ఐడియా వుంటే చాలు ..ఈజీగా బతికేయొచ్చు
కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలో ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతోంది. డిజిటల్ టెక్నాలజీ లో చోటు చేసుకుంటున్న మార్పులు వేలాది మందికి ప్రత్యక్షంగా ..పరోక్షంగా ఉపాధి అందుకునేలా చేస్తున్నాయి. ఐటీకి ధీటుగా టెలికాం, హెల్త్, ఫార్మసీ, ఏవియేషన్, లాజిస్టిక్ రంగాలు ఎదుగుతున్నాయి. పరిశ్రమలు పెట్టేందుకు ఉన్న నిబంధనల్లో టీఆర్ఎస్ సర్కార్ మార్పులు చేయడంలో పెట్టుబడిదారులు టీ హబ్ వైపు చూస్తున్నారు. ఐటీకి కేంద్రంగా ఉన్న యుఎస్, తదితర దేశాలు హైదరాబాద్‌ను సేఫెస్ట్ ఫ్లేస్‌గా ఎంచుకున్నాయి. చెన్నయ్, ఢిల్లీ, బెంగళూరుతో పాటు హైదరాబాద్ పోటీ పడుతోంది. ఇటీవల నిర్మాణ,రియల్ ఎస్టేట్ రంగాలు సైతం సై అంటున్నాయి.
సిమెంట్, స్టీల్ కు డిమాండ్ అమాంతం పెరగడంతో బిల్డర్స్ బెంబేలెత్తి పోతున్నారు. ఇక ఐటి రంగానికి వస్తే ఎక్కడలేనన్ని వెసలుబాట్లు, సబ్సిడీలు, సహకారాన్ని ఐటీ శాఖ అందిస్తోంది. స్టార్టప్ లను ప్రోత్సహిస్తోంది. ప్రత్యేకంగా క్రియేటివిటీ ఉన్న వారికి భారీ ప్రోత్సాహకాలను ఇచ్చి వెన్ను తడుతోంది. దీంతో కొత్త కొత్త ఆవిష్కరణలకు ఈ హబ్ వేదిక కాబోతోంది. వయస్సులో చిన్న వారైనప్పటికీ మేధస్సులో తామేమీ ఎవ్వరికీ తీసిపోమంటున్నారు ఇక్కడి స్టూడెంట్స్. నూతన ఆవిష్కరణలు..లెక్కలేనన్ని ఐడియాలతో ఐటీ హబ్ వెలిగి పోతోంది. సిటీ సెంటర్‌కు తలమానికంగా సైబర్ టవర్ నిలుస్తోంది. కుప్పలు తెప్పలుగా స్టార్టప్‌లు, కొత్త కంపెనీలు పుట్టుకు వస్తున్నా అందులో కొన్ని మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. మెల్లగా పుంజుకుంటున్నాయి.
సక్రమమైన ప్లాన్ లేక పోవడం. మెంటార్స్, ఇన్ ఫ్రా స్ట్రక్చర్ , తగినంత సిబ్బంది, ఫండింగ్ సపోర్ట్ అందక పోవడంతో కొన్ని స్టార్టప్‌లు ఆదిలోనే కునారిల్లి పోతున్నాయి. మరికొన్ని మెల మెల్లగా అంది వచ్చిన టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ స్టేబుల్‌గా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. దీని వల్ల కంపెనీలుగా, వేలాది మందికి ఉపాధి కల్పించేవిగా తయారవుతాయి. స్టార్టప్ నుండి కంపెనీగా పోకస్ అయ్యేంత దాకా నానా కష్టాలు పడాల్సి ఉంటుంది. సరైన మార్గదర్శకం లేకపోతే నష్టాలు చవి చూసే ప్రమాదం పొంచి వుంది. ఎక్కడెక్కడి నుండో ఫండ్ తీసుకు వచ్చి స్టార్టప్ స్టార్ట్ చేయాలను కోవడం తలకు మించిన భారమవుతుంది. దీనిని గమనించి సక్సెస్ అయిన వారిని కలిస్తే ..వారు ఎలాంటి పద్ధతులు పాటించారో అర్థమవుతుంది. దీని వల్ల కొంత మేర నష్టాలు లేకుండా ఉండేందుకు దారి దొరుకుతుంది.
టెక్నాలజీ పరంగా ప్రపంచ వ్యాప్తంగా నిమిష నిమిషానికి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. దీనిని అంది పుచ్చు కోవాలంటే బలమైన బ్యాక్ అప్ ఉండాలి. ఐటీ సెక్టార్‌లో తమ కెరీర్‌ను ఎంచుకుంటే మాత్రం ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూనే ఉండాలి. ఒక స్థిరమైన ప్లాట్ పాం అంటూ ఉండదు. ఇదే పెద్ద అవరోధం కూడా. అలాగని మొత్తం ఐటీ రంగమే కష్టమని అనుకోకూడదు. కష్టపడితే కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తే..టెక్నాలజీలోని ఛేంజెస్‌ను గుర్తించి అవగాహన కలిగి ఉంటే..మీ పంట పండినట్లే..డాలర్లు మీ చెంత చేరినట్టే. ఇప్పటికే ప్రపంచ మార్కెట్‌లో ఎన్నో ఐడియాలు రూపొందుతున్నాయి. మరికొన్ని అంకురాలుగా మారాయి. అలాంటి కోవలోకే ఓలా, స్నాప్ డీల్, ఫ్లిప్ కార్ట్ లాంటివే.
కేవలం ఐదు రూపాయలతో ప్రారంభమైన కామత్ హోటల్..ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. తన వ్యాపారాన్ని కోట్లల్లోకి తీసుకెళ్లింది. ఇదంతా సర్వీస్ తో పాటు రుచికరమైన ఆహారం, పదార్థాలు, నాణ్యత కూడా. ఆయన సక్సెస్ స్టోరీని పలు రాష్ట్రాలలో నామ వాచకంగా పెట్టారు. అదే ఇడ్లి..ఆర్కిడ్..ఆకాశం పేరుతో తెలుగులో యుండమూరి రాశారు. చాలా ప్రోత్సాహకరమైన కథనం. కొన్ని తరాలకు సరిపడా ఆయన తన అనుభవాన్ని పంచుకున్నారు. సక్సెస్ ఈజ్ నాట్ ఏ జర్నీ..ఇట్స్ ఏ రియల్ లైఫ్ అంటారు.
సో ఐడియాలు అందరికి వస్తాయి. కానీ కొందరే వాటిని ఆచరణలోకి తీసుకు వస్తారు. సమాజానికి ఉపయోగపడేలా మన ఆలోచనలు ఉండాలి. పది మందికి సాయం చేసేదిగా, టెక్నాలజీతో కలిసి ఉండేలా చూడాలి. భవిష్యత్‌లో ఎక్కడైనా అప్లికేబుల్ అవుతుందనుకుంటే ..ఎవ్వరైనా పెట్టుబడి పెట్టేందుకు రెడీగా ఉంటారు. కావాల్సిందల్లా మనమీద మనకు నమ్మకం కలిగి ఉండటం. ఒకవేళ దైర్యంతో స్టార్టప్ ను స్టార్ట్ చేసినా..సక్సెస్ కాలేక పోయినా నిరాశకు గురి కావద్దు. మరో ఐడియాతో ముందుకు వెళ్లాలి. డిఫరెంట్‌గా ఆలోచించాలి. భిన్నంగా ప్రజెంట్ చేయాలి. వేల మందికి లేక పోయినా కనీసం కొద్ది మందికైనా ఉపాధి కల్పించేలా మన ఐడియా ఉండాలి. లేక పోతే టైం వేస్ట్..మనీ వేస్ట్..అవుతుంది.
ఒక్క ఐడియా జీవితాలను మారుస్తుందో లేదో తెలియదు కానీ..కాసులు మాత్రం కురిపిస్తుందన్నది వాస్తవం. బస్సు కోసం నిరీక్షించిన ఓ కుర్రాడికి వచ్చిన ఆలోచనే ఇవాళ కోట్లకు పడగలు ఎత్తేలా చేసింది..అదే అభీబస్.కామ్. కారు కోసం ఎందుకు వెయిట్ చేయాలి..బుక్ చేస్తే చాలు..అనుకున్నదే తడవుగా పుట్టిందే ఊబెర్, ఓలా ..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..మరెన్నో..కావాల్సిందల్లా పట్టుదల. నమ్మకం. ఇవే మూల ధనం...ఇంధనం కూడా.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి