40 ఏళ్లలో ఒక రోజు సెలవు తీసుకున్న మాజీ ప్రధాని
ప్రపంచ ఆర్థిక వేత్తలలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరొందారు. మంత్రిగా, ప్రధాన మంత్రిగా ఆయన బాధ్యతాయుతంగా విధులు నిర్వహించారు. పీవీ నరసింహారావు హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆర్థికపరమైన అంశాలపై ఆయనకు మంచి పట్టుంది. పలు పదవులు, అవార్డులు, పురస్కారాలు పొందారు.
అనుకోకుండా పీఎం పదవిని పొందిన ఆయన పలు సంస్కరణలకు తెర తీశారు. ఆర్థిక రంగాన్ని గాడిన పెట్టారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉన్నారు. 2004 మే 22న పీఎంగా బాధ్యతలు స్వీకరించారు. విద్యా పరంగా ఇంతటి ప్రతిభావంతమైన పీఎంగా ఎవరూ పని చేయలేదు.
పంజాబ్‌లో 1932 సెప్టెంబర్ 26న జన్మించిన మన్మోహన్ సింగ్ విద్యాధికుడు. బెస్ట్ ఎకానమిస్ట్‌గా పేరొందారు. ఛండీగడ్ నుండి 1954లో మాస్టర్స్ డిగ్రీ చేశారు. 1962లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్శిటీ నుండి డాక్టరేట్ పొందారు. 1957 నుండి 59 వరకు లెక్చరర్‌గా, 1959 ఉండి 63 వరకు రీడర్‌గా, 1963 నుండి 65 వరకు పంజాబ్ యూనివర్శిటీలో ఎకానమీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఢిల్లీ యూనివర్శిటీలో ప్రొఫెసర్‌గా, జెఎన్‌యులో గౌరవ ప్రొఫెసర్‌గా , విదేశీ వాణిజ్య మంత్రాలయం లో ఆర్థిక సలహాదారుగా మన్మోహన్ పనిచేశారు. 1972 నుండి 1976 వరకు ప్రధానికి విత్త సలహాదారుగా ఉన్నారు.
1980 వరకు ఆర్బీఐ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఇండియా తరపున ప్రత్యామ్నాయ గవర్నర్‌గా విధులు నిర్వర్తించారు. 1990 ఏప్రిల్ వరకు భారత ఆర్థిక శాఖకు కార్యదర్శిగా, అణుశక్తి ,అంతరిక్ష కమిషన్లకు సభ్యుడిగా ఉన్నారు. 1982 వరకు ప్లానింగ్ కమిషన్ సభ్యుడిగా, కార్యదర్శిగా , 1985 వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా పనిచేశారు.
1985 వరకు ఐఎంఎఫ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఇండియా తరపున ప్రత్యామ్నాయ గవర్నర్‌గా, ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా, 1987 విరి ప్లానింగ్ కమిషన్ కు డిప్యూటీ ఛైర్మన్‌గా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టారు.
జెనీవాలోని సౌత్ కమిషన్‌కు సెక్రటరీ జనరల్ తో పాటు కమిషనర్‌గా , 1991 వరకు ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుగా, యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ ఛైర్మన్‌గా, 1996 వరకు కేంద్ర ఆర్థిక మంత్రిగా , 1991లో అస్సాం నుండి కాంగ్రెస్ పార్టీ నుండి రాజ్యసభ సభ్యుడిగా విజయం సాధించారు.
1995 జూన్‌లో తిరిగి ఎంపీగా ఎంపికయ్యారు. 1997లో వ్యాపారరంగ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా , 1998 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా , ఆర్థికరంగంపై వేసిన కమిటీలో సభ్యుడిగా, కమిటీ ఆన్ రూల్స్, కమిటీ ఆఫ్ ప్రివిలైజెస్, ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ సభ్యుడిగా ఉన్నారు.
2001లో తిరిగి రాజ్యసభకు మన్మోహన్ సింగ్ ఎన్నికయ్యారు. ఆర్థిక రంగంపై ఎన్నో పుస్తకాలు రాశారు. 1956లో కేంబ్రిడ్జ్ యూనివర్శిటీ నుండి ఆడంస్మిత్ ప్రైజు, 1993లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరోమనీ పురస్కారం, ఏసియా మనీ అవార్డు పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా దేశీయ, అంతర్జాతీయ సంస్థల్లో సభ్యుడిగా, డైరెక్టర్‌గా, ఛైర్మన్‌గా పదవులు నిర్వహించి విశిష్ట సేవలందించారు.
ఈ 40 ఏళ్ల కాలంలో కేవలం ఒకే ఒక్క రోజు మాత్రమే సెలవు తీసుకున్నారంటే ఆశ్చర్యం వేయక మానదు. కొద్దిసేపు కష్టపడితే చాలు రెస్ట్ తీసుకునే యువతీ యువకులు ఉన్నకాలంలో, ఖాళీ గా వారంలో ఒక రోజు సెలవు ఇవ్వక పోతే నానా యాగీ చేయడం చూస్తున్నాం. కానీ ప్రపంచం మెచ్చిన ఈ ఎకానమిస్ట్, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం కొన్నేళ్ల పాటు అవిశ్రాంతంగా తన విధులను నిర్వహించారు. ఈ దేశం కోసం తన మేధస్సును తాకట్టు పెట్టాడు. ఇలాంటి వ్యక్తులు ఉన్నందుకు భారత్ గర్విస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి