సార్వత్రిక ఎన్నికల్లో లగడపాటి సర్వే కలకలం - మహాకూటమి వైపే మొగ్గు
ప్రస్తుతం జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ల్యాంకో అధినేత లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే వివరాలు కలకలం రేపాయి. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఏపీ, దేశ వ్యాప్తంగా , ఇతర దేశాల్లో నివసిస్తున్న తెలుగు వారిని ఆశ్చర్యానికి గురి చేశాయి. ప్రధాన పార్టీలన్నీ లగడపాటి సర్వేలో ఏం వెల్లడిస్తున్నారోనంటూ దృష్టి సారించాయి. హైదరాబాద్‌లోని జూబ్లి హిల్స్‌లో తన నివాసంలో ఏ పార్టీకి ఎక్కడ సానుకూలంగా ఉంది..? ఎక్కడ ప్రతికూలత ఉంది..? అభ్యర్థుల వివరాలు ..బలాలు..బలహీనతల గురించి ధైర్యంగా ప్రకటించి సంచలనం రేపారు.
తాను ఎవరి పక్షం కానని..వ్యక్తిగతంగా ఎవ్వరికీ వకల్తా పుచ్చు కోవాల్సిన పనిలేదంటూ స్పష్టం చేశారు. అన్ని పార్టీల్లో తనకు కావాల్సిన మిత్రులు ఉన్నారని తెలిపారు. మొత్తం మీద ఓటింగ్ శాతం తగ్గితే తెలంగాణ ఎన్నికల్లో హంగ్ ఏర్పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని, కానీ ఓట్ల శాతం పెరిగితే అది ప్రజాకూటమికి మేలు చేకూర్చేలా ఉంటుందని ప్రకటించారు.
గత కొన్ని రోజుల నుండి తాము 119 నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించామని, అన్ని వర్గాల వారి నుండి అభిప్రాయాలను సేకరించామని పేర్కొన్నారు. జరగబోయే ఓటింగే కీలకమని..ఇదే అంతిమంగా ప్రామాణికం కాదన్నారు రాజగోపాల్. ఎక్కువ నియోజకవర్గాలు ఉన్న జిల్లాల్లో ప్రజాకూటమి వైపే అనూహ్యంగా ప్రజలు మొగ్గు చూపుతున్నారని వెల్లడించారు. మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలలో కూటమి..అధికార పార్టీ టీఆర్ ఎస్ అభ్యర్థుల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ఉందని..ఇక్కడ ఎవరు గెలిచినా తక్కువ ఓట్ల మెజారిటీ ఉంటుందన్నారు.
అత్యధికంగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలలో మహాకూటమి అభ్యర్థులే గెలుపు బాట పట్టనున్నారని తెలిపారు. అయితే మెదక్, వరంగల్, హైదరాబాద్‌లో టీఆర్ ఎస్ కు ఎక్కువ సీట్లు వస్తాయని..అనూహ్యంగా బీజేపీ నిజామాబాద్ జిల్లాలో పుంజుకోనుందని..ఎంఐఎం తన హవాను కొనసాగిస్తుందని..దాదాపు 20 చోట్ల స్వతంత్ర అభ్యర్థులు తమ ప్రతాపాన్ని చూపించ బోతున్నారని వెల్లడించారు. మొత్తంగా చూస్తే 46 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ..టీఆర్ ఎస్ 31 , ఎంఐఎం 8, బీజేపీ , ఇండిపెండెంట్లు అత్యధికంగా విజయం సాధించనున్నారని తెలిపారు.
ఈ సార్వత్రిక ఎన్నికల్లో హంగ్ వచ్చే అవకాశం లేదని..ఓటింగ్ శాతం పెరగనుందని ..ప్రజాకూటమి అధికారంలోకి రానున్నదని జోస్యం చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో మల్ రెడ్డి రంగారెడ్డి, నారాయణపేటలో శివకుమార్ రెడ్డి, మక్తల్‌లో జలంధర్ రెడ్డి, బోధన్‌లో జి.వినోద్ గెలవబోతున్నారని తెలిపారు. తెలంగాణలో అందరి చూపు గజ్వేల్ నియోజకవర్గంపైనే ఉన్నది.
కానీ ఇక్కడ మాత్రం టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఓడిపోతున్నారంటూ..అక్కడ ఒంటేరు ప్రతాప్ రెడ్డి గెలవ బోతున్నారని గులాబీ బాస్‌కు షాక్ ఇచ్చారు. రోజుకు గెలబోయే అభ్యర్థులలో ఇద్దరు అభ్యర్థుల వివరాలు వెల్లడిస్తామని లగడపాటి రాజగోపాల్ మరో షాక్ ఇచ్చారు. లగడపాటి సర్వేలో తమ పేర్లు ఉన్నాయో లేదోనని పోటీ చేస్తున్న అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఏది ఏమైనా రాజగోపాల్ మాత్రం ప్రస్తుత ఎన్నికల్లో హీరో అయి పోయారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి