‌గాడికి ఎవ్వ‌రి స‌పోర్ట్ లేదు. బాండీపారా జిల్లాకు చెందిన ఈ కుర్రాడు..ఐపీఎల్ వేలం పాట‌ల్లో చోటు ద‌క్కించుకున్నాడు. పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ -9 జ‌ట్టు ధార్‌ను 20 ల‌క్ష‌ల‌కు వేలం పాట‌లో ద‌క్కించుకుంది. సైనికుల‌కు..ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య నిరంత‌రం యుద్ధం న‌డిచే ఈ స్టేట్ నుండి ఐపీఎల్‌లో ప్రాతినిధ్యం వ‌హించ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.
ఇండియా అంటేనే క్రికెట్‌. క్రికెట్ అంటేనే భార‌త్ అనే స్థాయికి చేరుకుంది ఈ ఆట‌. పుట్టింది ఇంగ్లండ్‌లో అయిన‌ప్ప‌టికీ ఇపుడ‌ది ప్ర‌పంచాన్ని శాసిస్తోంది. వ‌ర‌ల్డ్ మార్కెట్‌ను షేక్ చేసే స్థాయికి చేరుకుంది. బిగ్ షాట్స్‌, బిజినెస్ టైకూన్స్‌, ఫేమ‌స్ ప‌ర్స‌నాలిటీస్‌, బ‌డాబాబులు, కంపెనీలు, అఫీసియ‌ల్స్‌, ఎన్ ఆర్ ఐలు ..ఇలా చెప్పుకుంటూ పోతే అంతా క్రికెట్ జ‌పం చేస్తున్నారు. కోట్లాది రూపాయ‌లు కుమ్మ‌రిస్తున్నారు. ఐపీఎల్ ఆట కోలుకోలేని ఫీవ‌ర్‌ను క‌లుగ చేస్తోంది. అభిమానులు ఊగి పోతున్నారు. ఔత్సాహికులు కాసులు కుమ్మ‌రిస్తున్నారు. ఇదంతా ఓ మాయ‌. దీనిని సొమ్ము చేసుకునేందుకు కంపెనీలు క్యూ క‌డుతున్నాయి. ఎంట‌ర్ టైన్‌మెంట్ రంగంలో దిగ్గ‌జంగా పేరున్న సోనీ కంపెనీ ఏకంగా టెలికాస్ట్ హ‌క్కుల్ని వేల కోట్లు వెచ్చించేందుకు సైతం వెనుకాడ‌లేదంటే అర్థం చేసుకోవ‌చ్చు..దీనికున్న క్రేజ్ ఏమిటో.
టెస్ట్ క్రికెట్ నుండి ..వ‌న్డే క్రికెట్ ను దాటుకుని 20 - 20 దాకా సాగిన క్రికెట్ ప్ర‌స్థానం ..భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డును మ‌రింత సుసంప‌న్న‌మైన క్రికెట్ బోర్డుగా మార్చేస్తోంది. బీసీసీఐ ఇపుడు ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్‌ను శాసించే స్థాయిని అందుకుంది. దీని వెనుక బెంగాల్ దిగ్గ‌జం జ‌గ‌న్మోహ‌న్ దాల్మియా కృషి వుంది. క్రికెట్‌కు ఒక ఊపును..ఓ బ్రాండ్‌ను..ఓ గుర్తింపును..ఓ ఇమేజ్‌ను..క‌మ‌ర్షియ‌ల్ ట‌చ్‌ను క‌ల‌గ చేసిన ఘ‌న‌త దాల్మియాదే. క్రికెట్ అంటేనో ఓ జూదం..ఒక‌ప్పుడు..ఇపుడు టెక్నాల‌జీ మారింది..బంతికి..బ్యాట్‌కు మ‌ధ్య బెట్టింగ్ న‌డుస్తోంది. ఇండియాలో పీఎం మోడీ అంటే తెలియని ప‌ల్లెలు ఉంటాయోమో కానీ ..విరాట్ కోహ్లి..అజారుద్దీన్‌, ద్ర‌విడ్‌, స‌చిన్‌, క‌పిల్‌దేవ్‌, గంగూలీ, పాండ్యా, కుంబ్లే వీర్ల పేర్లు తెలియ‌ని వారు లేరు.
క్రికెట్ దెబ్బ‌కు పొలిటిక‌ల్ లీడ‌ర్లు త‌మ ప్ర‌చారాన్ని మానుకున్న సంద‌ర్భాలు కోకొల్ల‌లు. మ్యాచ్‌లు జ‌రుగుతుంటే ..చాలా ఆఫీసులు, ప్ర‌భుత్వ కార్యాల‌యాలు, కార్పొరేట్ కంపెనీల‌లోని ఉద్యోగులు ప‌నులు మానేసిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. దీనిని గ‌మ‌నించిన ఐటీ కంపెనీలు ఏకంగా త‌మ ఆఫీసుల్లో టీవీలు ఏర్పాటు చేశాయి. వెస‌లుబాటు ఉండేలా స్నాక్స్‌, టీలు కూడా స‌ర‌ఫ‌రా చేస్తున్నాయి. ఇదంతా క్రికెట్ కు ఉన్న ప‌వ‌ర్‌..క్రేజ్‌. టీ - 20 పేరుతో వ‌చ్చిన క్రికెట్ ఫార్మాట్ ..ప్ర‌పంచాన్ని ఊపేస్తోంది. కోట్లాది జ‌నం దీని కోసం వెయిట్ చేయ‌డం తో వ్యాపార దిగ్గ‌జాలు దీనిపైనే దృష్టి సారించారు. జీ గ్రూప్ ఛైర్మ‌న్ సుభాష్ చంద్ర ఇండియాలో మొద‌టిసారి ఇండియ‌న్ మాజీ కెప్ట‌న్ క‌పిల్‌దేవ్ తో హైద‌రాబాద్‌లో , ముంబైలో ప‌రిమిత ఓవ‌ర్ల‌తో పోటీ ఏర్పాటు చేశారు. అది అప్ప‌ట్లో స‌క్సెస్ కాలేక పోయింది. బీసీసీఐ దానిని ఒప్పుకోలేదు.
ఇవాళ మ‌రింత క్రేజ్ సంపాదించుకున్న టీ -20 రాను రాను ఐపీఎల్ గా మారింది. బెంగ‌ళూరు, హైద‌రాబాద్‌, రాజ‌స్థాన్‌, ముంబై , కాశ్మీర్ , త‌దిత‌ర స్టేట్స్ టీంలు దీనిలో పాలు పంచుకుంటున్నాయి. ఇత‌ర దేశాల‌కు చెందిన ఆట‌గాళ్ల‌ను వేలంపాట‌ల్లో తీసుకుంటున్నారు. ప్ర‌తిభ క‌లిగిన వారంద‌రికీ ఐపీఎల్ ద్వారా గుర్తింపు ల‌భిస్తోంది. నిరంత‌రం బుల్టెట్ల‌తో స‌హ‌వాసం చేసే కాశ్మీర్ ప్రాంతం నుండి మంజార్ ధార్ ను పంజాబ్ ఎంపిక చేసుకుంది. ఏ ఫార్మాట్ లోనైనా క్రికెట్ ఆడే ఈ కుర్రాడు..ఒక్క‌సారి ట‌చ్ చేస్తే చాలు సిక్స‌రే. అద్భుత‌మైన బ్యాట్స్‌మెన్‌గా ఉండ‌డంతో అన్ని ఫ్రాంచైజ్‌ల‌ను ఆక‌ర్షించాడు. ఈ దేశంలో ధార్ లాంటి వాళ్లు ఎంద‌రో ఉన్నారు. ఐపీఎల్ పుణ్య‌మా అంటూ ఇలాంటి వారికి చోటు ద‌క్కుతోంది.

కామెంట్‌లు